Monday, March 1, 2021

టిడిపి సీనియర్ నాయకులతో తెదేపా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్

అమరావతి

టిడిపి సీనియర్ నాయకులతో తెదేపా అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ వివరాలు..

పాల్గొన్న పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు..

– స్థానిక సంస్థల ఎన్నికలను స్వాగతించిన చంద్రబాబు.

– స్థానిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో టిడిపి శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం.

★ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం టిడిపి సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

★ ఈ రోజునుంచే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

★ ఎన్నికల కమిషన్ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది, 23న నోటిఫికేషన్ వస్తుంది, వచ్చేనెల 17లోపు ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది.

★ ఆవిర్భావం నుంచి టిడిపి సెక్యులర్ పార్టీ.

★ కానీ వైసిపి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం జరుగుతోంది.

★ ఒక ఉన్మాది పాలన ఏపిలో చూస్తున్నాం.

★ జగన్ రెడ్డిది స్ప్లిట్ పర్సనాలిటి (వింత మనస్తత్వం).. అపరిచితుడు సినిమాలో లాగా చేస్తున్నాడు.

★ చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు.. ఇతనొక ఫేక్ సిఎం… ఫేక్ మాటలు, ఫేక్ పనులు, ఫేక్ పాలన చేస్తున్నాడు..

★ సమాజంలో అన్నివర్గాల ప్రజలపై దాడులు చేస్తున్నారు.

★ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేశాడు.

★ టిడిపి నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారు.

★ పోలీసుల్లో కొందరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.

★ వైసిపి 19నెలల పాలనలో ముస్లింలపై విపరీతంగా దాడులు జరిగితే టిడిపినే అండగా ఉంది.

★ పల్నాడులో ముస్లింలను గ్రామ బహిష్కారం చేస్తే గుంటూరులో పునరావాస శిబిరం నడిపి ఆదుకుంది.

★ నెల్లూరులో ముస్లింల ఇళ్లు కూల్చేస్తే అండగా నిలబడింది.

★ నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబానికి, రాజమండ్రిలో అబ్దుల్ సత్తార్ కుటుంబానికి, సత్తెనపల్లిలో మహ్మద్ గౌస్ కుటుంబానికి, గుంటూరులో మౌజమ్ హనీఫ్ కు అండగా ఉన్నాం.

★ వక్ఫ్ బోర్డు టిడిపినే తెచ్చింది.

★ హజ్ భవన్ లు కట్టింది టిడిపినే.

★ నువ్వేం చేశావు ఈ 19నెలల్లో ముస్లింలకు..?

★ అమరావతి పేరు పలకడమే నీకు ఇష్టం లేదు..

★ అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇచ్చిన భూమిని, నిధులను నాలుగోవంతుకు తగ్గిస్తావా..?

★ టిడిపి హయాంలో పుణ్యక్షేత్రాలకు పెట్టిన తీర్ధయాత్రల పథకాన్ని నువ్వురాగానే తీసేస్తావా..?

★ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యలపై సిబిఐ దర్యాప్తు చేయిస్తామని కౌన్సిల్ లో చెప్పి వెనక్కి పోయారు.

★ కౌన్సిల్ రద్దు తీర్మానం చేసి ఢిల్లీ పంపిస్తాడు.

★ మరోపక్క కౌన్సిల్ కు వైకాపా అభ్యర్ధులను ప్రకటిస్తాడు.

★ అందుకే అనేది ఇతనొక స్ప్లిట్ పర్సనాలిటి అని..

★ ముఖ్యమంత్రిగా నా హయాంలో తాడేపల్లి గూడెంలో ఒక్క సంఘటన జరిగితే స్వయంగా నేనే అక్కడికెళ్లి పరిస్థితులు చక్కదిద్దాను.

★ మరొక్కటి జరిగితే సహించేది లేదని హెచ్చరించాను.

★ 14ఏళ్లు ముఖ్యమంత్రిగా మత సామరస్యాన్ని కాపాడాను, అన్ని మతాల మనోభావాలను కాపాడాను.

★ ఇప్పుడు జగన్ రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రంలో ఏం జరుగుతోంది..?

★ 140పైగా ఆలయాలపై దాడులు జరిగితే కనీసం స్పందించే బాధ్యత నీకు లేదా..?

★ ఎప్పుడు విజయవాడలో వెండి సింహాల చోరీ జరిగింది..?

★ అప్పుడెందుకు వెళ్లలేదు నువ్వు అక్కడికి..?

★ 5నెలలైనా ఇప్పటికీ వాటి ఆచూకీ గుర్తించలేక పోయావా..?

★ నదిలో మునకేసి హిందువుగా మారానని మోసం చేశావు.

★ నీ ఓట్ల కోసం మతాలతో నాటకాలు ఆడతావా..?

★ నేనెప్పుడూ నాటకాలు ఆడలేదు.

★ నేను హిందువు అని చెప్పడానికి భయపడలేదు..

★ క్రిస్టియన్ అని ధైర్యంగా చెప్పడానికి ఎందుకు భయం.. అందులో సిగ్గుపడాల్సింది ఏముంది..?

★ అన్నిమతాలను కాపాడటం సిఎం బాధ్యత..ఒక్కచోటకైనా వెళ్లావా 140దేవాలయాల్లో ..?

★ తండ్రి చనిపోతే ఊరూరా తిరిగావే..4ఏళ్లు ఓదార్పు యాత్రలు చేశావే..ఇప్పుడు నీకు బాధ్యత లేదా.. తండ్రి లేడని వీధివీధి తిరిగి ఇప్పుడు అడ్డంగా నరికేస్తావా అందరినీ..
ఏపిలో ఏనాడూ లేని మత విద్వేషాలను తెచ్చింది జగనే..

★ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కన్వర్షన్లు చేస్తున్నాడు.

★ అన్యమత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నాడు.

★ తన నియోజకవర్గం (పులివెందుల)లో వినాయకుడి విగ్రహం కాపాడలేని వాడు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు..?

★ తన నియోజకవర్గంలో ఎస్సీ మహిళల మాన ప్రాణాలకు భద్రత కల్పించలేని వాడు రాష్ట్రంలో మహిళలకు భద్రత ఏం కల్పిస్తాడు..?

★ పులివెందుల వెళ్లి వినాయకుడి విగ్రహం ఎందుకు పరిశీలించవు..?

★ అక్కడ హత్యాచారానికి గురైన దళిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించవు..?

★ అబ్దుల్ సలామ్ బంధువులను గెస్ట్ హవుస్ కు పిలిపించి మాట్లాడతావా..?

★ బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని నీ ఇంటికి పిలిపించుకుని మాట్లాడతావా..?

★ అదే చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబాన్ని ఇంటికెళ్లి ఓదారుస్తావా..?

★ ఇదేనా నీ సామాజిక న్యాయం..?

★ నీవాళ్లకో రకం, బైటవాళ్లకో రకం..

★ ఆలయాలపై 140పైగా దాడులు చేసిందెవరో నువ్వు చెప్పాలి..1336చోట్ల టిడిపి కార్యకర్తలపై దాడులు చేసిందెవరో నువ్వు చెప్పాలి..

★ 16మంది టిడిపి కార్యకర్తలను హతమార్చిందెవరో నువ్వు చెప్పాలి…

★ రాష్ట్రవ్యాప్తంగా హత్యాకాండను జగన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు.

★ రాజకీయ లాభాల కోసం వాడుకుంటున్నాడు.

★ ఒక క్రిస్టియన్ ను శ్రీరాముడితో పోల్చి, క్రిస్టియన్ మంత్రి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టి హిందువుల మనోభావాలను గాయపరుస్తారా..?

★ ఒకపక్క శ్రీరాముడి తల నరికితే స్పందించని, కనీసం సందర్శించని క్రిస్టియన్ ముఖ్యమంత్రిని శ్రీరాముడితో పోలుస్తారా..?

★ ఇంతకన్నా హైందవ సంస్కృతిపై దాడి మరొకటి ఉందా..? దీనికి ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి.

★ దుర్గమ్మ ఫ్లై వోవర్ నిర్మాణం కేంద్రం ప్రాజెక్టు.. కేంద్రం నిధులతో గడ్కరీ సూచనల మేరకే కట్టిన ఫ్లైవోవర్ ..అప్పటి దేవాదాయ మంత్రి కూడా బిజెపి వ్యక్తి..

★ మతపెద్దలను సంప్రదించి, సంప్రోక్షణలన్నీ చేసి, ఆచారాలకు అనుగుణంగా ఆలయాలను అభివృద్ది పనుల కోసమే రీప్లేస్ చేశాం.. దానిని అడ్డం పెట్టుకుని టిడిపిపై దుష్ప్రచారం చేయడం హేయం.

★ బాబాయి హత్య కేసుపై సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరిన నువ్వే మళ్లీ వద్దని ఎందుకన్నావు..?

★ తీర్మానం పెట్టి కౌన్సిల్ రద్దు చేయడం ఏమిటి..?

★ మళ్లీ కౌన్సిల్ కు కొత్త అభ్యర్ధులను ఎంపిక చేయడం ఏమిటి..?

★ కరోనాలో ఎన్నికలు కావాలని అనడం ఏమిటి..?

★ అన్నిచోట్లా ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు వద్దనడం ఏమిటి..?

★ ఎస్ ఈసిని తొలగించడం ఏమిటి..?

★ అన్నీ గాలి కబుర్లు, గాలి మాటలు, గాలి సిఎం, గాలి పార్టీ అనేది అందుకే..

★ పోలీసులను అడ్డం పెట్టుకుని గత మార్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు చేశాడు.

★ ఇప్పుడలా చేయలేడు కాబట్టే ఎన్నికలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాడు.

★ సురక్షిత మంచినీటిని కూడా ఇవ్వడం చేతగాని ముఖ్యమంత్రి ఇతను.. ఏలూరులో వందల మందిని ఆసుపత్రి పాలు చేశాడు.

★ రైతులను అనేక ఇబ్బందులు పెట్టాడు.

★ వేలాదిమంది రైతులపై తప్పుడు కేసులు పెట్టాడు.

★ వందలాది రైతులను జైళ్లకు పంపారు.

★ మహిళలకు చేసిన మేళ్లు లేకపోగా అఘాయిత్యాలతో బెంబేలెత్తిస్తున్నాడు.

★ యువత ఉపాధిని దెబ్బతీశాడు.

★ పారిశ్రామికవేత్తలను బెదిరించి కంపెనీలను తరిమేశాడు.

★ 32లక్షల ఉద్యోగాలను యువతకు దక్కకుండా చేశాడు, రూ16లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా చేశాడు.

★ రోడ్లన్నీ గుంతల మయం చేశాడు.

★ ఒక్క రోడ్డు వేయడం కాదుకదా, కనీసం గుంతలు పూడ్చలేదు.

★ రూ 70వేల కోట్ల పన్నులు పెంచేశాడు.

★ వీథి దీపాలపై, మరుగుదొడ్లపై, డ్రైనేజిపై, నడిచే రోడ్లపై పన్నులేశాడు.

★ 18నెలల్లో రూ లక్షా 36వేల కోట్ల అప్పులు చేశారు.

★ సగటున కుటుంబానికి రూ లక్ష అప్పు చేశారు.

★ ఒక్కో కుటుంబంపై రూ50వేల పన్నుల భారం వేశారు.

★ ఒక్కో కుటుంబంపై రూ లక్షన్నర భారం మోపారు.

★ స్కీములన్నీ స్కాముల కోసమే..

★ జె ట్యాక్స్ వసూళ్ల కోసం ఇసుక, సిమెంటు ధరలు పెంచేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టాడు.

★ వలస కార్మికులకు కనీసం ఒకరోజు భోజనం పెట్టలేక పోయాడు.

★ భూములు, ఖనిజ సంపద దోచేస్తున్నాడు.

★ ఇసుక, మట్టి, గ్రానైట్, లేటరైట్, ముగ్గురాయి, బాక్సైట్ అంతా దోపిడి చేస్తున్నాడు.

★ సగానికి తగ్గించేశాడు ఇంటి స్థలం విస్తీర్ణం… 3సెంట్లనుంచి సెంటున్నర, 2సెంట్లనుంచి సెంటుకు తగ్గించాడు.

★ వేలకోట్ల అవినీతి కుంభకోణాలు చేశాడు.

★ టిడిపి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, క్రైస్తవులు, హిందువుల స్మశానవాటికల అభివృద్దికి పాటుబడ్డాం.

★ నరేగా నిధులను సద్వినియోగం చేసుకున్నాం.

★ వైసిపి వచ్చాక అన్ని పనులు నిలిపేశారు.

★ హిందూ స్మశాన స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం వైకాపా హిందూ ద్వేషానికి నిదర్శనం.

★ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి ఓటమే ఈ దాడులు, దౌర్జన్యాలకు గుణపాఠం కావాలి.

★ టిడిపి హయాంలో ప్రతి గ్రామం, వార్డుకు వెలుగులిస్తే, వైసిపి వచ్చాక అంధకారంలో ముంచింది.

★ ప్రతి గ్రామం, వార్డును ఎల్ ఈడి బల్బులతో టిడిపి వెలుగొందేలా చేస్తే, గత 10రోజుల నుంచి గ్రామాలను చీకటిమయం వైకాపా చేసింది.

★ బిల్లులు చెల్లించలేదని వీధి దీపాలకు కరెంటు కట్ చేశారు.

★ తాగునీటి వనరులను కనీసం క్లోరినేషన్ చేసే పరిస్థితి కూడా లేదు.

★ పారిశుద్యం అద్వానంగా మార్చారు.

★ కందిపప్పు, పంచదార కొంటేనే రేషన్ బియ్యం ఇస్తామని అంటున్నారు.

★ 8లక్షల రేషన్ కార్డులను తొలగించారు.

★ నిత్యావసరాల ధరలన్నీ ఆకాశం అంటాయి.

★ పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచేశారు.

★ టిడిపి నెలకొల్పిన వేస్ట్ టు కంపోస్ట్ ప్లాంట్లన్నీ నిర్వీర్యం చేశాడు.

★ స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ కు తూట్లు పొడిచాడు.

★ రూ 157కోట్ల విలువైన పారిశుద్య ఆటోలను పాడుబెట్టి నాశనం చేశాడు.

★ ఆదరణ పనిముట్లను, విద్యార్ధినుల సైకిళ్లను పంపిణీ చేయకుండా పాడుచేశాడు.

★ మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి.

★ మన వార్డును మనం కాపాడుకోవాలి.

★ వైసిపిని ఓడించి గ్రామాలు, వార్డులను కాపాడుకోవాలి.

★ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లే పూర్తి బాధ్యత తీసుకోవాలి.

★ వీరోచితంగా పోరాడినవాళ్లంతా హీరోలు అయ్యారు.

★ పోరాడని వాళ్లు రాజకీయంగా తెరమరుగే..

★ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు (1989-94, 2004-09, 2009-14) ఎలా పోరాడామో గుర్తు తెచ్చుకోవాలి.

★ అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా పోరాడాలి.

★ వైసిపి దుర్మార్గ పాలనను తిప్పికొట్టాలి.

★ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకోవాలి.

★ ప్రతి గ్రామంలో, పట్టణంలో అన్నిస్థానాలకు నామినేషన్లు వేయాలి.

★ వైసిపి దాడులు, దౌర్జన్యాలకు బుద్ది చెప్పే అవకాశం ఇది.

★ వైసిపి బాధిత వర్గాలన్నీ ఏకం కావాలి.

★ స్థానిక ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికలో ఓడించి వైసిపికి గుణపాఠం చెప్పాలి.

★ గ్రామాల్లో, వార్డుల్లో ప్రార్థనామందిరాలను కాపాడటంలో వైసిపి విఫలం అయ్యింది.

★ అన్నిమతాల ఆలయాలను కాపాడే బాధ్యత టిడిపిది.

★ బిసి, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది.

★ ఆడబిడ్డల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది.

★ రైతుల పంటలకు కనీస మద్దతు ధర లేదు.

★ ఇన్ పుట్ సబ్సిడి, ఇన్సూరెన్స్, విపత్తు పరిహారం సకాలంలో అందించి ఆదుకోలేదు.

★ టిడిపి హయాంలో ఎన్నడైనా రాష్ట్రంలో ఇటువంటి దుస్థితి ఉందా..?

★ ప్రతిపక్షాలపై ఈ విధమైన అణిచివేత జరిగిందా..?

★ బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటిలపై ