అమరావతి
ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హర్ష వర్ధన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్ లేఖ
★ గత కొద్దిరోజులుగా ఏలూరులో ఆరోగ్య సంక్షోభం నెలకొంది.
★ వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నారు.
★ క్షేత్ర స్థాయిలో బాధితుల కష్టాలు చూసిన నేను ఎంతో ఆవేదన చెంది షాక్ కు గురయ్యాను.
★ రాష్ట్ర ప్రభుత్వ స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
★ అందుకే అత్యవసర పరిస్థితి గా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
★ ఏలూరులోని వివిధ ఆసుపత్రులలో 400 మంది వరకు చికిత్స పొందుతున్నారు.
★ మరియు కొంతమంది మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రుల్లో చేరారు.
★ ఈ వ్యాధికి గల మూలాలు ఇంకా తెలియలేదు.
★ రాష్ట్ర ప్రభుత్వమూ అంతగా శ్రద్ధ పెట్టలేదు.
★ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గం లోనే ఈ పరిస్థితి నెలకొన్నా అధికారులు తగు రీతిలో స్పందించలేదు.
★ విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది.
★ సంఘటన పునరావృతం అయితే నిరోధించడానికి దీర్ఘకాలిక చర్యలు ఎక్కడా తీసుకోలేదు.
★ ప్రస్తుత ఏలూరు ఘటన మానవ విషాదంగా మారకుండా ఎలా నియంత్రించాలో అధికారులకు తెలియదు.
రికవరీ రేట్లను అధికంగా నమోదు చేయటానికి బాధిత రోగులను త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టకుండా మాస్ హిస్టీరియా అంటూ ప్రచారం చెయ్యడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది
★ మూర్ఛ భారీన పడిన బాధితులు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారు.
★ రోగులకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ఈ చర్యలు నీరుగారుస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏలూరులో ప్రజలను కాపాడేందుకు కేంద్ర జోక్యం అవసరం.
★ ఇది మళ్లీ పునరావృతం కాకుండా చూడటం అందరి బాధ్యత.
