అమరావతి
జగన్రెడ్డి సీఎం అయ్యాక హిందువుల మనోభావాలు గాయపరిచేలా ఆలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి.
– తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు..
★ మొన్న రామతీర్థం, నిన్న రాజమహేంద్రవరంలో దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేశారు.
★ జగన్రెడ్డి సీఎం అయ్యాక హిందువుల మనోభావాలు గాయపరిచేలా ఆలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి.
★ ఇప్పటివరకూ 125కి పైగా గుడులలో విధ్వంసాలు జరిగినా ఒక్క నిందితుడిని పట్టుకోలేదు.
★ తొలిసారి విగ్రహం ధ్వంసమైనప్పుడే స్పందించి ఉంటే..ఈ రోజు హిందూ ధర్మానికి ఈ దుస్థితి వచ్చేది కాదు.
★ గుడులపైనా, దేవుళ్లపైనా దేశంలోనే ఎక్కడాలేని విధంగా దాడులు జరుగుతున్నా సీఎం జగన్రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలి.