Monday, March 1, 2021

టీడీపీ అధికార ప్రతినిధి శ్రీ గంజి చిరంజీవి పత్రికా సమావేశం

అమరావతి (కడప జిల్లా/ప్రొద్దుటూరు)

టీడీపీ అధికార ప్రతినిధి, శ్రీ గంజి చిరంజీవి పత్రికా సమావేశం వివరాలు..

వైసీపీ ఆటవిక పాలనకు టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యే నిదర్శనం.

– చేనేత వర్గానికి చెందిన సుబ్బయ్యను దారుణంగా హతమార్చారు.

– జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు భద్రత కరువైంది.

★ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దారుణహత్య జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడుతున్నాయి?

★ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 15 మంది టీడీపీ నేతలను హతమార్చారు. అందులో 11 మంది బీసీ వ్యక్తులే.

★ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం 56 కార్పొరేషన్లు పెట్టామని, బీసీలను ఏదో ఉద్దరిస్తున్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.

★ చేనేత వర్గం వారు గొడవలకు దూరంగా ఉంటారు.

★ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవినీతి, అరాచకాలను సుబ్బయ్య ప్రశ్నించాడని అతనిపై కక్ష కట్టారు.

★ మీ దురాగతాలను ప్రశ్నించడం తప్పా?

★ చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనని సుబ్బయ్యను దారుణంగా హతమార్చారు.

★ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సుబ్బయ్య మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి.

★ దోషులను కఠినంగా శిక్షించాలి.

★ వైసీపీ మారణకాండతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు భయాందోళనకు గురవుతున్నారు.

★ వైసీపీ నేతలు తమ ఫ్యాక్షన్ రాజకీయాలను కట్టి పెట్టకపోతే ప్రజలు తగిన బుద్ది చెప్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles