Thursday, February 25, 2021

అనుబంధ సంఘాల బలోపేతంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ దృష్టి

అమరావతి

అనుబంధ సంఘాలకు జవసత్వాలు

– ప్రజలకు మరింత చేరువయ్యేలా అనుబంధ సంఘాల బలోపేతంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్ దృష్టి

– తెలుగు రైతు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు

– నూతనంగా నియమించిన తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం

– పనిచేసే వారికే పదవులు, అలంకారంగా భావిస్తే మూడు నెలల్లో మార్పు తప్పదు

– రైతులకు,పార్టీకి మధ్య తెలుగు రైతు విభాగం అనుసంధానంగా ఉండాలి

– తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీఆర్‌, చంద్రబాబు వలనే రైతులకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది

– వైకాపా పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు

– ప్రతీ రైతుకి న్యాయం జరిగే వరకూ తెలుగు రైతు పోరాటం

★ జిల్లా పార్టీ విధానానికి స్వస్తి పలికిన టిడిపి పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకొచ్చింది.

★ ఇందులో భాగంగా అనుబంధ సంఘాలకు జవసత్వాలు తీసుకురావడమే లక్ష్యంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

★ ఇటీవల తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.

★ వీరి ఎంపికలో పార్టీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.

★ రైతు సమస్యల పై నిత్యం పోరాడే నాయకులకు ఈ కమిటీల్లో అవకాశం కల్పించారు.

★ అమరావతి టిడిపి కార్యాలయంలో నూతనంగా నియమించిన తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు.

★ లోకేష్ ఆధ్వర్యంలో నూతనంగా పదవులు పొందిన వారు ప్రమాణస్వీకారం చేసారు.

★ అనుబంధ సంఘాల ప్రక్షాళన, బలోపేతం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

★ గతంలో జరిగిన లోటుపాట్లు, భవిష్యత్తు కార్యాచరణపై నూతనంగా నియమితులైన తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు అభిప్రాయాలు తెలిపారు.

తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ..

★ పనితీరు ఆధారంగా కమిటీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

★ రైతుల సమస్యలపై నిత్యం క్షేత్ర స్థాయిలో పోరాడే వారికి పదవులు ఇవ్వడం ద్వారా రానున్న రోజుల్లో తెలుగు రైతు విభాగం సమర్ధంగా రైతుల పక్షాన పనిచేస్తుందని అన్నారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ..

★ కొత్తగా ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

★ గతంలో జరిగిన తప్పులు బేరీజు వేసుకున్నాం.

★ ఇప్పుడు పూర్తి ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇస్తున్నాం.

★ పేరుకి అనుబంధ సంఘాలు అన్నట్టు కాకుండా అనుబంధ సంఘాలే పార్టీ కి వెన్నుముక అనే విధంగా గుర్తింపు ఇస్తున్నాం.

★ ఎంతో కసరత్తు చేసి మీకు అవకాశం ఇచ్చాం.

★ కష్టపడే వారికే పదవులు, గుర్తింపు.

★ అలంకారంగా భావిస్తే మూడు నెలల్లో మార్పు తప్పదు అని అన్నారు.

★ ప్రతి మూడు నెలలకోసారి పనితీరుపై సమీక్ష ఉంటుందని తెలిపారు.

★ పార్టీ నీడలో అనుబంధ సంఘాలు పనిచెయ్యడం కాదు.

★ అనుబంధ సంఘాల ఎజెండా పార్టీ అమలు చేసే విధంగా పనిచెయ్యాలి అని మార్గనిర్దేశం చేసారు.

★ అధికారంలోకి వస్తే అనుబంధ సంఘాలకు గుర్తింపు ఉండదు అనే భయం మీకు అవసరం లేదు, అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సంక్షేమం కోసం తీసుకునే ప్రతి నిర్ణయంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని అన్నారు.

★ రైతురాజ్యం తెస్తా అన్న జగన్ రెడ్డి రైతు లేని రాజ్యం తీసుకొస్తున్నాడని అన్నారు.

★ వైకాపా రైతు వ్యతిరేక విధానాల వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని 18 నెలల పాలనలో 496 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని అన్నారు.

★ పంట చేతికొస్తుంది అనుకున్న సమయంలో నివర్ తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బకొట్టింది.

★ నివర్ తుఫాన్ రాష్ట్రంలోని 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది.

★ 17 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది.

★ రైతులు 12 వేల కోట్లు నష్టపోయారు.

★ ముందస్తు హెచ్చరికలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పంట నష్టం, ప్రాణ నష్టం జరిగిందని అన్నారు.

★ ఇప్పటికే 7 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఒక్క సారి కూడా సక్రమంగా నష్ట పరిహార అంచనా, పరిహారం రైతుకి అందలేదు.

★ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోజగన్ రెడ్డి అడ్డంగా దొరికాడు.

★ రైతులకు ఉచితంగా బీమా ప్రీమియం చెల్లిస్తామంటూ రైతులను నట్టేట ముంచారు.

★ రైతులకు బీమా ప్రీమియం రూ.1,030 కోట్లు కట్టకుండా.. కట్టామంటూ అసెంబ్లీలో అబద్ధాలు ఆడి అడ్డంగా దొరికారు.

★ రైతులను మోసం చేశారు.

★ కేవలం అడ్వాన్స్ కింద ఇన్సూరెన్స్ కంపెనీలకు 33.26 కోట్లు మాత్రమే చెల్లించారు.

★ దీంతో రైతులు నష్టపోయారు.

★ క్రాప్ ఇన్సూరెన్స్ కింద రైతులకు ఇంతవరకు రూపాయి కూడా చెల్లించలేదు.

★ 2019 ఖరీఫ్ పంటల బీమా ప్రీమియం కట్టలేదనే అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన తర్వాత అర్థరాత్రి రూ.590.90 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారని లోకేష్ అన్నారు.

★ ఎవరైనా చనిపోయిన తర్వాత బీమా ప్రీమియం కడతారా?

★ అలా కడితే నష్ట పరిహారం వస్తుందా?

★ వరుస విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకునే విధానం ఇదేనా?

★ ముందుగానే ప్రీమియం చెల్లించి ఉంటే రైతులకు రూ.4 వేల కోట్లు పరిహారంగా లభించేదని అన్నారు.

★ నివర్ తుఫాను వల్ల 17.33 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

★ ఖరీఫ్ ఆరంభం నుంచి సంభవించిన 7 ప్రకృతి విపత్తుల వల్ల ఇప్పటివరకు 40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. కేవలం రూ.177 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

★ టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.3,759.51 కోట్ల మేర ఇన్ పుట్ సబ్సిడీని మంజూరు చేయడం జరిగింది.

★ రూ.4007.59 కోట్ల మేర క్రాప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించడం జరిగిందని అన్నారు.

★ 2019-20 ఏడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3200 కోట్లతో పంటలను కొనుగోలు చేశామంటూ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు.

★ కేవలం 361.01 కోట్లు మాత్రమే ధరల స్థిరీకరణ కింద ఖర్చు చేయడం జరిగింది.

★ అదేవిధంగా 2020-21 ఏడాదికి సంబంధించి 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటూ కేవలం 524.02 కోట్లు మాత్రమే మంజూరు చేశారని లోకేష్ అన్నారు.

★ సున్నా వడ్డీ తో జగన్ రెడ్డి గుండు సున్నా రెడ్డి అని తేలిపోయింది.

★ టిడిపి పాలనలో రూ.3 లక్షలు రుణం తీసుకున్న రైతుకు రూ.6 వేలు వడ్డీ కాగా, జగన్‌రెడ్డి పాలనలో రూ.12 వేలు రైతు చెల్లించాల్సి వస్తుందని అన్నారు.

★ లక్ష లోపు రుణం తీసుకున్న రైతుకే సున్నా వడ్డీ పరిమితం చేస్తూ జీవో 464 విడుదల చేశారు.

★ ఒక హెక్టారు లోపు రైతుకే సున్నా వడ్డీని కుదించారు.

★ టిడిపి పాలనలో రైతు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేది.

★ జగన్‌ పాలనలో వడ్డీని రైతు బ్యాంకుకు చెల్లిస్తే, తరువాత ప్రభుత్వం రైతుకు ఇస్తుంది.

