Friday, February 26, 2021

కింజారపు అచ్చెన్నాయుడు గారి పత్రికా ప్రకటన

అమరావతి (గుంటూరు జిల్లా/నరసరావుపేట)

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..

నరసరావుపేటలో వైకాపా విధ్వంసాలపై తెదేపా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

★ వైకాపా మద్ధతుదారులకు ఓటు వేయలేదని కక్షతో నరసరావుపేట రూరల్ మండలం ఇస్సాపాలెంలో తెదేపా మద్ధతుదారుల ఇళ్లను ధ్వంసం చేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

★ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వర్ల రామయ్య, శాసనసభ ఉపపక్ష నేత శ్రీ నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనందబాబు, నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జీవీఎస్ ఆంజనేయులు, నరసరావుపేట ఇంఛార్జ్ శ్రీ చదలవాడ అరవిందబాబు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం ఉ.11 గంటలకు నరసరావుపేటలో పర్యటించనుంది.

★ బాధితులను పరామర్శించనుంది.

★ విద్వేషంతో విధ్వంసాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

★ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles