అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ
1.అనపర్తి నియోజకవర్గo అనపర్తి మండలం పులగుర్త గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పంపన ఆనందరావు గారు వైస్సార్సీపీ నాయకుల వేధింపులు, అక్రమ కేసులు పెడతామని పోలీసులు వేధింపులకు గురి చేయడం వలన గురువారం సాయంత్రం పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయత్నం చేసుకోవడంతో జరిగింది.
2.అనపర్తి నియోజకవర్గoలో పెద్ద ఎత్తున 7-8 పేకాట క్లబ్బులు నిర్వహించడం జరుగుతుందని పత్రికల్లో,న్యూస్ ఛానెల్స్ లోను ప్రముఖంగా రావడంతో పోలీసులు అసలు పేకాట ఆడుతున్న వారిని వదిలిపెట్టి, అమాయకులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలిచేయడం కోసం ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
3.అనపర్తి నియోజకవర్గoలో వైస్సార్సీపీ నాయకుల అక్రమాలు, అవినీతిని ప్రశ్నిoచిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.
4.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబాన్ని కి ధైర్యాన్ని, భరోషానివ్వడం కోసం నిన్న జిల్లా బీసీ నాయకులను పంపించడం జరిగింది.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ట్విట్టర్ లో కూడా స్పందించడం జరిగింది.
5.పోలీసులు అక్రమ కేసులు పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేసుకున్న పంపన ఆనందరావు చికిత్స పొందుతున్న హాస్పిటల్ వద్ద పోలీసులు మఫ్టిలో పికెట్ చేయడమేంటి అని ప్రశ్నించారు.
6.సంఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్న వేధింపులకు గురి చేసిన పోలీసు అధికారి పై, స్థానిక వైస్సార్సీపీ నాయకులపై చర్యలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు.
7.ఇప్పటికైనా దళితులపై, బలహీనవర్గాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టాడని అరికట్టాలని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను గారు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను గారు, మాజీ ఎంపీపీ బేరా వేణమ్మ గారు,రంగంపేట మాజీ జడ్పీటీసీ సత్యవతి వెంకన్న గారు,AMC మాజీ ఛైర్మన్ నాగేశ్వరరావు గారు, కుతుకులూరు PHC మాజీ ఛైర్మన్ అచ్చరెడ్డి గారు,సుధాకర్ రెడ్డి గారు,బిక్కవోలు మండల బీసీ సెల్ అధ్యక్షులు రాయుడు రామచంద్రరావు గారు,అనపర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు,బిక్కవోలు మండల ప్రధాన కార్యదర్శి బేరా శ్రీను గారు,అనపర్తి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బాబురావు గారు, కుమార్ గారు, సుబ్బారావు గారు,చంద్రరావు గారు, మాచారావు గారు,దుర్గారావు గారు, మండల & గ్రామ నాయకులు పాల్గోన్నారు.