Wednesday, July 28, 2021

అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న హామీలపై ముఖ్యమంత్రి జగన్ కు ఐదో లేఖరాసిన రఘురామ కృష్ణం రాజు

అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైంది జగనన్నా అంటూ మరోసారి నర్సాపూరం ఎంపీ రఘురామ రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన భరోసాల గురించి నేరుగా ముఖ్యమంత్రి కి లేఖల ద్వారా గుర్తు చేస్తూ ప్రజల దృష్టికి తీసుకువెళుతున్న ఎంపీ రఘు సోమవారం తన ఐదో లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితుకు ఇప్పటివరకూ కేవలం రూ.263 కోట్లకు పైగా పదివేల రూపాయల లోపు డిపాజిటర్లకు చెల్లించామని, మిగతా మొత్తం ఇంత వరకూ ఒక్కపైసా ఇవ్వలేదని రఘు గుర్తు చేశారు. తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణ జరిపి 2020 నవంబర్ లో కొన్ని ఆదేశాలు ఇచ్చిందని, బాధితుల సంఖ్యకు సంబంధించి సిఐడి వద్ద వివరాలు ఉన్నాయని , వార్డు కార్యదర్శుల ద్వారా వీటి సమాచారం ధృవీకరణ చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయాన్ని ఎంపీ రఘు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని రఘు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

518FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles