ఆంద్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం చంద్రబాబు గారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలపై, దళితులపై, మహిళలపై, హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులపై, ప్రజాసమస్యలపై, రాష్ట్రంలో కరోన ను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. “మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం” అంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చన్నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ జాతీయ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.