కృష్ణ జిల్లా (గన్నవరం)
గన్నవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జి, జాతీయ తెదేపా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, శాసనమండలి సభ్యులు, శ్రీ బచ్చుల అర్జునుడు విలేకరుల సమావేశం వివరాలు..
స్థానిక సంస్థల ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు తధ్యం
– పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
★ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు తధ్యమని ఆ పార్టీ గన్నవరం ఇన్చార్జి, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు అన్నారు.
★ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేస్తున్నారని, అందుకు ప్రతిఫలం స్థానిక సంస్థల ఎన్నికలలో దక్కనుందన్నారు.
★ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వల్లే తాను కొవిడ్ నుంచి కోలుకున్నట్లు చెప్పారు.
★ గన్నవరంలో నిర్మించిన పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..
★ తాను కరోనా వైరస్ బారిన పడటంతో కార్యాలయం ప్రారంబోత్సవం ఆలస్యమైందన్నారు.
★ మంచి రోజులు లేకపోవడంతో పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశానన్నారు.
★ సంక్రాంతి పండుగ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర పార్టీ నాయకులతో కలసి అట్టహాసంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తానన్నారు.
★ ఆ రోజునే నియోజకవర్గస్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
★ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గంలోనే నివాసం ఉండనున్నట్లు తెలిపారు.
★ అందులో బాగంగానే నిడమానూరుకు మకాన్ని మార్చనున్నానని, కొత్త ఇంట్లో కూడా గృహ ప్రవేశం చేసినట్లు తెలిపారు.
★ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగానే ఉందని చెప్పారు.
★ నియోజకవర్గంలో 84 గ్రామ పంచాయతీలుండగా, ఇప్పటికే మూడొంతుల గ్రామాలలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలను పరిచేయం సుకున్నట్లు పేర్కొన్నారు.
★ త్వరలోనే మిగిలిన గ్రామాల్లోనూ పర్యటిస్తానని, నియోజకవర్గంలో ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, అందరికీ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
★ ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు కడియాల సీతారామయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిలు దొంతు చిన్నా మరియు కొత్త నాగేంద్రకుమార్(నాగబాబు), నీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ, తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు మూల్పూరి సాయి కల్యాణి, గన్నవరం మండల అధ్యకుడు జాస్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, విజయవాడ రూరల్ అధ్యకుడు గొడ్డళ్ల చిన రామారావు, ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్, ఉంగుటూరు మండల అధ్యకుడు డాక్టర్ ఆరుమళ్ల కృష్ణారెడ్డి, బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్ తదితరులు పాల్గొన్నారు.