Wednesday, March 3, 2021

అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది – అమీర్ బాబు

అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది… ప్రశ్నించే గొంతును అరెస్టులతో ఆపలేరుకడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి, వి.ఎస్.అమీర్ బాబు –రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్
-*కడప పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు, కర్నాటి శ్వేతా రెడ్డి.

ఎమ్మెల్సీ బీటెక్ రవి గారి సతీమణి శ్రీమతి లతా రెడ్డి గారిని కడపజిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహద్రపురంలోని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించిన వి.ఎస్.అమీర్ బాబు, హరిప్రసాద్, కర్నాటి శ్వేతా రెడ్డి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

మూడు సంవత్సరాల కిందట 307 కేసులో విమానాశ్రయంలొ అరెస్టుచేయడం సిగ్గుచేటు. ఆయనఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాదా…? లేకపోతే ఆర్థిక నేరస్థుడా…? పులివెందులకి వస్తాడు అక్కడయినా అరెస్టు చేయచ్చు కదా అని ప్రశ్నించారు

ఒక ఎమ్మేల్సి, నీ నియోజకవర్గ ప్రత్యర్థిని ఇలా చేస్తావా. మా ప్రభుత్వ హయాంలో మా అధినేత ఇలాగే తలుచుకున్నింటె మీరు రాష్ట్రంలో తిరిగేవారా…? జగన్ రెడ్డి గారు అంటూ ధ్వజమెత్తారు.

శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే ఉద్దేశ్యంతోనే ఇలా ఒడిగట్టారని…

పులివెందుల నియోజకవర్గంలో తమకు ప్రత్యర్థులు లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే బలమైన నాయకునిగా ఎదుగుతున్న బీటెక్ రవి గారిని రాజకీయ కుటిల ప్రయత్నంలో భాగంగానే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు

అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారుతుంటాయని పోలీసులు గ్రహించి విధులు నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పోలీస్ అధికారులను కోరుతున్నామని అన్నారు

బీటెక్ రవి గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మరియు కడప జిల్లాటీడీపీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా అండగా ఉంటామని మనో ధైర్యాన్నిచ్చారు.

ఇందులో కర్నాటి వెంకట రెడ్డి, గడ్డా గురప్ప, మల్లేష్, జయకుమార్, రాంప్రసాద్, అమీర్, శ్రీను పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles