రాజేంద్ర ప్రసాద్ గారు విద్యార్థి దశ నుంచే ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించిన నాయకుడు – రాష్ట్ర తెదేపా నాయకులు వెలగపూడి శంకరబాబు
కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఉయ్యూరు పట్టణం మొత్తం నా కుటుంబమే – ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు మున్సిపాల్టీ 14వార్డులో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు రాజకీయంగా సిల్వర్ జూబ్లీ సందర్భంగా 14 వార్డ్ ప్రజలకు ఇంటింటికి ( సిల్వర్ జూబ్లీ ) చిరు కానుక ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన వెలగపూడి శంకరబాబు గారు.
ఈ సందర్భంగా శంకరబాబు గారు మాట్లాడుతూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం సందర్భంగా ముందుగా రాజేంద్ర ప్రసాద్ గార్కి శుభాకాంక్షలు అని, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన ఉద్యమాలు, పోరాటాలు అన్ని కూడా నాకు బాగాతెలుసనీ, ఆయన ఏ ఉద్యమం చేసినా అది సాధించే వరకు పోరాడుతారని, అప్పట్లో ఆయన చేసిన సారా వ్యతిరేక ఉద్యమం జిల్లాలోనే హాట్ టాపిక్ మారిందని, ఇక గ్రామాల అభివృద్ధి కోసం, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల కోసం రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన ఉద్యమాలు, పోరాటాలు మాటల్లో చెప్పలేని అన్ని చేసారని, అందుకే ఆయన్ని ఉద్యమాల వీరుడు, పోరాటాల యోధుడు అని పిలుస్తుంటామని శంకరబాబు అన్నారు. అదేవిధంగాఈ నాటి సమకాలిన రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజల, నాయకుల ఆదరణ పొందిన నాయకుడు ఎక్కిన తొలి మెట్టు మరువకుండా నా ఉయ్యూరు ప్రజల వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని మా అందరికి చెప్తూ ఉంటారని, ఆయన ఆస్తులు సంపాదించక పోయినా, మీ ఆదరణ సంపాదించారని శంకరబాబు అన్నారు.
రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ నా ఉయ్యూరు ప్రజలకు సేవ చేసే విషయంలో నేను కులమాతాలు, పార్టీలు చూడనని, ఎందుకంటే మీరు కూడా నన్ను అలాగే ఆదరించి, 25 సంవత్సరాలు గా వరుసగా నేను పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓటమి అనేదే లేకుండా నన్ను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చారని, అందుకే మీరంటే నాకు అంత అభిమానం అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పూల గారు, నడిమింటి పైడయ్య, మీసాల అప్పలనాయుడు, జగరోతు లక్ష్మణ,నల్లూరి కిరణ్, నజీర్, అజ్మతుల్లా, ప్రవీణ్, ఫణి, నరేంద్ర, అంజి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
