Wednesday, March 3, 2021

కళా వెంకట్రావు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రేపు టిడిపి రాష్ట్ర వ్యాప్త నిరసనలు..

కళా వెంకట్రావు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రేపు టిడిపి రాష్ట్రవ్యాప్త నిరసనలు
పత్రికా ప్రకటనలో టిడిపి నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

ఏపి టిడిపి మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో రేపు టిడిపి నాయకులు, కార్యకర్తలంతా రోడ్డెక్కి నిరసనలు తెలియజేయాలని, జగన్ రెడ్డి సైకో పాలనపై ధ్వజమెత్తాలని తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
‘‘జగన్ రెడ్డి పిచ్చి ముదిరి పోయింది, రాష్ట్రంలో పిచ్చోడి పాలన సాగుతోంది. జగన్ రెడ్డికి అధికారం పిచ్చోడి చేతికి రాయిలా మారింది. దానితో కనబడ్డవాళ్లందరి తలలు పగులగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
కళా వెంకట్రావు సౌమ్యుడు, ఏనాడూ వివాదాల జోలికి వెళ్లేవాడు కాడు. 5సార్లు శాసన సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, టిటిడి ఛైర్మన్ గా, 4శాఖలకు(హోంశాఖ, పురపాలక, వాణిజ్యపన్నుల, ఇంధన శాఖ) మంత్రిగా 38ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని ఈవిధంగా రాత్రి 9గంటలకు తప్పుడు కేసులో ఇరికించి అక్రమ నిర్బంధం చేయడం సిగ్గుచేటు, జగన్ రెడ్డి సైకో చేష్టలకు పరాకాష్ట. బిసి నాయకత్వాన్ని అణగదొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యం.
రామతీర్ధంలో రాముడి తల నరికివేత ఘాతుక చర్య.. వైసిపి రాక్షస కాండను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? నాతో సహా టిడిపి నేతల రామతీర్ధం పర్యటనకు అనుమతించింది పోలీసులే. నేను వెళ్లే గంట ముందు విజయసాయి రెడ్డి పర్యటనకు ఎందుకు అనుమతించారు..? ప్రభుత్వ తప్పిదాలకు టిడిపి నాయకులపై కక్ష సాధిస్తారా..?
జగన్ రెడ్డి ఉన్మాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి, ప్రజాస్వామ్య వాదులంతా గర్హించాలి.
రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలి. వైసిపి ప్రభుత్వ అరాచకాలను అందరూ గర్హించాలి. కళా వెంకట్రావు అక్రమ అరెస్ట్ పై ధ్వజమెత్తాలి. బేషరతుగా విడుదల చేయాలని, తప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేయాలని’’ చంద్రబాబు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles