అమరావతి/కడప
కడప పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో టీడీపీ అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్ష వివరాలు..
పాల్గొన్న టిడిపి మండల పార్టీ బాధ్యులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు
★ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు బుధవారం కడప పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..
★ పార్లమెంటుల వారీగా ప్రజల సమస్యలపై సమీక్షా సమావేశాల్లో భాగంగా ఈ రోజు కడప పార్లమెంటు నేతలతో భేటి అయ్యాం.
★ కరోనాపై జనవరి నుండే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ వైసిపి నాయకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
★ ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.
★ ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.
★ రూ 1000 దాటితే ఆరోగ్యశ్రీ అని గొప్పలు చెప్పారే తప్ప ఆచరణలో చేసింది సున్నా.
★ డిసెంబర్ వస్తున్నా రాష్ట్రంలో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు.
★ కరోనా బాధితుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చినా స్పందించలేదు.
★ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టిడిపి కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేదలను ఆదుకున్నారు.
★ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవాభావంతో పనిచేసింది.
★ కరోనా బారినపడి చనిపోయిన పార్టీ కార్యకర్తలకు నివాళులు.
★ జగన్మోహన్ రెడ్డి 18 నెలల పాలనలో అన్నివర్గాల ప్రజలకు వేధింపులు పెరిగిపోయాయి.
★ విశాఖలో దళిత వైద్యుడు సుధాకర్ పై దాడి నుంచి ప్రతిచోటా వైసిపి దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి, గాలి మాటలు, గాలి చేష్టలే తప్ప ప్రజల మేళ్లు పట్టవు.
★ అసమర్ధత, అహంభావం, నిర్లక్ష్యానికి ప్రతిబింబం జగన్.
★ పరిపాలన చేతగాదు, ఎవరైనా చెప్పినా ఖాతరు చేయడు.
★ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు.
★ తాను, తన అనుచరుల అవినీతి కోసమే పాలసీలు చేస్తున్నారు.
★ డబ్బులే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం.
★ అందుకే అనేక పన్నులు, సుంకాలతో ప్రజలపై పెను భారాలు మోపుతున్నారు.
★ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు.
★ లక్షలాది భవన నిర్మాణ కార్మికుల ఉసురు పోసుకున్నారు.
★ కొత్త పాలసీ పేరుతో ఏడాదిన్నరగా ప్రజలను వేధిస్తున్నారు.
★ అన్ని ప్రాంతాల్లో వైసిపి ఇసుక దోపిడి పేట్రేగిపోయింది.
మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ నైజం ప్రజలందరికీ అర్ధమైంది.
★ నాసిరకం సొంత బ్రాండ్లతో మద్యం మాఫియాకు దోచిపెడ్తున్నాడు.
★ శానిటైజర్లు, కల్తీ మద్యం తాగి జనం చనిపోతున్నా చీమకుట్టినట్లు లేదు.
30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి 10-15 అడుగుల్లోతు ముంపు స్థలాలలో ఆవ భూముల్లో, మడ అడవుల్లో, స్మశానాల్లో, నివాసయోగ్యం కాని ప్రదేశాలలో ఇళ్ల స్థలాలు ఇస్తారట.. రూ వేల కోట్ల ల్యాండ్ స్కామ్ లకు పాల్పడ్డారు.
★ టిడిపి హయాంలో మోడరన్ గేటెడ్ కమ్యునిటీల కంటే మేలైన టిడ్కో ఇళ్లను కడితే వాటిని పేదలకు ఇవ్వకుండా వేధిస్తున్నాడు.
★ టిడిపి పాలనలో అనేక వేల కి.మీ రోడ్లు నిర్మించాం.
★ వేలాది పంచాయతీ భవనాలు, అంగన్ వాడి భవనాలు నిర్మించాం.
★ ఈ పనులు చేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా వాటికి రంగులు వేసి రూ3వేల కోట్లు స్వాహా చేశారు.
★ స్వగ్రామాలను అభివృద్ది చేద్దామనే సదుద్దేశంతో అప్పులు తెచ్చి అభివృద్ది పనులు చేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా తీవ్ర వేధింపులకు గురి చేయడం హేయం.
★ ఈ సమస్యలు అన్నింటిపై అసెంబ్లీ సమావేశాలలో రాజీలేని పోరాటం చేశాం.
★ అప్పట్లో పంచాయతీ ఎన్నికలు వద్దంటే కావాలన్నాడు.
★ ఇప్పుడు అన్నిచోట్ల ఎన్నికలు జరిగేటప్పుడు ఇక్కడకూడా ఎన్నికలు పెడ్తామంటే వద్దంటున్నాడు.
★ వ్యవస్థలన్నా, న్యాయస్థానాలన్నా, ప్రజలన్నా జగన్ కు లెక్కలేదు.
★ ఇతనొక ‘‘వింత ముఖ్యమంత్రి. వితండ ముఖ్యమంత్రి. విధ్వంస ముఖ్యమంత్రి’’.
★ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసిపి ఓటమే లక్ష్యంగా పనిచేయాలి.
★ అన్ని నియోజకవర్గాలలో టిడిపి గెలుపే వైసిపి అరాచకాలకు గుణపాఠం.
పట్టణ ప్రాంతాలలో ఎన్ని టాయ్ లెట్లు ఉంటే అన్నింటి పైన పన్ను.. రోడ్ల పై పన్ను..పుట్ పాత్ లపై పన్ను.. కూర్చుంటే పన్ను, నిలబడితే పన్ను..ఇతనొక పన్నుల సిఎం, సుంకాల సిఎంగా మారాడు.
★ ప్రజలకే భారంగా మారాడు.
★ ఏలూరులో కనీసం పరిశుభ్రమైన త్రాగునీరు అందించలేని అసమర్ధత.. టిడిపి హయాంలో క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేసేవాళ్లం.
★ బాధితుల రక్త నమూనాల్లో సీసం పాళ్లు ఎక్కువ ఉంది.
★ ప్రజలకు ఫిట్స్ వచ్చి గిలగిల కొట్టుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.
★ మూర్ఖత్వంగా చేస్తున్నారు.
కడపలో ఎస్సీ మహిళను దారుణంగా మానభంగం చేసి చంపేస్తే దానిపై కనీస విచారణ చేయలేదంటే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
★ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనే ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంటుందో తెలుస్తోంది.
★ ప్రతి రోజూ ఆడబిడ్డలపై, ఆలయాలపై, గిరిజనులపై, ఎస్సీలపై, ముస్లిం మైనారిటీలపై, బిసిలపై దాడులు చేస్తున్నారు.
★ చట్టాన్ని వైకాపా వాళ్లు చేతిల్లోకి తీసుకుంటే, ఏదో ఒకరోజు మూల్యం చెల్లించుకోక తప్పదు.
★ జగన్ ను నమ్ముకున్న అధికారులు గతంలో జైలుకు పోయారు.
★ ఆ విషయం అందరూ గుర్తుంచుకోవాలి.
★ ఆస్తులను ద్వంసం చేసే దుష్ట సంస్కృతిని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చారు.
★ మామిడితోటలు, చీనీ తోటలను నరికివేసే నీచానికి ఒడిగట్టారు.
★ పెద్దఎత్తున అధికార దుర్వినియోగం చేస్తున్నారు.
★ మీడియా పై ఆంక్షలు పెడ్తున్నారు. జీవో 2430 తెచ్చారు.
★ చివరికి కోర్టులు పైన, న్యాయమూర్తులపైన కూడా విషం కక్కుతున్నారు.
★ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.
★ నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను చూడలేదు.
★ ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రను జైలుకు పంపారు.
★ మరీ ఇన్ని అవినీతి కేసులున్న జగన్ ను ఏం చేయాలి..?
★ తప్పుడు లెక్కలు చెప్పేందుకు అసెంబ్లీని వేదికగా చేశారు.
★ భారీవర్షాలు, వరదల్లో 33 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది.
★ రూ 7వేల కోట్ల పెట్టుబడి నష్టం జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
★ పంట నష్టం జరిగాక ఇన్సూరెన్స్ ప్రీమియం విడుదల చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా..?
★ చనిపోయాక ఇన్సూరెన్స్ చేస్తే పరిహారం ఎలా వస్తుంది..?
విశ్వసనీయత అనేదే లేని పార్టీ వైసిపి.. ఒక ఫేక్ పార్టీ వైసిపి, ఒక ఫేక్ ముఖ్యమంత్రి జగన్.
★ పది ఓట్లలో 5మారితే జగన్ ఇంటికెళ్లడమే..వైసిపి అండతో పోలీసులు తప్పులు చేస్తే వారికి శిక్షపడేవరకు వదిలిపెట్టం.
★ దౌర్జన్యాలు వైకాపా వాళ్లు చేస్తుంటే తెదేపా కార్యకర్తలపై కేసులు పెడ్తారా..?
★ చట్టాన్ని తుంగలో తొక్కితే చర్యలు తప్పవని గుర్తుంచుకోండి.
★ విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అవిశ్రాంతంగా పనిచేశాం.
★ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నం 1 స్థానానికి తీసుకొచ్చాం.
★ పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చాం.
★ అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే పారిపోయే పరిస్థితి తెచ్చారు.
★ పరిశ్రమలను తరిమేసి యువతకు ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
★ పేదలు, సామాన్యుల జీవితాలను దుర్భరం చేశారు.
★ స్థానిక ఎన్నికలకు, జమిలి ఎన్నికలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సంసిద్దంగా ఉండాలి.
★ వైసిపి అరాచకాలకు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.
★ అసెంబ్లీలో టిడిపి గొంతు నొక్కారు.
★ ప్రజల సమస్యలు చర్చకు రాకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు.
★ నాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదు.
★ జగన్మోహన్ రెడ్డి తీరును ప్రజల్లో ఎండగట్టాం.
★ కడపలో ప్రసాద్ ను పాత కేసులతో పేరుతో ఇబ్బంది పెట్టారు.
★ వైసీపీ ఉన్మాద చర్యల పట్ల ఎవరూ మౌనంగా ఉండకూడదు.
★ జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి. విపరీతంగా అప్పులు చేసి, ప్రజలపై విపరీతంగా పన్నుల భారం వేశారు.
★ అన్నివర్గాల ప్రజల్లో వైసిపిపై తీవ్ర అసంతృప్తి ఉంది.
దేవాలయ భూమలు, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చారు.
★ ఇసుక, మద్యం, భూములు, గనులు, ప్రతి ఒక్కటీ వైసిపి నాయకుల ఆదాయ వనరుగా మార్చారు.
ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను బతిమాలి జగన్ అధికారంలోకి వచ్చారు.
★ అన్ని రంగాల్లో దారుణంగా విఫలమయ్యారు.
★ వరద బాధితులకు ఇస్తామన్న రూ 500 కూడా అతీగతీలేదు.
★ కరోనా బాధితులకు రూ2వేలు ఇస్తామని ఎగ్గొట్టారు.
★ బుగ్గవంక వాగు నీటి నిర్వహణలో ఘోరంగా విఫలం అయ్యారు.
★ రాత్రికి రాత్రి నీళ్లు వదిలి కడపను ముంచేశారు.
★ కనీసం బాధితులను వైసీపీ నాయకులు పరామర్శించలేదు.
★ తప్పుడు పనులు చేసిన వారు జైలుకు వెళ్లడం ఖాయం.
★ ముస్లిం మైనార్టీలపై అనునిత్యం దాడులు జరుగుతున్నాయి.
★ నంద్యాలలో అబ్దుల్ సలాం ఘటన ఇందుకు నిదర్శనం.
★ సీఎం నియోజకవర్గంలోనే ఎస్సీలకు రక్షణ లేదు.
★ లేని దిశ చట్టం పేరుతో ప్రజలను మభ్యపెట్టారు.
★ లేని చట్టానికి దిశ పోలీస్ స్టేషన్లు అంటూ మోసం చేశారు.
★ అందుకే ఫేక్ సీఎం అంటున్నాం.
★ పారిశ్రామిక అభివృద్ధికి పులివెందులలో ఏపీఐఐసీకి 250 ఎకరాలు సేకరిస్తే, వాటిని ఇళ్లకు ఇస్తున్నామని గందరగోళం చేస్తున్నారు.
★ భారీవర్షాలు, వరదల్లో శనగ, అరటి, చీనీ రైతులు తీవ్రంగా నష్టపోయారు.
★ పంట బీమా కట్టానని చెప్పి అసెంబ్లీలో అబద్ధం చెప్పారు.
★ ఎవరైనా చనిపోయిన తర్వాత బీమా కడితే ఇస్తారా?
★ క్రాప్ ఇన్సూరెన్స్ కు సొంత కంపెనీ పెడతారంటా..?
★ టీడీపీ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కువగా రాకపోతే ఇన్ పుట్ సబ్సీడీ ఇచ్చి ఆదుకున్నాం.
★ ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడి రెండూలేకుండా చేసి రైతులను నట్టేట్లో ముంచేశారు.
★ పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీది. టీడీపీ హయాంలో అడిగిన రైతులు అందరికీ మైక్రో ఇరిగేషన్ పరికరాలు, ఆధునిక పనిముట్లు ఇచ్చాం.
★ ఇప్పుడు అగ్రికల్చర్ మోడరనైజేషన్ వ్యవస్థను నాశనం చేశారు.
★ వైసిపి వాలంటీర్లు బాగా పనిచేస్తే ఏలూరులో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది..?
★ టిడిపి తెచ్చిన 1100కాల్ సెంటర్, పరిష్కార వేదిక, రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థలను నాశనం చేశారు.
★ ఉన్న వ్యవస్థను రద్దు చేసి మీరు తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వైఫల్యమే ఏలూరులో అల్ల కల్లోలం..అదేమని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే తప్ప చేసిన తప్పులు సవరించుకునే నైజం కాదు వైసిపి నాయకులది, వాళ్లు చేసిన తప్పులకు ప్రజలు రాష్ట్రం మూల్యం చెల్లించడమే బాధాకరం అంటూ, వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపర్చాలని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
👉 టిడిపి నాయకుల ప్రసంగాలు:
👉 మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే:
★ అమరావతి, పోలవరంను వైసిపి ప్రభుత్వం నాశనం చేసింది.
★ రాష్ట్రానికి రెండు కళ్లను పొడిచేసింది.
★ దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయి.
★ కడప రైతుభరోసా కేంద్రాలలో పంట నష్టం రికార్డులు కూడా సక్రమంగా చేయడం లేదు.
★ లక్షా 36వేల ఎకరాలలో పంట నష్టం జరిగితే కేవలం 75 వేల ఎకరాలలో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు.
★ దళిత మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
★ హరిప్రసాద్ పై అక్రమ కేసు బనాయించారు.
★ రాజకీయ కక్ష సాధింపుతో రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, మాజి జెడ్.పి.టి.సి ఇళ్లు ధ్వంసం చేశారు.
👉 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి:
★ నెల్లూరు జిల్లాలో రైతులు వేసిన రెండో పంటలో భారీగా నష్టపోయారు.
★ వరదలు వచ్చినా పలకరించే పాపాన పోవడం లేదు.
★ ఎక్కడా ఇసుక దొరకడం లేదు.
★ పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా ఆగలేదు.
★ నెల్లూరులో ధాన్యం ధర సగానికి కూడా కొనేవాళ్లు లేరు.
★ రూ 16,000 ల పుట్టి వరి ధాన్యం రూ7000 లకు అమ్ముకునే పరిస్థితి.
★ ఏట్లో ఇసుక తెచ్చుకోవాలంటే ట్రాక్టర్ ట్రక్కుకు రూ 7000 చెల్లించాల్సి వస్తోంది.
★ నెల్లూరు లో 4 లక్షల ఎకరాలలో రైతులు పంట వేయడం జరిగింది.
★ ఒక్క ధాన్యం కొనుగోళ్లలోనే దాదాపు రూ 700 కోట్లు భారీ కుంభకోణం జరిగింది.
★ జిల్లాలో రైతులు దాదాపు రూ 1300 కోట్లు నష్టపోయారు.
★ మద్యం నేను చెప్పిందే త్రాగాలని జగన్ అంటున్నారు.
★ తాను అమ్మిందే కొనాలని అంటున్నారు.
★ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తిరుపతి పార్లమెంటు నాయకులు, కార్యకర్తలు సిధ్ధంగా ఉండాలి.
★ వైసిపి దుర్మార్గాలకు గుణపాఠం చెప్పే అవకాశం ఇది.
👉 డాక్టర్ రాజశేఖర్ (బద్వేలు):
★ పేదలకు కొండలపై ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు.
★ నివాసయోగ్యంగాని ఇళ్లస్థలాల వల్ల లాభం ఏమిటి..?
★ ప్రతి అంశంలో అవినీతికి వైసిపి పాల్పడుతోంది.
★ భూకబ్జాలు పెరిగిపోయాయి.
★ టీడీపీ ఇచ్చిన స్థలాలను రద్దు చేసి వాటినే కొత్తగా ఇస్తున్నారు.
★ అబ్దుల్ సలాం ఘటన మైనార్టీల పట్ల వైసీపీ దాష్టీకానికి నిదర్శనం.
★ అన్నక్యాంటీన్లు మూసేసి పేద ప్రజల పొట్ట కొట్టారు.
★ దళితులపై దాడులు పెరిగాయి.
★ జగన్ దురాగతాలకు దళితులే బుద్ది చెబుతారు.
👉 శ్వేతశ్రీ కర్నాటి (బద్వేలు):
★ సీఎం సొంత జిల్లాలో అత్యాచారం జరిగితే పట్టించుకోక పోవడం హేయం.
★ హోంమంత్రి మహిళ అయి ఉండి నిర్లక్ష్యంగా ఉన్నారు.
★ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి.
★ పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.
★ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
👉 అమీర్ బాబు (కడప):
★ విపత్తుల్లో టిడిపి ఆదుకున్న తీరు, ప్రస్తుత వైసిపి నిర్లక్ష్యంపై ప్రజలే చర్చిస్తున్నారు.
★ బుగ్గవంక విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే కడప మునిగేది కాదు.
★ అర్ధరాత్రి నీళ్లను వదిలేశారు.
★ దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు.
★ తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.
👉 గోవర్థన్ రెడ్డి(కడప):
★ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)ని నడపలేని వారు ఏవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తారు..?
★ టిడిపి చేసిన వాటికే జగన్ మళ్లీ శంకుస్థాపనలు చేయడం తప్ప చేసింది శూన్యం.
★ అన్ని ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆపేశారు.
★ వైసిపి లిక్కర్ మాఫియా దోపిడి పేట్రేగిపోయింది.
★ ఇసుకలో, ఇళ్లస్థలాల్లో, మద్యంలో, గనుల్లో అన్నింటిలో దోపిడినే..
👉 రాంగోపాల్ రెడ్డి,( పులివెందుల):
★ ఈ-క్రాప్ బుకింగ్ లో అక్రమాలకు పాల్పడుతున్నారు.
★ గతంలో రాయలసీమ రైతులకు ఇన్సూరెన్స్ వల్ల లబ్ది ఎక్కువ జరిగింది.
★ వైసిపి వచ్చాక సీమ రైతాంగానికి క్రాప్ ఇన్సూరెన్స్ లో కూడా దగా చేశారు.
★ ఈ-క్రాప్ లో బుకింగ్ చేసుకున్న వారికే పంటల బీమా, ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వడంతో, అనేక మంది రైతులకు అవగాహన లేక నష్టపోతున్నారు.
★ ఇంతవరకు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు.
👉 బీటెక్ రవి (ఎమ్మెల్సీ):
★ టీడీపీ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించడం జరిగింది.
★ హార్టికల్చర్ విషయంలో డ్రిప్ ఇరిగేషన్ యంత్రాలు ఇచ్చిన పాపాన పోలేదు.
★ క్రాప్ ఇన్సూరెన్స్ సకాలంలో చెల్లించకుండా రైతులను మోసం చేశారు.
★ ఇసుక, మద్యం విషయంలో వైసీపీ నేతలు దోచుకుంటున్నారు.
👉 పుత్తా నర్సింహారెడ్డి, (కమలాపురం):
★ కమలాపురం నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
★ జిల్లాలో రూ వెయ్యి కోట్లపైన నష్టం రైతులకు జరిగింది.
★ దీనిని తక్కువ చూపే ప్రయత్నం చేస్తున్నారు.
★ విచ్చలవిడిగా సిమెంట్ ధరలు పెంచారు.
★ హైదరాబాద్, బెంగళూరు తీసుకువెళ్లి ఇక్కడి సిమెంట్ ను విక్రయిస్తున్నారు.
★ స్థానికంగా ఇసుక, సిమెంట్ దొరకక నిర్మాణాలన్నీ ఆగిపోయాయి.
★ భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ టిడిపి బాధ్యులు, మండల పార్టీ నాయకులు మాట్లాడారు.