Friday, March 5, 2021

యనమల రామకృష్ణుడు పత్రికా ప్రకటన

అమరావతి

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు, శ్రీ యనమల రామకృష్ణుడు పత్రికా ప్రకటన వివరాలు..

ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం తదితర అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికే చెందుతాయని భారత రాజ్యాంగం ఆర్టికల్ 234కె స్పష్టంగా పేర్కొంది. కాబట్టి వాటిపై ఆర్డినెన్స్ ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.

★ రాజ్యాంగంలో ఆర్టిక‌ల్ 243 (k) ప్రకారం ‘‘Elections to the Panchayats The superintendence, direction and control of the preparation of electoral rolls for, and the conduct of, all elections to the Panchayats shall be vested in a State Election Commission consisting of a State Election Commissioner’’ అని స్పష్టంగా నిర్దేశించారు.

★ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కాని, ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనిగాని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు.

★ ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక, ప్రభుత్వం ఎన్నికల మధ్యలో జోక్యం చేసుకోరాదు.

★ ఎన్నికలపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని(కన్సల్టేషన్) సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప ప్రభుత్వ అనుమతి(కన్సెంట్) తీసుకోవాలని చెప్పలేదు అనేది సుస్పష్టం, అది కూడా ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా ప్రభుత్వానికి సదరు ఎన్నికతో పనేమీ ఉండదు.

★ అలాంటిది ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలని తీర్మానం చేయడం కోర్టు ధిక్కరణే..

★ నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో శాసన సభ పాత్ర ఏమీ ఉండదు.

★ ఇది రాజ్యాంగపరమైన అంశం కాబట్టి, దానిపై రాష్ట్ర శాసనసభ సవరణ చేయలేదు..

★ దీనిపై రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ఇవ్వలేరు..

★ రాష్ట్ర చట్టాలతో సహా మొత్తం చట్టాలు అన్నింటిపైనా రాజ్యాంగానిదే పైచేయి అనేది గుర్తుంచుకోవాలి.

★ రాజ్యాంగమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది, దానిని రాష్ట్ర చట్టం (ఆర్డినెన్స్) అతిక్రమించలేవు.

★ కోర్టులో పెండింగ్ లో ఉన్న పొరుగురాష్ట్రం పంచాయితీరాజ్ చట్టాన్ని ఉదహరించి ఇక్కడ కూడా చేస్తామనడం విడ్డూరంగా ఉంది.

★ ఇలాంటి తీర్మానం చేయడం ద్వారా వైసిపి ప్రభుత్వం మరో వింత సంప్రదాయానికి, వితండ వాదానికి తెరదీసింది.

★ ఎస్ ఈసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఒక శాసన సభ తీర్మానం చేసిన దాఖలాలు కూడా గతంలో లేవు.

★ ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ఏకంగా రాష్ట్ర శాసన సభ తీర్మానం చేయడం వైసిపి వింత విడ్డూరాల్లో మరొకటి.

★ ఎన్నికల వ్యవస్థతో, న్యాయవ్యవస్థతో, శాసన నిర్మాణ వ్యవస్థతో, మీడియా వ్యవస్థతో ఢీకొట్టడమే వైసిపి పనిగా పెట్టుకుంది.

★ వితండ చర్యలతో, ఉన్మాద చేష్టలతో వ్యవస్థల విచ్ఛిన్నమే లక్ష్యంగా పనిచేస్తోంది.

★ ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదో దారి అన్నట్లుగా వైసిపి ఉలిపికట్టె రాజకీయం చేస్తోంది.

★ వెర్రితలల పార్టీగా వైసిపి వ్యవహరిస్తోంది.

★ వితండపార్టీగా వైసిపి మరోసారి రుజువైంది.

★ ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు పెట్టాలని చెప్పలేదు.

★ అదికూడా ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా మధ్యలో ఉన్న నేపథ్యంలో అదికూడా అప్రస్తుతమైన అంశం.

★ సంప్రదింపుల ప్రక్రియ స్ఫూర్తికి విఘాతం కలిగింది కాబట్టి చట్టపరమైన జోక్యం అవసరం అనడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్దం.

★ మన ప్రజాస్వామ్యంలో ఏవ్యవస్థ మరో వ్యవస్థకు పోటీకాదు..అలాంటిది ఎన్నికల వ్యవస్థను పోటీగా శాసనవ్యవస్థ, శాసన వ్యవస్థను పోటీగా ఎన్నికల వ్యవస్థ భావించరాదు.

★ రాష్ట్రంలో ఈ పరిణామాలకు వైసిపి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.

★ వ్యవస్థలతో ఘర్షణాత్మక వైఖరితోనే వైసిపి ఎందుకు వ్యవహరిస్తుందో విజ్ఞులైన ప్రజలే అర్ధం చేసుకుంటున్నారు.

★ ఈ విధమైన ఘర్షణాత్మక వైఖరి వ్యవస్థల మధ్య కల్పించడం ద్వారా రాజకీయ లాభాలు పొందాలని చూడటం హేయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles