Sunday, March 7, 2021

టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాల్వ శ్రీనివాసులు పత్రికా ప్రకటన

అనంతపురం జిల్లా (రాయదుర్గం)

టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ కాల్వ శ్రీనివాసులు పత్రికా ప్రకటన వివరాలు..

పరిటాల రవీంద్ర పేరు మార్చడం కేవలం రాజకీయ కక్షసాధింపు

  • పుట్టకనుమ రిజర్వాయర్ నిర్మాణం కొనసాగించాలి

★ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషిని తమ గొప్పగా చాటుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తాపత్రయం పడుతున్నారు.

★ అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన రాప్తాడు నియోజకవర్గానికి సాగు నీటి సౌకర్యం కోసం పరిటాల రవీంద్ర 1994లో శాసనసభ్యుడైనప్పటి నుంచి ఎంతగానే తపించారు.

★ అప్పట్లోనే ఉపగ్రహ చాయా చిత్రాల సహాయంతో అక్కడున్న నీటి వనరులను అధ్యయనం చేయించి అప్పర్ పెన్నా ప్రాజెక్టుతో పాటు దిగువన మరో చిన్న రిజర్వాయర్ నిర్మించే అవకాశాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయించారు.

★ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సందర్బంగా పేరూరు ప్రాజెక్టు డ్యాం సైట్ ను పరిశీలించి అక్కడే బస చేశారు.

★ పరిటాల సునీతమ్మ అభ్యర్ధన మేరకు ఎలాగైనా కృష్ణా జలాలు ఆ ప్రాజెక్టుకు తీసుకురావాలని సంకల్పించారు.

★ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా సుమారు 3.8 టీఎంసీల నీటిని పేరూరు ప్రాజెక్టుకు తీసుకువెళ్లాలి.

★ మార్గమద్యలో పుట్టకనుమ, సోమలవానపల్లి రిజర్వాయర్లను అదనంగా నిర్మించాలని ప్రయత్నం చేసి అనుమతులు పొంది కాలువ నిర్మాణం చాలా వరకు జరిగింది.

★ అప్పట్లో ఆ ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు వరకు వెళ్లే ఎత్తిపోతల పథకానికి పరిటాల రవీంద్ర పేరును పెట్టడం జరిగింది.

★ నేడు జగన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో మూడు ప్రాజెక్టులను శంకుస్థాపన చేయబోతున్నారు.

★ నేడు ఈ ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎన్ని?

★ చంద్రబాబు గారి హయాంలో జీడిపల్లి పేరూరు ఎత్తిపోతల పథకంలో అంతర్బాగంగా పుట్టకనుమకు ఇచ్చిన నిధులను ఈ మూడు ప్రాజెక్టులకు మళ్లించి ఒక్క రూపాయి అధనంగా ఇవ్వకుండా శంకుస్థాపన చేస్తూ రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించబోతున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు.

★ ఇది ఆత్మహత్యశద్రుస్యమైన చర్య.

★ చంద్రబాబు నాయుడు గారు చేసిన పుట్టకనుమ రిజర్వాయర్ ను జగన్ రద్దు చేసే అధికారం, హక్కు ఎక్కడుంది?

★ పుట్టకనుమ రిజర్వాయర్ అనేది దశాబ్దాల కల.

★ 1958 నిర్మాణమైన పేరూరు డ్యాం ప్రారంభంలో దశాబ్ధ కాలం పాటు ఎక్కువ నీళ్లు వచ్చి పొంగిపొర్లింది.

★ కింద రిజర్వాయర్ కట్టుకుంటే బాగుంటుందని అప్పడే పరిశీలన చేస్తే చివరకు చంద్రబాబు గారి హాయాంలో ఒక రూపం వచ్చింది.

★ దానిని కాల రాసే హక్కు జగన్ రెడ్డికి ఎవరిచ్చారు?

★ 1958 లో నిర్మితమైన పేరూరు ప్రాజెక్టుకు పరిటాల రవీంద్ర పేరు పెట్టలేదు.

★ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకు వెళ్లే ఎత్తిపోతల పథకానికి మాత్రమే పరిటాల రవీంద్ర పెట్టుకుంటే నేడు పేరును మారుస్తూ వైఎస్ ఆర్ అప్పర్ పెన్నార్ అనే పేరు పెట్టారు.

★ అంటే 1958లో నిర్మితమైన ప్రాజెక్టుకు కూడా జగన్ పేరు మారుస్తున్నారు.

★ జగన్ కు పేర్ల పిచ్చి పట్టుకుంది.

★ రేపు మా ప్రభుత్వం వచ్చిన తరువాత పరిటాల రవీంద్ర పేరును పునరుద్దరించుకొని ఆయన కలను నెరవేరుస్తాం.

★ రైతుల్లో కలకాలం నిలిచిన పేరు పరిటాల రవీంద్ర పేరు మార్చడం కేవలం ఇది రాజకీయ కక్షసాధింపు మాత్రమే.

★ కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి.

★ లేదంటే న్యాయపోరాటం చేస్తాం.

★ పుట్టకనుమ రిజర్వాయర్ నిర్మాణం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.

★ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయలసీమ నీళ్లతో కలకలలాడింది.

★ అనంతపురం జిల్లాకు కియాను తీసుకువచ్చాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles