రైతుల ప్రాణాలను బలితీసుకుంటున్న జగన్ రెడ్డికి పాలించే అర్హత ఉందా?
అమరావతి రిఫరెండం పై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదు?
రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామంటే వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు సవాల్ స్వీకరించలేదు?
-*తెదేపా నేతలు.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఆంధ్రుల రాజధాని-అమరావతి పోరాటం నేటితో ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా అమరావతి జనభేరీకి సంఘీభావంగా కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి, వి.ఎస్.అమీర్ బాబు ఆధ్వర్యంలో కడప, టీడీపీ జిల్లా కార్యాలయం నుండి జియో ఆఫీసు మీదుగా ఆర్టీసీ బస్టాండు వద్ద ఉండే అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన తెదేపా శ్రేణులు…
ఈ సందర్భంగా కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, మల్లెల లింగారెడ్డి, కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి, వి.ఎస్.అమీర్ బాబు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ లు మీడియాతో మాట్లాడుతూ…
అమరావతి రైతుల రోధన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వినబడకపోవడం దురదృష్టకరం
365 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నా సీఎం జగన్ మనసు కరగకపోవడం బాధాకరం
అన్నం పెట్టె అన్నదాతకు సంకెళ్లు వెయ్యడమేనా జగన్ తెస్తానన్న రైతురాజ్యం?
విద్వేషం, విద్వoసం లేకుండా వైసీపీకి ఉనికి లేదని విమర్శించారు
పగ, ప్రతీకారం, కూల్చివేతలు, అణచివేతలు తప్ప 18 నెలలుగా చేసింది శూన్యమని దుయ్యబట్టారు
అమరావతి రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాలకు చెందిన 28 వేల మంది రైతులు 365 రోజులుగా రాజధాని అమరావతిలోనే వుండాలని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అన్న నినాదంతో దీక్షలు చేస్తూ, పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని అన్నారు
శాంతియుత ఉద్యమం చేయడం రైతులకు ఉన్న ఓపిక, పట్టుదల, పోరాట పఠిమకు నిదర్శనమని కొనియాడారు
మహిళలపై రాళ్ల దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?
రైతుల ఉద్యమం ముందు పెయిడ్ ఉద్యమం నిలవదన్న విషయం గుర్తుంచుకుంటే బాగుంటుందని హితవు పలికారు
అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా తట్ట మట్టి వేశారా? అని ప్రశ్నించారు
అమరావతి రిఫరెండంపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదు
రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం అంటే వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు సవాల్ స్వీకరించలేదని ప్రశ్నించారు
ధాన్యం పట్టుకోవాల్సిన రైతుల చేతులు ఉద్యమ జెండాలు పట్టుకోవాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును తెలుసుకుని అమరావతిని రాజధానిగా బేషరతుగా అంగీకరించాలని డిమాండ్ చేశారు
రాజధానికి భూములిచ్చిన 109 మంది రైతులు, కూలీలు మరణించినా జగన్ మనసు కరగలేదంటే ఎంతటి కఠినమైన వ్యక్తో అర్థమవుతోంది
చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించాలనుకుంటే జగన్ రెడ్డి జూదాలకు నిలయంగా మార్చారు
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న చందంగా జగన్ రెడ్డి అవినీతి బుద్ధులు వాళ్ల పార్టీ నాయకులకు కూడా సోకినట్లు ఉందని విమర్శించారు
ఎస్సీ రైతులపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం. అమరావతి రైతులపై వైసీపీ ప్రభుత్వ కక్ష శిఖరానికి చేరింది. అందువల్లే చనిపోయిన వారిపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు
అమరావతికి గ్రహ బలంతో పాటు 5 కోట్లు ఆంధ్రుల బలం కూడా ఉంది
అమరావతిని కొనసాగించి ఉంటే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేవి కావు
అమరావతి విధ్వంసంతో రాష్ట్ర భవిష్యత్తును ధ్వంసం చేశారు
ఇన్ సైడర్ ట్రేడింగ్, రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాభివృద్ధిని రివర్స్ చేశారని విమర్శించారు
యువత జీవితాలపై వైసీపీ ప్రభుత్వం నీళ్లు చల్లింది
ప్రజల దగ్గరకు వెళ్లి 18 నెలల్లో ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది
పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ రెడ్డి సచివాలయానికి వేలాది మంది పోలీసుల సమక్షంలో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు
ఇంటికో పోలీసును కాపలా పెట్టి రోడ్డు మీదకు వచ్చే ముఖ్యమంత్రుల్లో జగన్ తప్ప దేశంలో ఎవరూ లేరు
రైతుల కష్టాలను, ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మంత్రులు మాట్లాడటం దారుణం
దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఈ దుస్థితి రావడానికి జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలే కారణం.ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే… అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని అది అమరావతే అని ప్రకటించేంత వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఈ ర్యాలీలో జిలానీ బాష, కేసి కెనాల్ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి, అన్వర్ హుస్సేన్, ఆదినారాయణ, జకీరుద్ధీన్, పీరయ్య, గడ్డ గుర్రప్ప, సురేష్, శివకొండా రెడ్డి, నక్కల శివరాం, గన్నేపాటి మల్లేశ్, మాసా కోదండ రామ్, ఆమూరి బాలదాసు, జలతోటి జయకుమార్, రవిశంకర్ రెడ్డి, రాంప్రసాద్, అక్బర్, సుధాకర్ యాదవ్, రామానాయుడు, కొండా సుబ్బయ్య, నబీకోట్ శ్రీనివాసులు, జియాఉద్దీన్, గోవర్ధన్, ఆనందరావు, మహిళా నాయకురాలు ఝాన్షి, మీనాక్షి, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.