వీలున్నంత మందికి అత్యవసరంగా వైద్యసేవలు త్వరితగతిన అందించాలనే తలంపుతో గౌరవ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు జిల్లా లైన్స్ క్లబ్ కు అంబులెన్స్ ను తన MPLAD నిధులనుండి మంజూరు చేసి నేడు 12. 12. 2020 న జిల్లా లైన్స్ క్లబ్ ప్రతినిధుల సమక్షంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు అంబులెన్స్ ను ప్రారంభించి వారికి అందించడమైనది. ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలకు అత్యంత ప్రధానంగా త్వరితగతిన వైద్యం అందించవలసిన పరిస్థితులు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నాయని కావునా ఈ సేవలను సర్దవంతంగా అవసరమైన వారికి సమకూర్చే విధంగా లైన్స్ క్లబ్ సేవలను విస్తరింపచేయాలని అభిప్రాయపడ్డారు.


