Wednesday, March 3, 2021

టిడిపి నేతలతో టీడీపీ అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్

అమరావతి

టిడిపి నేతలతో టీడీపీ అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ వివరాలు..

భోగిమంటల్లో వైసిపి ప్రభుత్వ రైతు వ్యతిరేక జీవోలను తగులపెట్టాలి

– జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తాలి

– 7వరుస విపత్తుల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సాయం గుండుసున్నా

– ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ 2,700కోట్లు పెండింగ్ పెట్టారు.

– కనీస ధర లేక టమాటా రోడ్లపై పారబోస్తున్నారు, అరటి తోటలు దున్నేస్తున్నారు

– రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న జీవోను దగ్దం చేయాలి

– వైసిపి రైతు వ్యతిరేక విధానాలను రేపటి భోగిమంటల్లో తగులపెట్టాలి

– టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు పిలుపు

★ పాల్గొన్న టిడిపి జోనల్ ఇన్ ఛార్జ్ లు, పార్లమెంటు అధ్యక్షులు, సమన్వయకర్తలు
తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు మంగళవారం టిడిపి జోనల్ ఇన్ ఛార్జ్ లు, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు, సమన్వయకర్తలు, అసెంబ్లీ అభ్యర్ధులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు.

👉 ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ..

★ రైతులు, రైతుకూలీల పండుగ సంక్రాంతి.. చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే పండుగ.

★ గ్రామీణ ప్రజానీకం ఆనందంగా జరుపుకునే పండుగ.

★ మన పెద్దలను గుర్తుచేసుకుని గౌరవించుకునే పండుగ.

★ మన సంస్కృతి, సంప్రదాయాల వేడుక.

★ ప్రకృతిని ఆరాధించే పండుగ, పశువులను ప్రేమించే పండుగ సంక్రాంతి.

★ 7వరుస విపత్తుల్లో రైతులు పూర్తిగా నష్టపోయారు.

★ అటు ఇన్సూరెన్స్ అందక, ఇటు ఇన్ పుట్ సబ్సిడి రాక ఇబ్బందులు.

★ ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ 2,700కోట్లు పెండింగ్ పెట్టారు.

★ తడిసి రంగుమారిన ధాన్యం కొనేవాళ్లు లేరు.

★ ఈ రోజు కూడా కర్నూలులో టమాటా ధర లేక రోడ్లపై పారబోశారు, కిలో టమాటా 30పైసలకు కూడా కొనేవాళ్లు లేరు. రేటు లేక అరటి తోటలను దున్నేస్తున్నారు.

★ అరటి ధర టన్ను రూ 8వేల నుంచి రూ 2వేలకు పడిపోయింది.

★ అటు పండిన పంటలకు మద్దతు ధరలేదు, ఇటు విపత్తుల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం లేదు.

★ భరోసా కింద రూ12,500ఇస్తామని అందులో సగం ఎగ్గొట్టి రైతులకు 5ఏళ్లలో రూ21వేల కోట్ల మోసం చేశారు.

★ టిడిపి తెచ్చిన రైతు సంక్షేమ పథకాలను రద్దు చేశారు.

★ మైక్రో ఇరిగేషన్ సబ్సిడి రద్దు చేశారు.

★ రుణమాఫీ 4, 5 విడతల సొమ్ము రూ 8వేల కోట్లు ఎగ్గొట్టారు.

★ సబ్సిడిపై వ్యవసాయ యాంత్రీకరణ పథకం, రైతు రథం స్కీమ్ లు రద్దు చేశారు.

★ పేదల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు.

★ రైతుల సంక్షేమాన్ని కాలరాశారు.

★ అప్పుల కోసం రైతులు, పేదలపై భారాలు విచ్చలవిడిగా వేశారు.

★ ప్రజలపై విచ్చలవిడిగా పన్నులతో రూ 70వేల కోట్లు భారాలు మోపారు.

★ లక్షా 30వేల కోట్ల అప్పులు తెచ్చారు.

★ రైతుల ఉచిత కరెంటుకు ఎగనామం పెడ్తున్నారు.

★ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు.

★ రైతుద్రోహిగా సిఎం జగన్ రెడ్డి మారారు.. వైకాపా ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాల వల్లనే గత ఏడాదిన్నరలో 1,779మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

★ వైకాపా పాలనలో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 55% పెరిగాయని ఎన్ సిఆర్ బి లెక్కలే చెప్పాయి.

★ 400రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు, రైతుకూలీలు, మహిళలను పట్టించుకున్నవాళ్లు లేరు.

★ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, రైతుకూలీలకు నమ్మకద్రోహం చేశారు.

★ అటు ఆదాయం లేదు, ఉపాధి పోయింది, పంటలు లేవు, 30వేల రైతు కుటుంబాలను రోడ్డుకీడ్చారు.

★ టిడిపి హయాంలో విపత్తు పరిహారం భారీఎత్తున పెంచి రైతులను ఆదుకున్నాం.

★ హుద్ హుద్ లో, తిత్లిలో నష్టపోయిన రైతులకు పరిహారం భారీగా అందించాం.

★ సకాలంలో ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడి అందించాం.

★ బాతులు కూడా తినని ముక్కిపోయిన ధాన్యం కూడా కొన్నాం.

★ ప్రతి పేదవాడు కుటుంబంతో ఆనందంగా పండుగ జరుపుకునేలా ‘‘సంక్రాంతి కానుకలు’’ ఇచ్చాం.

★ దానిని రద్దు చేసి పేదల పొట్టకొట్టారు.

★ వైకాపా అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమ పథకాలు 39రద్దు చేశారు.

★ రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, ఫుడ్ బాస్కెట్ రద్దు చేశారు, అన్నా కేంటిన్లు మూసేశారు.

★ పేదల స్కీమ్ ల లోనూ, వైసిపి స్కామ్ లే.. ఇళ్ల స్థలాల పంపిణిలోనే రూ 6,500కోట్ల స్కామ్ లు చేశారు.

★ శాండ్-ల్యాండ్, వైన్-మైన్ మాఫియా దోపిడి.

★ ఇసుక, సిమెంటు ధరలు పెంచేసి 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు.

★ చట్టసభలపై, న్యాయవ్యవస్థపై, రాజ్యాంగ సంస్థలపై, ఎన్నికల సంఘంపై, మీడియాపై కూడా దాడులు చేస్తున్నారు.

★ ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.

★ బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటిలపై దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది.

★ హింసాత్మక చర్యలతో భయభ్రాంతులను చేస్తున్నారు.

★ స్థానిక ఎన్నికలకు వైసిపి నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.

★ గ్రామ స్వరాజ్యానికి, స్థానిక స్వపరిపాలనకు గండికొట్టారు.

★ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపిని ఓడించడమే అందరి లక్ష్యం కావాలి.

★ వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి.

★ దాడులు, దౌర్జన్యాలకు తగిన గుణపాఠం చెప్పాలి.

★ రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో తగులపెట్టాలి..

★ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న జీవో, సున్నావడ్డీ కుదించడం, జడ్ బిఎన్ ఎఫ్ నిధులను వైఎస్ పుట్టినరోజు వేడుకలకు కేటాయించడం, కులాల వారీగా రైతుల్లో విభజన తేవడం, తదితర జీవోలను భోగి మంటల్లో దగ్దం చేయాలి.

★ రైతుల కన్నీళ్లకు ఈ సంక్రాంతి చరమగీతం కావాలి.

★ ప్రతి రైతుకు, రైతుకూలీకి టిడిపి అండగా ఉండాలి.

★ వైకాపా రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి.

★ జగన్ రెడ్డి మోసగాడు, నేరచరిత్ర ఉన్న వ్యక్తి, నమ్మకద్రోహి..

★ 140పైగా దేవాలయాల్లో దాడులు, విధ్వంసం చేస్తుంటే జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారు..

★ రాజకీయ లబ్ది కోసం తప్పుడు పనులు చేస్తున్నారు.

★ దేవాలయాలపై దాడులు కప్పిపుచ్చడానికే ఇష్టారాజ్యంగా మాట్లాడతున్నారు.

★ మారుమూల ఆలయాల్లో మాత్రమే దాడులు జరుగుతున్నాయని మభ్య పెట్టాలని చూస్తావా..?

★ సింహాచలం, విజయవాడ, శ్రీకాళహస్తి, అంతర్వేది, అన్నవరం ఎక్కడ ఉన్నాయి..?

★ దాడులకు గురైన ఆలయాలన్నీ మారుమూల ఉన్నాయని జగన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు.

★ టిడిపి పాలనలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాం.

★ అన్నిమతాల వారి మనోభావాలను గౌరవించాం.

★ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అన్నిమతాలవారు శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాం.

★ అలాంటిది జగన్ రెడ్డి సిఎం అయ్యాక మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అన్యమత ప్రచారాలు, బలవంతపు మత మార్పిళ్లు, దాడులు-విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేయడం హేయం.

★ దీనికి తగిన మూల్యం వైకాపా చెల్లించక తప్పదు.

★ జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి గ్రామగ్రామానా ఘనంగా జరపాలి.

★ తెలుగుజాతి ఘనత ప్రపంచానికే చాటిచెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్.

★ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించాలి.

‘‘లెజండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్’’ విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

👉 టిడిపి నాయకుల ప్రసంగాలు:

👉 పల్లె రఘునాథ రెడ్డి(మాజీ మంత్రి):

★ 19నెలల్లో విద్యారంగాన్ని సిఎం జగన్ రెడ్డి భ్రష్టు పట్టించారు.

★ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ లో కోతలు పెట్టారు.

★ విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశారు.

★ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూసేసే పరిస్థితి కల్పించారు.

★ పిజి ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టారు.

★ డిగ్రీ విద్యార్ధులకు సగానికి కోతపెట్టారు.

★ టిడిపి తక్కువ ఫీజులు ఇస్తోందని విమర్శించి, తాము వచ్చాక రూ లక్ష ఇస్తామని నమ్మించి జగన్ రెడ్డి విద్యార్ధులను, తల్లిదండ్రులను మోసం చేశారు, నమ్మకద్రోహం చేశారు.

👉 కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (నెల్లూరు):

★ బాబాయి హత్య ఎవరు చేశారో కనుక్కోలేని జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు.

★ బాబాయి హంతకులను పట్టుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు..?

★ ఎన్నికల ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగి సిఎం అయ్యాక వద్దనడం బాబాయి హంతకులకు వత్తాసు పలకడం కాదా…?

★ కోడికత్తి కేసు ఏం చేశావు..?

★ కరోనా ఉందని పంచాయితీ ఎన్నికలు వాయిదా వేసేవాళ్లు నిన్న వేలాది మంది విద్యార్ధులతో సిఎం సభ ఎలా పెట్టారు..?

★ సభా వేదికపై ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకున్నవాళ్లు లేరు.

★ కనీస మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయిన నెల్లూరు రైతులను ఆదుకోవాలని కోరిన మంత్రి లేరు.

👉 మల్లెల లింగారెడ్డి (మాజీ ఎమ్మెల్యే):

★ పేదల స్కీమ్ లలో స్కామ్ లకు పాల్పడే నీచానికి జగన్ రెడ్డి దిగజారాడు.

★ అమ్మవడికి బదులుగా ఇప్పుడు లాప్ టాప్ లు అంటున్నాడు.

★ స్కామ్ ల కోసమే అమ్మవడి డబ్బులు ఎగ్గొట్టి లాప్ ట్యాప్ ల కొనుగోళ్లకు తెరలేపాడు.

★ ఇళ్ల స్థలాల్లో అవినీతి కుంభకోణాలతో ఇప్పటికే వైసిపి భ్రష్టుపట్టింది.

★ స్కామ్ ల కోసమే వైసిపి స్కీమ్ లు తప్ప పేదల కోసం కాదు.

👉 జివి ఆంజనేయులు (నరసరావు పేట పార్లమెంటు):

★ పల్నాడులో టిడిపి కార్యకర్తలపై యధేచ్చగా దాడులు చేస్తున్నారు.

★ హత్యలు, భౌతిక దాడులతో భయోత్పాతం సృష్టిస్తున్నారు.

★ బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటిలపై దౌర్జన్యాలు చేస్తున్నారు.

★ గురజాల, వినుకొండలో వైసిపి దుర్మార్గాలకు హద్దు అదుపు లేకుండా పోయింది.

★ పేదల సంక్షేమ పథకాలను 10%మందికే ఇచ్చి, 90%మందికి ఎగ్గొడ్తున్నారు.

★ అమ్మవడిలో అనేక ఆంక్షలతో పథకానికి తూట్లు పొడిచారు.

★ ప్రజలే వైసిపికి తగిన బుద్ది చెబుతారు.

ఈ సమావేశంలో టిడి ఎల్ పి ఉపనేత రామానాయుడు, మాజీ మంత్రులు జవహర్, నెట్టెం రఘురామ్, మాజీ ఎంపి తోట సీతామహాలక్ష్మి, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, గౌరవాని శ్రీనివాసులు, తుడా మాజీ ఛైర్మన్ నరసింహ యాదవ్, ఎండి నజీర్(విశాఖ) తదితరులు మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles