న్యూఢిల్లీ (విశాఖ స్టీల్ ప్లాంట్)
కేంద్ర ఆర్థిక మరియు పెట్రోలియం మంత్రుత్వ శాఖ మంత్రులకు శ్రీకాకుళం తెదేపా ఎంపీ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లేఖ.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక.
★ 1966 తరవాత దశాబ్దకాలం పాటు “విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు” నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసి, 32 మంది తమ ప్రాణాలు అర్పించి, 64 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి, 22,000 ఎకరాల భూమిని తాగ్యం చేసి, సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోడానికి ఎటువంటి పోరాటానికైనా సిధ్ధమే.
★ 2000ల సంవత్సరంలో నాన్నగారు శ్రీ ఎర్రన్నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పార్లమెంటులో గట్టిగా అడ్డుకున్నారు. ఆయనే స్ఫూర్తిగా, ఆయన అడుగజాడల్లో నడిచి, ఆంధ్ర ప్రజల హక్కైన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వెనక్కి తగ్గకుండా పోరాడతానని మాటిస్తున్నాను.
★ ఆంధ్ర ప్రజలకు భారీ నష్టం జరుగుతూన్నా వైస్సార్సీపీ 28 మంది ఎంపీలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?
★ ఇంత జరుగుతున్నా, వైస్సార్సీపీ ప్రభుత్వం దీనిని ఆపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనం.
★ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక.
★ నవరత్న హోదావున్న గొప్ప పరిశ్రమ నష్టాల్లోకి రావడానికి గల కారణాలను ఆన్వేషించాలి, లాభాల్లోకి తేవడానికి మార్గాలను సూచించాలి!
★ ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రభుత్వ రంగ పరిశ్రమ గానే కొనసాగాలని.
StopRINLPrivatization
SaveVizagSteelPlant