అమరావతి ఉద్యమానికి మద్దతుగా తెదేపా ర్యాలీ….~~~~|~
అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 17,12,2020 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ ప్రారంభమై టీ సర్కిల్లో ఆందోళన చేపట్టారు. కొంత సేపు రాస్తారోకో నిర్వహించగా అనంతరం ఉమా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సంవత్సరం నుంచి రైతులు ఉద్యమం చేపడుతున్న ప్రభుత్వం వ్యవహరించటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు తమ పార్టీ అమరావతి రైతులకు అండగా ఉంటామని, తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కరణం రామ్మోహన్ చౌదరి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, మండల కన్వీనర్ మురళి, మాజీ ఎంపీపీ కొల్లప్ప,మాజీ మునిసిపల్ చైర్మన్ గోవిందప్ప, ,మండల కన్వీనర్లు కంబదూరు శివన్న, శెట్టూరు తిప్పారెడ్డి, బ్రహ్మసముద్రం శ్రీరాములు, కుందిర్పి దనుంజయ్య, జడ్పీటీసీ అభ్యర్థులు కళ్యాణదుర్గం గోళ్ళ రమేష్, కంబదూరు సుబ్బారాయుడు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తలారి సత్తి, రామరాజు, తిమ్మప్ప, కౌన్సిలర్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, మాజీ ప్రజాప్రతినిధులు, తెలుగు యువత నాయకులు,ఇతర ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..

