Monday, March 8, 2021

శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి విలేకరుల సమావేశం

విశాఖపట్నం జిల్లా (నర్సీపట్నం)

తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు విలేకరుల సమావేశం వివరాలు.._

జగన్ ప్రభుత్వం పై స్థానిక ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు

– జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నుంచి కూడా ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని అయ్యన్నపాత్రుడు అన్నారు.

★ అధికారంలోకి వచ్చి సుమారు పది నెలలు పూర్తవుతున్న ఇప్పటికీ జైలు బుద్ధులు పోలేదు అని అయ్యన్న పరిహాసం చేశారు.

★ ఇసుక దగ్గర నుండి మద్యం వరకు జె-టాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని అన్నారు.

★ నిత్యావసర ధరలు పెంచి ప్రజలు మోయలేని భారాన్ని వేశారని అన్నారు.

★ రెండు సంవత్సరాలు పూర్తి కాలం అవ్వకముందే రెండు లక్షల 40 వేల కోట్లు అప్పు రాష్ట్రంపై చేశారని ఇంత అప్పు చేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో నేను ఎప్పుడూ చూడలేదని ఆయన విస్తుపోయారు.

★ ప్రజలు మా పక్క ఉన్నారని అంటున్న నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు సవాల్ విసిరారు ప్రజల మీ పక్కన ఉంటే స్థానిక ఎన్నికలకు ఎందుకు వెనుకాడుతున్నారు అని ప్రశ్నించారు.

★ వైయస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నా 85 శాతం పూర్తి అయిన అర్బన్ హౌసింగ్ ప్రజలకు ఇవ్వకుండా రేపు వచ్చే ఎలక్షన్స్ కోసం రూపాయి కే ఇల్లు అని మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

★ పేద వారి కోసం 5రూపాయలకి అన్న క్యాంటీన్ పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి ఎందుకు మూసేశారు అని ప్రశ్నించారు.

★ నిరుద్యోగ భృతి తో పాటు చంద్రబాబు నాయుడు పెట్టిన 34 పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం మీది కాదా అని అని నిలదీశారు.

★ పట్టణ ప్రాంత వాసులకు ఆస్తిపన్ను చెల్లింపు తీసుకువచ్చిన చట్టం గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల అభిప్రాయం తెలుసుకొని వివరణ ప్రభుత్వానికి పంపించాలని జిల్లా కలెక్టర్ మరియు స్థానిక సబ్ కలెక్టర్ లను కోరారు.

★ నర్సీపట్నంలో వార్డ్ కి 50 నుంచి 100 కార్డులు ఎందుకు తీసేసారో ఎమ్మెల్యే ఉమ శంకర్ గణేష్ సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles