అమరావతి/చిత్తూరు జిల్లా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
తెలుగుదేశం నాయకులపై రాళ్ల దాడిని ఖండిస్తున్నాం
★ రాష్ట్రాన్ని వైసీపీ నేతల రావణ కాష్టంలా మారుస్తున్నారు.
★ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.
★ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ లు బి.కొత్తకొట మండలంలో సమావేశానికి వెళ్తుండగా కురబలకోట మండలం అంగళ్లులో 200 మంది వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేసి హత్యాప్రయత్నం చేశారు.
★ టీడీపీ నాయకులు రాటకొండ మధుబాబు తలకు తీవ్ర గాయలయ్యాయి.
★ 4 కార్లు ద్వంసం అయ్యాయి.
★ జర్నలిస్టు ఫోన్, కెమేరా లాక్కొని దాడికి దిగారు.
★ వైసీపీ పిరికి పంద చర్యను ఖండిస్తున్నాం.
★ జగన్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని పెంచి పోషిస్తున్నారు.
★ బెదిరింపు రాజకీయాలతో, కక్షపూరిత వైఖరిని జగన్ అవలంభిస్తున్నారు.
★ దాడికి పాల్పడ్డ నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.