అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 365 రోజుల సందర్భంగా నిర్వహిస్తున్న జనభేరి లో పాల్గొనేందుకు బయలుదేరిన తెదేపా అధినేత చంద్రబాబు ముందుగా కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకుని సభకు వెళుతుండగా వెలగపూడి మరియు ఉద్దండరాయునిపాలెం వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిల్చుని కాన్వాయన్ను అడ్డుకున్నారు. శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా పోలీసులను కోరారు. పోలీసు ఉన్నతాధికారులు ఒప్పుకోవడటం తో చంద్రబాబు ఉద్దండరాయుని పాలెం వెళ్లారు.