★ సకాలంలో చెల్లించని రైతుకు సున్నా వడ్డీ వర్తించదని అన్నారు.

★ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే రైతుకు సున్నా వడ్డీ రద్దు చేశారు.

★ 64 లక్షల మంది రైతులకు రూ.4 వేల కోట్లు సున్నా వడ్డీకి ఇస్తామని జగన్‌రెడ్డి హామీ ఇచ్చి 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్లకు కుదించారు.

★ జగన్‌రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి.

★ జగన్ రెడ్డి రైతు ద్రోహి అని లోకేష్ అన్నారు.

★ టిడిపి ప్రభుత్వం 5 ఏళ్లలో 1.30 లక్ష కోట్లు అప్పు చేసి రైతు రుణమాఫీకి రూ.16 వేల కోట్లు ఇచ్చింది- రూ.64 వేల కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తిచేసి 32 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం స్థిరీకరించింది.

★ జగన్‌రెడ్డి 18 నెలల్లోనే 1.30 లక్షల కోట్లు అప్పు చేశారు- రూ.60 వేల కోట్ల ధరలు పెంచి ప్రజల పై భారం మోపారని అన్నారు.

★ టిడిపి హయాంలో రైతు రధం ద్వారా ట్రాక్టర్లు, వ్యవసాయానికి అవసరమయ్యే యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్, హార్టీ కల్చర్, ఆక్వా కల్చర్ కి ప్రోత్సాహకాలు, భూసార పరీక్షలు చేసి ఉచితంగా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం.

★ రైతు రుణమాఫీ ఇలా చెప్పుకుంటే పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.

★ వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధి సాధించి దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు వ్యవసాయంలో జీరో చేసాడు జగన్ రెడ్డి.

★ రైతుకు లాభం చేసే అన్ని కార్యక్రమాలు జగన్ రెడ్డి ఎత్తేసారని అన్నారు.

★ ఒక్క రైతు భరోసా మాత్రమే ఇస్తా అంటున్నాడు.

★ అదైనా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాడా అంటే అదీ లేదు.

★ చెప్పింది 12,500,మాట తప్పి, మడమ తిప్పి ఇస్తుంది 7,500 అంటే 5 వేలు మోసం.

★ ఐదేళ్లలో 25 వేలు రైతుకి నష్టమని లోకేష్ అన్నారు.

★ టిడిపి హయాంలో 50 వేలు రుణం ఉన్న ప్రతి రైతుకి ఒకే సంతకంతో రుణమాఫీ చేసారు చంద్రబాబు గారు.

★ 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కనీసం లక్ష మందికి కూడా రైతు భరోసా ఇవ్వడం లేదు.

★ రైతుకి కులం అంటగట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని లోకేష్ అన్నారు.

★ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీశాం, రైతులకు న్యాయం చెయ్యమని డిమాండ్ చేసాం అయినా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

★ తడిసి దెబ్బతిన్న, రంగుమారిన పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాలి.

★ ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలి.

★ పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ కు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లించాలి.

★ అడ్డమైన నిబంధనలు,30 శాతానికి పైన నష్టం జరిగితేనే పరిహారం అనడం దారుణం.

★ నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని పోరాటం చేస్తామని లోకేష్ అన్నారు.

★ రైతులకు ఉరి వేసే మీటర్లు బిగించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.

★ తెలుగుదేశం పార్టీ,స్వర్గీయ ఎన్టీఆర్ గారు,చంద్రబాబు గారి వలనే రైతులకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది.

★ వ్యవసాయానికి తక్కువ ధరకే విద్యుత్ ఇవ్వడం, మీటర్ల విధానం రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్ గారిది.

★ ఇప్పుడు మళ్ళీ మోటర్లకు మీటర్లు బిగిస్తా అంటున్న జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని అన్నారు.

★ మీటర్లు బిగిస్తే జగన్ రెడ్డికి షాక్ ఇవ్వడం ఖాయం, మీటర్లు పగలడం ఖాయమని లోకేష్ అన్నారు.

★ ఈ సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles