అమరావతి (కడప జిల్లా/రాయచోటి)
జగన్ రెడ్డి పాలనలో మరో గిరిజన యువతి బలైపోయింది.
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్..
★ రాయచోటిలో వైకాపా నాయకుల ఒత్తిడి, కొంతమంది పోలీసు అధికారుల నిర్లక్ష్య ధోరణ కారణంగా బంగారు భవిష్యత్తు ఉన్న పూజారి ప్రియాంక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
★ ప్రేమ పేరుతో మోసపోయింది.
★ ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన తండ్రికి అవమానం ఎదురవ్వడంతో ఆత్మహత్యకి యత్నించింది.
★ ప్రియాంకని మోసం చేసిన వ్యక్తి తండ్రి వైకాపా ఎమ్మెల్యే అనుచరుడు అవ్వడంతో ప్రియాంక కి ఈ పరిస్థితి వచ్చింది.
★ ప్రభుత్వం ప్రియాంక కి మెరుగైన వైద్యం అందించాలి.
★ ఆమెకు ఈ దుస్థితి తెచ్చిన వైకాపా నాయకులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.