Friday, March 5, 2021

టిడిపి అధికార ప్రతినిధి, డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి పత్రిక ప్రకటన….

చిత్తూరు జిల్లా

టిడిపి అధికార ప్రతినిధి, డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి పత్రిక ప్రకటన వివరాలు..

టిడిపి నేతలపై వైకాపా దాడులు సహించం

– నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తంబళ్లపల్లె పర్యటనలలో తీవ్ర ఉద్రిక్తత

– తేదేపా నాయకులు వాహనశ్రేణిపై దాడులకు తెగబడ్డ వైకాపా కార్యకర్తలు

– ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు

★ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పోలిట్బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డిల వాహన శ్రేణి పై అంగళ్ళులో వైకాపా గూండాలు దాడి చేయడం హేయమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు.

ఆయన టెలిఫోన్ లో విలేకరులతో మాట్లాడుతూ..

★ వైకాపా దౌర్జన్య చర్యలను తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం కిషోర్ కుమార్, శ్రీనివాసులు రెడ్డిలతో పాటు తంబళ్ళ పల్లె నియోజకవర్గ ఇన్చార్జి శంకర్ యాదవ్, కోఆర్డినేటర్ కె.మల్లికార్జున్ నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా రామచంద్రారెడ్డి, అధికార ప్రతినిధి మధ్య పట్ల సూర్య ప్రకాష్ ఇతర నాయకులతో కలిసి భారీ వాహనశ్రేణి తో తంబళ్ళ పల్లె నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారని ఆయన తెలిపారు.

★ అయితే అంగళ్లలో వైకాపా కార్యకర్తలు తెదేపా నాయకుల వాహనశ్రేణి లోని వాహనాలను అడ్డకుని కర్రలు, ఇనుప రాడ్లు,రాళ్లతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపించారు.

★ ఈ దాడిలో ఒక కారు పూర్తిగా దెబ్బతిన్నదని, రాటకొండ మధుబాబుతో పాటు ముగ్గురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.

★ ఇంత జరుగుతున్నా శాంతిభద్రతలను కాపాడవలసిన పోలీసులు ప్రేక్షక పాత్రవహించడం దురదృష్టకరన్నారు.

★ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని తమ్ముడు తంబళ్ళ పల్లె ఎమ్మెల్యే ద్వారకనాధ రెడ్డిలు వెనుక వుండి ఈ ధౌర్జన్యం చేయించారని ఆయన ఆరోపించారు.

★ ఇలాంటి హింస, ధౌర్జన్యాలను చూస్తూ సహించబోమని హెచ్చరించారు.

★ రోజు రోజుకు ప్రజల్లో టిడిపి పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి సహించలేకవైకాపా నేతలు ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు.

★ పోలీసులు, నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసులు పెట్టాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles