Thursday, February 25, 2021

కడపలో చలో కలెక్టరేట్

బుగ్గవంక వరద బాధితులకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాల్సిందే…

వరదకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి…

అసంపూర్తిగా ఉన్న బుగ్గవంక రక్షణ గోడలను పూర్తి చేయాలి…

వరద వల్ల దెబ్బ తిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి, ఇళ్ళు మంజూరు చేయాలి…

షాపుల్లోకి నీరు చేరడం వల్ల నష్టపోయిన యజమానులకు నష్టపరిహారం ఇవ్వాలి…
-*అఖిల పక్ష, ప్రజా సంఘాల నేతలు.

అఖిల పక్షం, ప్రజా సంఘాలు ఛలో కలెక్టరేట్ కు పిలుపులో భాగంగా ఈ రోజు కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన కడప నియోజకవర్గ తెదేపా బాధ్యులు, వి.ఎస్.అమీర్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఐ నగర కార్యదర్శి వేంకట శివ, ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.ఏ.సత్తార్, డీసీసీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు దేవరాయ శ్రీకృష్ణ…

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ…

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల కడపలోని బుగ్గవంక పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు సర్వం కోల్పోయి నేడు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు

బుగ్గవంక రక్షణ గోడలు పూర్తి కాకుండా సినిమా థియేటర్లు అడ్డంకిగా ఉండడం, పై నుండి వరద నీరు సక్రమంగా కిందికి వెళ్లకుండా బిల్టప్ లాంటి ప్రాంతాల్లో కాలువలు, స్థలాలు ఆక్రమణలు జరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఆస్తి నష్టం వాటిల్లింది

కడపను సింగపూర్ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసారని ఆరోపించారు

బుగ్గవంక వరద బాధితులకు రూ.25 వేలు తక్షణమే ఇవ్వాలని… బుగ్గవంక రక్షణ గోడను పూర్తి చేయాలని… వరదల వల్ల నష్టపోయిన వారికి ఇళ్లు మంజూరు చేయాలని… షాపులోకి నీరు చేరి నష్టపోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని… ఇంత దారుణానికి ఒడికట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో అఖిల పక్ష, ప్రజా సంఘాల నాయకులు మరియు అధిక సంఖ్యలో వరద బాధితులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles