గుంటూరు జిల్లా (రేపల్లె)
శాసనసభ్యులు, శ్రీ అనగాని సత్యప్రసాద్ పత్రికా ప్రకటన వివరాలు..
రైతులపై వైసీపీ నేతల కపట ప్రేమ
– పార్లమెంటులో ఆమోదించి.. రాష్ట్రంలో ఆవేదన సూక్తులు
– రైతులకు క్షమాపణ చెప్పాకే బంద్ కు మద్దతు ప్రకటించాలి
★ కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమంపై వైసీపీ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారు.
★ రైతు బంద్ కు సంఘీభావం ప్రకటిస్తున్నామంటూ వారి ప్రకటనలతో రైతుల్ని అవమానిస్తున్నారు.
★ రైతు భరోసాలో, విత్తనాలు, ఎరువుల పంపిణీలో, మద్దతు ధరల ప్రకటనలో, వరద సాయం అందించడంలో రైతుల్ని నిలువెల్లా మోసం చేసి.. నేడు సంఘీభావం ప్రకటించడం హాస్యాస్పదం.
★ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రైతాంగానికి నిరాశ, నిస్పృహలు తప్ప మరేమీ లేదు.
★ వరుస తుపాన్లు, వరదలతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లోని పంటలు నాశనమై, రైతులు అవస్థలు పడుతుంటే.. కనీసం పంట బీమా కూడా కట్టని జగన్ రెడ్డి.. నేడు రైతులు చేపట్టిన బంద్ విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారు.
★ రైతుల సంక్షేమం గురించి ఆలోచించినట్లైతే.. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో సమాధానం చెప్పాలి.
★ దేశమంతా వ్యతిరేకించిన విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఏ కారణంతో సై అన్నారో జగన్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పి తీరాల్సిందే.
★ అడుగడుగునా రైతుల్ని నిలువెల్లా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు.. నేడు రైతుల విషయంలో నిట్టూర్పు నటిస్తూ రైతుల్ని మరింత మోసం చేస్తున్నారు.
★ పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలిపినపుడు రైతులకు జరుగుతున్న నష్టం తెలియదా.? లేక తెలిసే మద్దతు తెలిపారా.?
★ ఢిల్లీలో కేసులకు భయపడి వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చి.. గల్లీలో రాజకీయం చేస్తూ రైతుల గొంతు కోస్తున్నారు.
★ దేశంలోని రైతు వ్యతిరేక విధానాలకు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే.. జగన్ రెడ్డి మాత్రం.. వాటితో మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ రైతు ద్రోహిగా మిగిలారు.