Thursday, February 25, 2021

కడప జిల్లా స్పెషల్ కలెక్టర్ శరత్ చంద్ర గారికి వినతిపత్రం సమర్పించిన కడప టీడీపీ నాయకులు

రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధిని దుర్వినియోగం చేస్తున్నారు.

నేడు రైతులు పండించిన పంట దళారుల పాలవుతోంది..రేపు కార్పోరేట్ సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు

రాజ్యసభలో ఆవేశపూరితమైన ప్రసంగమిచ్చిన విజయసాయిరెడ్డి… ఇప్పుడు యూటర్న్ దేనికి నిదర్శనం…

మార్కెట్ యార్డు వ్యవస్థను చట్టబద్ధం చేయాలి

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టానికి సవరణలు చేయాలని ఈ రోజు భారత్ బంద్ కు మద్దతుగా కడప జిల్లా స్పెషల్ కలెక్టర్ శరత్ చంద్ర గారికి వినతిపత్రం సమర్పించిన కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, కడప నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వి.ఎస్.అమీర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్.

అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ…

ఇది రైతుల పోరాటం మాత్రమే కాదు – మనందరి పోరాటం. వ్యవసాయ రంగం రక్షణ – దేశ రక్షణ. ప్రభుత్వాల విధానాలు వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. రైతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది.

స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను అమలు చేసి వ్యవసాయ ఖర్చులపై 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుంటే అసలు కనీస మద్దతు ధర అమలునే నిర్వీర్యం చేసే తీరులో కొత్త వ్యవసాయ చట్టం రూపొందించబడిందని ఆందోళన చెందారు

ఒకే దేశం ఒకే మార్కెట్, రైతులకు స్వేచ్ఛ, రైతులు వ్యయసాయ ఉత్ఫత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్న అంశం వినడానికి బాగుంది. దేశంలో 80% చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులే. వారందరికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి పంట రుణాలు లభించడం లేదు. ప్రయివేటు వ్యక్తులు/ సంస్థల వద్ద అప్పులు చేయక తప్పని పరిస్థితి. పంట కల్లంలోకి రాగానే అమ్మి అప్పు తీర్చాలనే ఒత్తిడికి లోనౌతుంటారు. తమ ఉత్ఫత్తులకు లాభసాటి మార్కెట్ దేశంలో ఎక్కడుందో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని, రవాణా చేసి, మార్కెట్ శక్తుల దోపిడీ బారిన పడకుండా అమ్ముకోవడం అసాధ్యమని అన్నారు

కొత్త చట్టాలు కనీస మద్ధతు ధరల అమలు వ్యవస్థను, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని అన్నారు

రైతులతో కుదుర్చుకొనే ఒప్పందాల అమలులో కార్పోరేట్ సంస్థలు, వ్యాపారస్తులు మోసం చేయకుండా ఎలాంటి కఠినమైన నిబంధనలు లేవు. వివాదాల పరిష్కారానికి సబ్ కలెక్టర్, అటుపై కలెక్టరులకు బాధ్యత అప్పగించడం అసంబద్ధం. ఇది రైతు వ్యతిరేక, కార్పోరేట్, వ్యాపార – వాణిజ్య వర్గాలకు అనుకూల చర్య అని ప్రశ్నించారు

ఉల్లిపాయలు, పొటాటో, నూనెలు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నూనె గింజలను నిత్యావసర సరుకుల చట్టం పరిథి నుండి మినహాయించడం ఆహార భద్రతకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇందులో కడప పార్లమెంట్ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి తుమ్మలూరు మల్లికార్జున, జిలానీ బాష, వికాస్ హరి క్రిష్ణ, నక్కల శివరాం, శివకొండా రెడ్డి, మాసా కోదండ రామ్, జలతోటి జయకుమార్, కొమ్మలపాటి, చెన్నా సుదర్శన్, తుమ్మలూరు శ్రీనివాసులు, మాసాపేట శివ, అమీర్ బాష, శ్రీనివాసులు, ఓబులేసు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles