Wednesday, March 3, 2021

ఏలూరులో పర్యటించిన తెలుగుదేశం త్రిసభ్య కమిటీ సభ్యులు

ఏలూరు వింత వ్యాధి బాధితులకి ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించి, త్రాగు నీరు సప్లై చెయ్యాలి – ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు పట్టణం, కొత్తపేటలో వింత వ్యాధి ప్రబలిన ప్రదేశంలో పర్యటించిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు, చిన రాజప్ప గారు, అశోక్ బాబు గారు .

ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏలూరు వింత వ్యాధి బాధితుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారి సొంత ఊరు, సొంత నియోజకవర్గం లోనే ఇంత దారుణం సంభవిస్తే తగు వైద్య చర్యలు, శానిటేషన్ వర్కింగ్ లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని, ముఖ్య మంత్రి గారు ఏదో చుట్టం చూపికి వచ్చివెళ్లినట్టు ఉందేగాని బాధితులకి న్యాయం చేసి,ఇక్కడ సమస్యల పరిస్కార మార్గం చూపలేదని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. బాధితులకు న్యాయం జరిగి ఈ పరిసరాలన్నీ శుభ్రంగా శానిటేషన్ చేసే విధంగా మా 5 డిమాండ్లని ప్రభుత్వం 2 రోజుల్లో పరిష్కరించాలని, అవి ఏమిటంటే

1) బాధితులకి మెరుగైన వైద్యం అందించాలి.

2) ఈ ఏరియాలో మినరల్ వాటర్ సప్లై చెయ్యాలి.

3) రోడ్లన్నీ శుభ్రంగా ఊడ్చి, డ్రయిన్లు పూడిక తీసి,హైపో క్లోరైడ్ పిచికారీ చేసి, బ్లీచింగ్ చల్లించాలి.

4) ఈ ప్రదేశంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చెయ్యాలి.

5) బాధితులకి 108 వాహనాన్ని ఏలూరు కొత్తపేటలోనే అందుబాటులో ఉంచాలి.

ఈ 5 డిమాండ్లని వెంటనే ప్రభుత్వం 2 రోజుల్లో పరిష్కరించి బాధితులకి న్యాయం చెయ్యకపోతే మా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులే రంగంలోకి దిగి ఈ పనులన్నీ చేసి మీ చేతకాని తనాన్ని ప్రజలకు తెలియపరుస్తారని రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు .

మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప గారు మాట్లాడుతూ కనీసం వీళ్ళకి త్రాగు నీరు కూడా అందించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమని, మా స్థానిక నాయకులే ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమం లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు గన్నే వీరాంజనేయులు గారు,ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బడేటి చంటి గారు, ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు,దెందులూరు మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles