Monday, March 1, 2021

కడపలో తెలుగుదేశం నాయకుల 12 గంటల నిరాహార దీక్ష

ఎఫ్.ఆర్.బి.ఎం. లిమిట్ పెంచుకుని అప్పులు తెచ్చుకోవడం కోసం మునిసిపల్ చట్టాలనే మార్చేస్తారా…? జుట్టు పన్ను, కాపురం చేయాలంటే పన్నులు కూడా వేసేలా ఉందీ వైసీపీ ప్రభుత్వం…పేదలపై ప్రభుత్వం పన్నుల బాదుడు… కొత్త విధానం ప్రకారం ఆస్తి విలువ ప్రమాణికమైతే ప్రజలపై 10 రేట్లు భారం…

రిజిస్ట్రేషన్ ఆధారిత మున్సిపల్ ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి, కడప నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వి.ఎస్.అమీర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, నగర అధ్యక్షుడు జిలానీ బాష, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి మాసా కోదండ రామ్, కొమ్మలపాటి, 26వ డివిజన్ ఇంచార్జి మాసాపేట శివ, మహిళా నాయకురాలు నిర్మల, మీనాక్షి 14వ డివిజన్ ఇంచార్జి విజయకుమారి 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు…

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, కడప నియోజకవర్గ తెదేపా బాధ్యులు వి.ఎస్.అమీర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి లు మాట్లాడుతూ…

రాష్ట్రంలో 120 పురపాలక, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో ఇంటి అద్దె ప్రాతిపదికగా నిర్ణయించిన జోనల్ రేట్ల ప్రకారం ప్రస్తుతం ఆస్తి పన్ను విధిస్తున్నారు. ఇంటి పొడవు, వెడల్పు కొలతలు(మీటర్లలో) తీసుకొని మొత్తం విస్తీర్ణం ఎంతో మొదట లెక్కిస్తున్నారు

వీటికి అప్పటికే ఆ ప్రాంతంలో అద్దె ప్రాతిపదికగా ఖరారు చేసిన జోనల్ రేట్లు జోడించగా వచ్చిన మొత్తాన్ని 12 నెలలకు లెక్కిస్తారు. ఈ విధంగా వచ్చిన వార్షిక అద్దె విలువ (ఏ.ఆర్.వి.)పై కొన్ని మినహాయింపులు పోగా మిగతా మొత్తంపై 15 నుంచి 20 శాతం వరకు ఆస్తి పన్నుగా నిర్ణయిస్తున్నారు.

ఇప్పటి వరకు పట్టణాల్లో అద్దె విలువ ఆధారంగా పన్నులు వేసేవారు. ఇక నుండి ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించేవరని అన్నారు

ఆస్తి విలువ అంటే ఇళ్లు ఉన్న స్థలం విలువ, అదే విధంగా ఇంటి నిర్మాణం విలువ రెండు కలిపి లెక్కించి దాని ఆధారంగా పన్ను వేయడం దారుణమని విమర్శించారు

నివాస గృహాలపై 0.1 శాంతం నుండి 0.5 శాతం వరకు, నివాసేతర కట్టడాలు, వ్యాపార సంస్థలపై 0.2 శాతం నుండి 2 శాతం వరకు ఇంటి పన్ను సంవత్సరానికి వేయడమేంటని ప్రశ్నించారు

ఈ విధానం వల్ల పన్ను అనేక రేట్లు పెరుగుతుంది. కొందరికి 10 నుండి 20 రేట్లు కూడా పెరిగినా ఆశ్చర్యం లేదని అన్నారు

ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువలను పెంచుతుంది. ఈ పెరుగుదలను బట్టి ఆటోమేటిక్ గా ప్రతి సంవత్సరం పన్నులు కూడా పెరిగిపోతాయని ఆవేదన వ్యక్తంచేశారు

15 శాతం మించి పెరగవని ప్రభుత్వం, మంత్రులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ విషయం ఆర్డినెన్స్ లో, చట్టాల సవరణల్లో ఎక్కడా పేర్కొనలేదు. జీవో లో మాత్రమే పేర్కొన్నారు

మునిసిపల్ ఎన్నికలు ముగిసే వరకు 15 శాతం పెంచి, ప్రజలను మభ్యపెట్టి తదనంతరం జీవో లో మార్పులు చేసి… చట్టానికి అనుగుణంగా ఆస్తి విలువ ఆధారంగా మొత్తం పెంచిన పన్నులు వసూలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు

ప్రభుత్వం చెప్పినట్లు 15 శాతం పెరిగినా అది ఒక సంవత్సరానికి పరిమితము కాదు, ఆస్తి విలువ ఆధారంగా ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున పెరుగుతూనే ఉంటుందని అన్నారు

కొత్తగా నిర్మించే ఇళ్లకు ఆస్తి విలువ ఆధారంగానే పన్ను వేస్తారు. పాత ఇంట్లో మార్పులు ఏమైనా జరిగితే కొత్త విధానం ప్రకారమే ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధిస్తారు

ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలపై ఆక్రమణదారులనే పేరుతో ఆస్తి విలువకు ఆధారంగా పన్ను లెక్కించి రెట్టింపు పెనాల్టీగా ప్రతి సంవత్సరం పన్ను వసూలు చేస్తారని అన్నారు

స్వంత ఇల్లు పట్టా స్థలంలో నిర్మించుకున్నా ప్లాన్ లేకపోతే అదనంగా కట్టుకున్న భాగంపై ఆస్తి విలువ ఆధారంగా మరో వంద శాతం కలిపి పన్ను వసూలు చేస్తారు

ఖాళీ స్థలాలపై మునిసిపాలిటీలలో ఆస్తి విలువలో 0.2 శాతం, మునిసిపల్ కార్పొరేషన్లలో స్థలం విలువలో 0.5 శాతం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఆనాటి భూమి విలువ ప్రకారం ఖాళీ స్థలం పన్ను విధిస్తారు

ఇల్లు ఉన్నా మూడు రేట్లల కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంపై కూడా ఇంటి పన్నుతో పాటు ఖాళీ స్థలం పన్ను వేయడం సిగ్గుచేటు అని అన్నారు

పక్కనున్న తెలంగాణలో కరోనా, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అన్ని పట్టణాల్లో ఈ సంవత్సరం ఇంటి పన్నులో 50 శాతం రాయితీ కల్పిస్తూ 611 నెం. జీవో విడుదల చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన భారాలు వేస్తున్నారు

375 చ.అ. లోపు ఉన్న ఇళ్ళకు రూ.50 మాత్రమే పన్ను విధిస్తారని చట్టంలో పేర్కొన్నారు. కానీ వీటి సంఖ్య చాలా తక్కువ

పేదల కొరకు ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళకు 6 నెలలకు రూ.2 మాత్రమే పన్ను వసూలు చేయాలని చట్టంలో ఉన్నది. కానీ ఎక్కడా అమలు జరగడం లేదు. ఇప్పుడు అమలు జరుగుతుందనే గ్యారెంటీ లేదని అన్నారు

వైసీపీ ప్రభుత్వం ఇంటితో ఆగకుండా మంచినీటి చార్జీలు, భూగర్భ డ్రైనేజీ చార్జీలు పెంచడానికి వీలుగా 196, 197 నెం. జీవో లను విడుదల చేసింది

పారిశుధ్యం, చెత్త మీద, అన్ని పౌర సదుపాయాల మీద, నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం ప్రజల నుండి రాబట్టే విధంగా యూజర్ చార్జీల వసూళ్లకు చట్టంలో కొత్తగా నిబంధనలు పెట్టారు. ఇప్పటి వరకు చట్టంలో లేకపోయినా దొడ్డిదారిన వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రజలందరి దగ్గర నుండి వసూలు చేస్తారు. మంచి నీటి చార్జీలు నెలకు రూ.100 నుండి రూ.350 వరకు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థల నుంచి నీటి మీటర్లు ఆధారంగా లీటర్ల చొప్పున రెట్లు నిర్ణయించడం దుర్మార్గపు చర్య…

భూగర్భ డ్రైనేజీలో వదిలే మురుగు నీటిపై మరుగుదొడ్లు సంఖ్య ఆధారంగా విడివిడిగా నెలసరి చార్జీలు వసూలు చేస్తారు. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారు వేల రూపాయల డిపాజిట్లు కట్టాలి

నిర్వహణ ఖర్చు అంటే ఈ సదుపాయాలు కల్పించడానికి అయ్యే మొత్తం సిబ్బంది వేతనాలు, విద్యుత్తు బిల్లులు, రిపేర్లు, సామగ్రి ఇలా మొత్తం ఖర్చు లెక్కించి ఆ మొత్తాన్ని ప్రజల నుండి రాబట్టే విధంగా చార్జీలు పెంచుతారు

15 శాతం మాత్రమే పెంచాలని ప్రభుత్వం చెబుతున్నా ఖర్చు మొత్తం ప్రజల నుండి రాబట్టాలనీ చట్టంలో ఉండటం వల్ల తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇవి పెరిగిపోతాయి

వేతనాల ఖర్చు, విద్యుత్తు చార్జీల ఖర్చు సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం పెరుగుతాయి. కాబట్టి చార్జీలు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పెరుగుతాయి.వీవీటితోనే ఆగకుండా పార్కుల్లో ఫీజులు, పాదచారుల మీద చార్జీలు, స్టేడియంలు, ఆటస్థలాలు, ఇక వీధి లైట్లు ఒకటి కాదు అన్ని సదుపాయాలపైన వినియోగదారుల చార్జీలు వసూలు చేస్తారు

మునిసిపాలిటీలను స్థానిక సంస్థలను వ్యాపార సంస్థలుగా ప్రభుత్వాలు మార్చేస్తున్నాయి. పౌర సేవలను ప్రభుత్వం వ్యాపార సరుకులుగా పరిగణిస్తున్నాయని అన్నారు

స్థానిక సంస్థల నుండి వసూలయ్యే పన్నులను స్థానిక సంస్థలకే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది పచ్చి మోసం. స్థానిక సంస్థల పన్నులు ఎప్పుడూ స్థానిక సంస్థల దగ్గరే ఉంటాయి

కానీ రాజ్యాంగ బద్దంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ నుండి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి. అయితే నిధులలో కోత పెడుతున్నాయి

మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. ఎన్నికైన కౌన్సిళ్లు లేవు. ఎన్నికైన కౌన్సిళ్లు లేని సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని స్థానిక సంస్థలపై పన్నుల విధానాన్ని రుద్దడం అప్రజాస్వామికం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం… రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలపై పెత్తనం చేస్తూ ప్రమాదకర విధానాలు రుద్దుతూ ఫెడరల్ స్ఫూర్తిని, స్థానిక సంస్థల స్వయం నిర్ణయాధికారాన్ని దెబ్బ తీస్తున్నది

బడా కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మాత్రం భారాలు మోపడం శోచనీయం

పన్నుల భారం పెంచటమే కాదు, పౌర సేవల బాధ్యతల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవడం ప్రమాదకరం

క్రమంగా ప్రయివేట్ కంపెనీలకు పౌర సదుపాయాలు ధారాదత్తం చేసే కుట్రలు దాగి ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే కేంద్రం ఆదేశాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం చట్టాల మౌలిక స్వభావాన్ని మార్చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ, మాజీ జీపీ గుర్రప్ప,కేసి కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి, నేట్లపల్లె శివ, మత్స్యకారుల కార్పొరేషన్ మాజీ సభ్యుడు రాంప్రసాద్, దువ్వూరు మండల అధ్యక్షుడు తుమ్మల వేంకట కొండారెడ్డి వెంకటరమణ, దీక్ష వహిస్తున్న వారికి పూలమాలలు వేసి తమ సంఘీభావాన్ని తెలియచేసారు.

వీరితో పాటు మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అన్వర్ హుస్సేన్, మాజీ శాప్ డైరెక్టర్ జయచంద్ర, యు.ఎంఎఫ్.అధ్యక్షుడు అష్రాఫ్ అలీ ఖాన్, శివకొండా రెడ్డి, అడ్వకేట్ శివారెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆదినారాయణ, మాజీ కార్పొరేటర్ ట్రాన్స్ఫార్మర్ శ్రీనివాసులు, గురువిరెడ్డి, వెంకట రెడ్డి, జలతోటి జయకుమార్, ఏసుదాసు, వెంకటకృష్ణయ్య, నాసిర్ అలీ, 24వ డివిజన్ ఇంచార్జి శశివర్ధన్, సుధాకర్ యాదవ్, 15వ డివిజన్ ఇంఛార్జి కొండా సుబ్బయ్య, కల్యా సుబ్బారాయుడు, ప్రభాకర్ ఆచారి, భాస్కర్, చిట్వేలి అనిల్, సుధీర్ రెడ్డి, విశ్వనాథ్, అమీర్ బాష, దాసరి నరసింహులు, ఎన్నారై సుధాకర్ యాదవ్, రవి, ఓబులేసు తదితరులు సంఘీభావం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles