మేముసైతం..అమరావతి కోసం..!
- చంద్రగిరిలో భారీ నిరసన ర్యాలీ
- అధికారులకు వినతి పత్రం సమర్పణ
ఏపీ రాజధాని అమరావతి పరిరక్షణ కోసం.. మేము సైతం.. పోరాడుతూనే ఉంటామని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ పులివర్తి నాని గారు అన్నారు. అమరావతి రైతుల ఉధ్యమానికి 365 రోజులు కావటంతో చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద భారీ నిరసన, ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించారు. అమరావతికి మద్దతుగా నినదించారు.

