Friday, March 5, 2021

ఏలూరు దుర్ఘటన పై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి – పత్రికా ప్రకటన

అమరావతి/ఏలూరు

టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..

ఏలూరు దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది.

– తక్షణమే ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

– పారిశుద్యం, ప్రజారోగ్యం మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలి.

– ఏలూరులో పరిస్థితులు మరింత అధ్వానం కాకుండా చర్యలు చేపట్టాలి.

– బాధితులకు అత్యున్నత వైద్యసేవలు అందించాలి.

– పత్రికా ప్రకటనలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్

★ జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో అంతుపట్టని వ్యాధితో ఒకరు మృతి చెందడం, అనేకమంది అచేతనులు కావడం, 250మందిపైగా ఆసుపత్రిపాలైన దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది.

★ ప్రజారోగ్యం పట్ల వైసిపి ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఈ సంఘటన అద్దం పడుతోంది.

★ 18నెలలుగా కనీసం తాగునీటి వనరులను శుద్ది చేసే చర్యలు, క్లోరినేషన్ లేకపోవడం వైసిపి నిర్లక్ష్యానికి నిలువుటద్దం.

★ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇటువంటి దుర్భర పరిస్థితులు నెలకొనడం మరీ విషాదకరం.

★ అచేతనంగా ఉన్న తన బిడ్డను కాపాడాలని ఆరోగ్యమంత్రిని కోరుతూ చిన్నారి తల్లి సెల్ఫీ వీడియో రాష్ట్రంలో విషాద పరిస్థితులకు ప్రతిబింబం.

★ మిగిలిన 12 జిల్లాల్లో ప్రజారోగ్యం, పారిశుద్య దుస్థితులకు ఏలూరు ఉదంతమే తార్కాణం.

★ ప్రజారోగ్యంతో వైసిపి నాయకుల చెలగాటానికి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరం.

★ ఏలూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో 6ఏళ్ల చిన్నారి నుంచి 60ఏళ్ల వృద్దుల వరకు నోట నురుగుతో, మూర్ఛ వచ్చినట్లు నేలపై కొట్టుకుని అనేకమంది విలవిల్లాడుతుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి మొక్కుబడి స్పందన, కంటితుడుపు చర్యలే తప్ప సత్వర వైద్యం, ఉపశమన చర్యలు చేపట్టకపోవడం బాధ్యతారాహిత్యం.

★ ఇదేదో మాస్ హిస్టీరియాగా చిత్రించి నీటి కాలుష్యం లేదని ముందే నిర్ధారించడం వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమే..

★ జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక 18నెలలుగా 13జిల్లాలలో 110పట్టణాల్లో ప్రజారోగ్యం, పారిశుద్యం పడకేశాయి.

★ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే లేదు. ప్రజారోగ్యంలో, పారిశుద్యంలో ఘోరంగా విఫలం అయ్యారు.

★ గాలికబుర్లు, గాలి పనులతో గాలి పాలన చేస్తున్నారే తప్ప కనీసం తాగేనీళ్లు కూడా పరిశుద్దమైనవి ఇవ్వలేక పోవడం ఘోర వైఫల్యం.

★ మొన్న భారీ వర్షాలు, వరదల్లో, ఇప్పుడు ప్రజారోగ్యంలో, ప్రతి విపత్తులోనూ ముందస్తు సంసిద్దత ఈ ప్రభుత్వంలో పూర్తిగా కొరవడింది.

★ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన ప్రజారోగ్య పరిస్థితులకు ఏలూరు దుర్ఘటన ఒక తార్కాణం.

★ ఎంతో అభివృద్ది చెందిన ప్రస్తుత ఇంటర్నెట్, ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ రోజుల్లో కూడా ప్రాథమిక అవసరాలైన రక్షిత తాగునీరు కూడా ప్రజలకు అందించలేక పోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు.

★ ఇంతకన్నా ఘోర వైఫల్యం మరొకటి లేదు, ఇదొక హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి..

★ రాష్ట్రంలో ఒకవైపు కరోనా, మరోవైపు అంటువ్యాధులతో ప్రజానీకం తల్లడిల్లుతోంది.

★ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.

★ గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అల్లాడుతున్నారు.

★ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లు, డాక్టర్లు జూనియర్ డాక్లర్లు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు, పారిశుద్య కార్మికులు, 108, 104, చివరికి కరోనా పరీక్షలు చేసే అంబులెన్స్ ల సిబ్బంది కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేసే దుస్థితి తెచ్చారు.

★ కరోనా కల్లోలంలో కూడా వైసిపి నాయకులు కరప్షన్ కు పాల్పడ్డారు.

★ కరోనా కిట్ల కొనుగోళ్లలో, మాస్క్ ల సరఫరాలో, బ్లీచింగ్ కొనుగోళ్లలో, అంబులెన్స్ ల కొనుగోళ్లలో అవినీతి కుంభకోణాలు చేశారు.

★ బ్లీచింగ్ జల్లితే చాలు, పారాసిటమాల్ వేస్తే చాలన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనాలు.

★ విశాఖలో డాక్టర్ సుధాకర్, చిత్తూరులో డా అనితారాణి, విజయవాడలో డా రమేష్ బాబు, డా గంగాధర్, నరసరావుపేటలో డా అరవింద్ బాబు ల పట్ల వైసిపి ప్రభుత్వ దుర్మార్గ చర్యలను ప్రజలంతా చూశారు.

★ ప్రపంచం అంతా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి పూలు జల్లి నీరాజనాలు పలికితే మన రాష్ట్రంలో వైద్యులపై తప్పుడు కేసులు, వేధింపులు వైసిపి శాడిజానికి పరాకాష్ట.

★ డ్రైనేజి బాగుచేయకుండా సీవరేజ్ సెస్ ఎలా పెంచుతారు..?

★ రోడ్లపై గుంతలు పూడ్చకుండా రోడ్ సెస్ ఎలా పెంచుతారు..?

★ సురక్షిత తాగునీరు ఇవ్వకుండా ఏటా వాటర్ సెస్ 5% చొప్పున ఎలా పెంచుతారు..?

★ పట్టణాలు, నగరాల్లో తాగునీరు, పారిశుద్యం కనీస సదుపాయాలు కల్పించకుండా పన్నులు పెంచే అధికారం మీకెక్కడిది..?

★ వీటన్నింటిపై అసెంబ్లీలో చర్చకు రాకుండా నిరంకుశంగా వ్యవహరించారు.

★ ఈ సమస్యలపై నిలదీస్తామనే ప్రతిరోజూ సభనుంచి టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

★ వైసిపి మూర్ఖపు చేష్టలకు రాష్ట్రం బలికావడం బాధాకరం.

★ తక్షణమే ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

★ ప్రత్యేక వైద్య బృందాలను, తాగునీటి పరీక్షా బృందాలను, పారిశుద్య బృందాలను పెద్దఎత్తున తరలించాలి, నగరంలో పరిస్థితులు మరింత అధ్వానం కాకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.

★ తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలి.

★ ఇకనైనా సిఎం జగన్మోహన్ రెడ్డి తన నిర్లక్ష్య ధోరణికి స్వస్తి చెప్పాలి.

★ ఏలూరు దుర్ఘటనలు పునరావృతం కాకుండా శ్రద్దపెట్టాలి.

★ రాష్ట్రంలో గాడితప్పిన పరిపాలన చక్కదిద్దాలి.

★ అన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రజారోగ్యం, పారిశుద్యం మెరుగుపర్చాలి.

★ ఆయా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles