శ్రీకాకుళం జిల్లా
తెదేపా పార్లమెంటు సభ్యులు, శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
రైతుల ప్రయోజనాలపై టీడీపీ ఏనాడూ వెనక్కు తగ్గలేదు
– మంత్రి కన్నబాబు టీడీపీపై దుష్ట్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాము
★ రైతుల ప్రయోజనాలపై టీడీపీ ఏనాడూ వెనక్కు తగ్గలేదు.
★ వ్యవసాయ బిల్లులు విషయంలో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది.
★ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆ రోజే పార్లమెంటులో స్పష్టంగా చెప్పాము.
★ పార్లమెంటులో ఒకలా, బయట మరొకలా మాట్లాడేది వైసీపీయే తప్ప టీడీపీ కాదు.
★ మార్కెట్ రుసుము, సెస్ లను రాష్ట్రాలు వసూలు చేయకుండా కొత్త వ్యవయసాయ బిల్లులు నిషేదిస్తాయని ఆనాడే చెప్పాం.
★ దీని వల్ల మార్కెట్ వ్యవస్థ కుప్పకూలుతుందని రైతులు కార్పరేటు రంగం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని కేంద్రానికి తెలిపాము.
★ కనీస మద్దతు ధరపై స్పష్టత ఇవ్వాలని, కేంద్రం తెచ్చిన బిల్లులు రైతు ప్రయోజనాలను విస్మరిస్తోస్తున్నాయని చెప్పాము.
★ అలాంటిది మంత్రి కన్నబాబు టీడీపీపై దుష్ట్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాము.
★ చట్టంపై చర్చించేటప్పడు పార్లమెంటులో వైసీపీ నేతలు నిద్రపోయారేమో.?
★ రైతుల పాలిట శాపంగా వైసీపీ ప్రభుత్వ తీరు మారింది.
★ అసెంబ్లీలో మేము పోరాటం చేసే వరకు బీమా ప్రీమియం చెల్లించలేదు.
★ రాత్రికి రాత్రి జీవోలు జారీ చేసి మేము ఎప్పుడు కడితే మీకేంటని ప్రశ్నించడం రైతులను మోసం చేయడం కాదా?
★ మీ అసమర్థత, చేతకాని తనం వల్ల రైతులు బీమా సొమ్ము కోల్పోయారు.
★ ఏడాదిన్నరగా రైతులకు ఒక్క రూపాయి కూడా బీమా సొమ్ము చెల్లించలేదు.
★ రాష్ట్రంలో ప్రతి పంటకు మద్ధతు ధర ఇస్తున్నామని రైతుల వద్దకు వెళ్లి చెప్పే దైర్యం ముఖ్యమంత్రికి వుందా?
★ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవడం పూర్తిగా వదిలేశారు.
★ ప్రతి పంటకు మద్ధతు దర ప్రకటించామని మాట్లాడుతున్న వైసీపీ ఇప్పటి వరకు ఎంత మంది రైతులు నుండి పంట కొనుగోలు చేసింది?
★ కొనుగోలు చేసిన అరకొర ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించలేదు.
★ వ్యవసాయ పరికరాల మీద సబ్సిడీని ఎత్తేసి రైతు ద్రోహిగా జగన్ రెడ్డి ప్రభుత్వం మిగిలిపోయింది.
★ రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయం గురించి వైసీపీ నేతలు అడిగితే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.