చిత్తూరు జిల్లా అంగళ్లులో తెదేపా నేతలపై శుక్రవారం వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనకు నిరసనగా తెదేపా చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి తంబళ్లపల్లె వెళ్లాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు ఉదయం నుండి వివిధ మార్గాల్లో తంబళ్లపల్లె వెళ్ళటానికి బయలుదేరారు, అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ముందుగానే చిత్తూరు జిల్లా తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా.. పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదన్నారు. తిరుపతిలో తెదేపా నేత నరసింహయాదవ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డిని, కలికిరిలో పీలేరు తెదేపా నేత కిశోర్‌కుమార్‌రెడ్డిని, తంబళ్లపల్లెలో తెదేపా నేత శంకర్‌యాదవ్, చిత్తూరులో తెదేపా నేతలు దొరబాబు, నాని లను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు మోహరించారు.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి రామాపురం దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి, ఆయన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు, అదే సమయంలో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యాకర్తలు తంబల్లపల్లి కు వెళ్లాలని గట్టిగా పట్టి రోడ్డు మీదే నిరసన తెలుపుతున్నారు