Sunday, April 11, 2021

అట్టుడికిన నరసరావుపేట – డిగ్రీ విద్యార్థిని హత్యతో పట్టణంలో ఉద్రిక్తత

అట్టుడికిన నరసరావుపేట

డిగ్రీ విద్యార్థిని హత్యతో పట్టణంలో ఉద్రిక్తత

నరసరావుపేటలోని పల్నాడులో రోడ్డులో ధర్నా చేసిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డాll చదలవాడ అరవింద బాబు,విద్యార్థులు, ప్రజా సంఘ నాయకులు

నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూషను దారుణంగా హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హంతకుడిని కఠినంగా శిక్షించాలని నరసరావుపేట టీడీపీ నేతలు, విద్యార్థులు,పలు సంఘాలకు చెందిన నేతలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడంతో నరసరావుపేటలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థిని అనూష హత్యకు గురైనట్లు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహం చూసి భోరున విలపించారు. తమ కుమార్తెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడని, గుండెలలిసేలా తల్లిదండ్రులు విలపించారు.అనూష హత్యకు గురైన విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డాll చదలవాడ అరవింద బాబు,కళాశాల విద్యార్థులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనూష జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.అధికారులు ఎవరూ స్పందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తూ మార్చురీ దగ్గర ఉన్న అనూష మృతదేహాన్ని తీసుకుని రోడ్డుపైకి వచ్చారు.ఈక్రమంలో పట్టణంలోని ప్రధాన రహదారికి మృతదేహంతో ప్రదర్శనగా వచ్చారు.పోలీసులు విద్యార్థులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా అందుకు వారు అంగీకరించలేదు.పట్టణంలో మాయూరి లాడ్జి సెంటర్‌లో రోడ్డుపై టీడీపీ నేత డాll చదలవాడ,టీడీపీ నాయకులు,విద్యార్థులు బైఠాయించి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు.

డాllచదలవాడ రాకతో కుటుంబ సభ్యులకు న్యాయం

విద్యార్థిని హత్యకు గురైన విషయం తెలుసుకుని తెదేపా నేతలు జీవీ ఆంజనేయలు, డాllఅరవింద బాబు,అబ్బురి మల్లి,శివరాం,వందనా దేవి,ఉదయ్ శ్రీ,కూరపాటి హనుమాత్ రావు,సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరావు, అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.హత్యకు గురైన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్‌ చేశారు. కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థులు, నేతలు నిరసన కొనసాగించారు. సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌నుపూర్‌ అజయ్‌కుమార్‌ మృతురాలి బంధువులతో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు సాగించారు.

నరసరావుపేటలో హత్యకు గురైన కోట అనూష తల్లితండ్రులను ఫోన్లో పరామర్శించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్

హోంమంత్రి సొంత జిల్లాలో మహిళలకు కనీస రక్షణ లేకపోవడం బాధాకరం.మృగాడు విష్ణువర్ధన్ రెడ్డి వైకాపా కార్యకర్త కావడంతో ప్రభుత్వం నుండి స్పందన కొరవైంది.న్యాయం కోసం అనూష తల్లితండ్రులు చేస్తున్న పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది.అనూష కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతాం.అనూషను అత్యంత దారుణంగా హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డి కఠినంగా శిక్షించాలి. కుటుంబానికి న్యాయం చెయ్యాలి.

ఆడ పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారు.దిశ చట్టం అంటూ మాయ చేసారు.ఇప్పుడు గన్ను రావడం లేదు జగన్ కనపడటం లేదు.ఒక్క మహిళకు న్యాయం జరిగింది లేదు. కళ్ళ ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ రెడ్డి లో చలనం రావడం లేదు.నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేసాడు మృగాడు విష్ణువర్ధన్ రెడ్డి.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను.ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చ నుండి బయటికి వచ్చి మహిళలకు రక్షణ కల్పించాలి.అనూష ని హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి.అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి:-డాll చదలవాడ అరవింద బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles