అమరావతి
టీడీపీ అధికార ప్రతినిధి, శ్రీ పిల్లి మాణిక్యరావు విలేకరుల సమావేశం వివరాలు..
కొడాలినానీ శరీరమే డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిరూపం
– రాష్ట్రప్రజలు నిత్యం ఏదో ఒకసమస్యతో, అనుకోని విపత్తులు, ప్రమాదాలు, సంఘటనలతో సతమతమవుతున్నారు.
– ప్రజల అవస్థలను పట్టించుకోకుండా కొడాలినానీ వంటివారు ప్రతిపక్షనేతను, ఆపార్టీ వారిని దూషిస్తున్నారు.
– నానీ శరీరమే డ్రైనేజ్ వ్యవస్థకు ప్రతిరూపం. ఆయన నరనరాన మలినాలు, అశుద్ధాలే ప్రవహిస్తున్నాయి.
– ఏలూరులో తలెత్తిన సమస్యపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారన్న అక్కసుతోనే మంత్రులంతా మూకుమ్మడిగా చంద్రబాబు, లోకేశ్ లను దూషిస్తున్నారు.
– ప్రతిపక్షనేత సూచనలను, ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం నానీ లాంటి కుక్కలతో మాట్లాడిస్తోంది.
– రాష్ట్రంలో ఏదోఒక సమస్య తలెత్తిన ప్రతిసారీ కొడాలినానీ పందికంటే హీనంగా ప్రవర్తిస్తూంటాడు.
– వైద్యఆరోగ్య శాఖా మంత్రి సొంతనియోజకవర్గంలో సమస్య తలెత్తితే, దానితీవ్రతను, సమస్య మూలాలను ఆళ్లనాని గుర్తించలేకపోయాడు.
– సమస్యను గుర్తించడంలో విఫలమైనందుకు ఆళ్లనాని తక్షణమే మంత్రిపదవికి రాజీనామా చేయాలి.
– 151 సీట్లున్నాయి కదా అని చిన్నాపెద్దా, సభ్యత-సంస్కారం, మంచి-మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా?
– అసలు డ్రైనేజీలో పడుకోబెట్టాల్సింది వైసీపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రులనని కొడాలినానీ తెలుసుకుంటే మంచిది.
★ రాష్ట్రప్రజలు ప్రతిరోజు అనేకసమస్యలతో సతమతమవుతు న్నారని, నిత్యం ఏదోఒకప్రమాదం, విపత్తు, అనుకోని సంఘటనలు జరుగుతున్నా కొడాలినాని వంటివారికి బుద్ధి ఉండటంలేదని, రాష్ట్రంలోని సమస్యలను, ప్రజలఅవస్థలను పట్టించుకోకుండా సదరు వ్యక్తి మతిలేకుండా మాట్లాడుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు.
★ సోమవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
★ ఏలూరులో ప్రజలు అంతుచిక్కనివ్యాధితో ఆసు పత్రుల పాలయ్యారని, అక్కడున్నవారి ఆరోగ్యంపై రాష్ట్రమంతా తీవ్రంగా ఆందోళన చెందుతోందని, ఈక్రమంలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అక్కడివారిని పరామర్శించడం జరిగిందన్నారు.
★ ప్రభుత్వం కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని, హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
★ ప్రతిపక్షం సూచనలను, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నానీ అనేపనికిమాలిన వ్యక్తిని ప్రోత్సహిస్తోందని మాణిక్యరావు దుయ్యబట్టారు.
★ రాష్ట్రంలో సమస్యలు తలెత్తిన ప్రతిసారీ కొడాలినానీ మీడియాముందుకొచ్చి పందికంటే హీనంగా ప్రవర్తిస్తూంటాడన్నారు.
★ అటువంటి పనికిమా లిన వెధవ శరీరం మొత్తం ఢ్రైనేజీ వ్యవస్థకన్నా దారుణంగా తయారైందని టీడీపీనేత ఆగ్రహం వ్యక్తంచేశారు.
★ నానీ నరనరాన మురికికూపమే ఉందని, మనిషి శరీరంలో మలినం ఉంటే, నానీ లానే ప్రవర్తిస్తారని, ఆయన నోటిలో డ్రైనేజీలో ఉండే వ్యర్థాలన్నీ ఉన్నాయని, అందుకే ఆనోటిని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నా డన్నారు.
★ తనమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే నానీ, ప్రతిసారీ తన డ్రైనేజీ నోటిని తెరుస్తున్నాడన్నారు.
★ ఏలూరు సమస్య గురించి తెలియక వైద్యులంతా తలలు పట్టుకుంటుంటే, మంత్రులు చంద్రబాబుని, టీడీపీ నేతలను విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారన్నారు.
★ నానీ తన గబ్బునోటిని అదుపులో పెట్టుకోకుంటే, బాధ్యతగా ప్రవర్తించకుంటే, ప్రజలే తగినశాస్తి చేస్తారన్నారు.
★ జగన్ కోడికత్తి డ్రామా ఆడితే, పేర్నినానీ దానికంటే గొప్పగా తాపీ డ్రామా ఆడాడన్నారు.
★ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్లనాని సొంత నియోజకవర్గంలోని ప్రజలు చెప్పుకోలేని సమస్యతో మూర్ఛలతో, నోటివెంట నురగలుకక్కుతూ పడిపోతుంటే, ప్రజలంతా పోలోమంటూ రోదిస్తుంటే, సమస్య ఏమిటో తెలియడం లేదని సదరు మంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు.
★ కొడాలినానీ నరనరాల్లో మలినమే ప్రవహిస్తోందని, అందుకే చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలుతున్నాడన్నారు.
★ అసలు డ్రైనేజీలో పడుకోబెట్టాల్సింది వైసీపీప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రులను అనే విషయాన్ని కొడాలినానీ తెలుసుకుంటే మంచిదన్నారు.
★ రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజలను పక్కదారి మళ్లించడానికే నానీ ప్రభుత్వం తరుపున కుక్కలా పనిచేస్తున్నాడన్నారు.
★ నానీ అసలు మనిషి పుట్టుకే పుట్టాడా అన్న సందేహం ప్రజలకు కలుగుతోందని, 151 సీట్లు ఉన్నంతమాత్రాన చిన్నాపెద్దా, సభ్యత-సంస్కారం, మంచి-మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా అని మాణిక్యరావు నిలదీశారు.
★ చంద్రబాబుని అనే ప్రతిమాటకు నానీ అంతకు అంత అనుభవించి తీరుతాడని టీడీపీనేత తేల్చిచెప్పారు.
★ కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం, తన మంత్రుల అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చాలని చూస్తోందన్నారు.
★ తన నియోజకవర్గంలోని సమస్య ఏమిటో గుర్తించడం చేతగాని ఆళ్లనాని తక్షణమే తనమంత్రిపదవికి రాజీనామా చేయాలని మాణిక్యరావు డిమాండ్ చేశారు.
★ వారివారి శాఖలకు సంబంధించి, మంత్రులు పూర్తిగా విఫలమైనా వారెవరూ నీతివంతంగా, ధైర్యంగా బాధ్యత తీసుకోవడం లేదన్నారు.
★ నానీ తనపద్ధతి మార్చుకోవాలని లేకుంటే ఆయన గబ్బునోరే ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతుందని మాణిక్యరావు తీవ్రస్వరంతో హెచ్చరించారు.