Monday, March 1, 2021

మాజీ మంత్రి వర్యులు శ్రీ కిమిడి కళావెంకట్రావు పత్రికా ప్రకటన వివరాలు

అమరావతి : మాజీ మంత్రి వర్యులు, శ్రీ కిమిడి కళావెంకట్రావు పత్రికా ప్రకటన వివరాలు.

విద్యుత్ మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరి. అప్పుల కోసం రైతుల్ని చిదిమేసేందుకు ప్రభుత్వ ప్రయత్నం. పిచ్చోడి చేతిలో రాయిలా.. జగన్ ప్రభుత్వ నిర్ణయాలు

★ వ్యవసాయ రంగానికిచ్చే ఉచిత విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గపూరిత ప్రయత్నాలు చేయడం రైతాంగానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి.

★ వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి, విద్యుత్ బిల్లుల్ని ప్రభుత్వమే వారి ఖాతాల్లో వేస్తామని ప్రకటించి నిస్సిగ్గుగా మోసం చేస్తోంది.

★ దేశంలోని ఎన్నో రాష్ట్రాలు సహా.. పక్కనున్న తెలంగాణ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విధానాన్ని జగన్ రెడ్డి భుజానికెత్తుకుని.. రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారు.

★ కేంద్రం ఇచ్చే రూ.4వేల కోట్ల అప్పు కోసమే మీటర్లు బిగించేందుకు సిద్ధమయ్యారని తెలంగాణ మంత్రులు కూడా వ్యాఖ్యానించిన తర్వాత కూడా వైసీపీ నేతలు అసంబద్ధ ప్రేలాపణలు చేయడం సిగ్గుచేటు.

★ కేంద్రం చెపపినట్లు తలూపుతూ.. రాష్ట్ర రైతాంగం మెడపై కత్తి పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పులతో కొట్టే రోజు దగ్గరపడింది.

★ ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలు చేతకాదు.

★ ప్రభుత్వ క్రిమినల్ మైండ్ చూసి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేనే లేదు.

★ దీంతో అప్పులపైనే ఆధారపడిన జగన్ రెడ్డి.. ప్రజలపై పన్నుల భారం పెంచుతూ ఆదాయం పెంచుకోవాలని సిగ్గుమాలిన విధానాలకు తెరలేపుతున్నారు.

★ దేశం మొత్తం వ్యతిరేకిస్తున్న మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు ఏ కారణంతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందో సమాధానం చెప్పాలి.

★ విద్యుత్ బిల్లును ముందే రైతు ఖాతాల్లో వేస్తామంటున్న ప్రభుత్వం.. ఆ సొమ్మేదో నేరుగా డిస్కంలకే చెల్లిస్తే సరిపోతుందని ఎందుకు ఆలోచించడం లేదు.?

★ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నదో.. ఎవరి కోసం తీసుకుంటుందో కూడా ప్రజలకు చెప్పే సాహసం చేయకుండా.. పిచ్చోడి చేతిలో రాయిలా పిచ్చి పిచ్చి నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు.

★ మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని.. చీకట్లలో మగ్గేలా చేశారు. సంతోషంగా పంటలు పండిన రాష్ట్ర రైతాంగం.. అనునిత్యం విత్తనాలు, ఎరువులు, మద్దతు ధరలు, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం పోరాటం చేస్తూ బతకాల్సిన దౌర్భాగ్యస్థితికి తెచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles