బేగంపేట మహిళా పోలీసు స్టేషన్ లో జరుగుతున్న విచారణలో భూమ అఖిల ప్రియ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అఖిల కుటుంబ సభ్యుల పాత్ర పై కూడా డౌట్.
- రెండు సింకార్డులు ఉపయోగించాల్సిన అవసరం ఎమిటి ?
- గుంటూరులో శీను పేరుతో తీసుకున్న సింకార్డులు మీరెందుకు వాడుతున్నారు ?
- గుంటూరు శీను కి మీకు సంబందం ఏమిటీ?
- గుంటూరు నుంచివస్తూ శీనుతో ఏమి మాట్లాడారు ?
- భార్గవరాం ఎక్కడ వున్నాడు?
- కార్లు నంబరు ప్లేట్లు MGM స్కూలు దగ్గర మార్చారు. ఆ స్కూలు మీ అత్తమామలదే కదా?
- ఈ కేసులో భర్గవరాం పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఏంటి?
- ఐటి అధికారుల ముసుగో వెళ్ళిన 19 మంది ఎవరు?
- తప్పించుకుని తిరుగుతున్న 14 మంది ఎక్కడ వున్నారు ?
- వీళ్ళందరిని మీరే డీల్ చేశారా లేదా భార్గవ్ రామ్ డీల్ చేశాడా?
- ఈ మొత్తం కిడ్నాప్ కి కుదిరిన బేరం ఎంత?
- ఏవి సుబ్బరెడ్డిపై ఆరోపణలు ఎంటి? గతంలో విభేదాలు ఎంటి?
- ప్రవీణ్ రావు సోదరులతో సంతకాలు చేయించుకున్న పేపర్లు ఎక్కడ వున్నాయి?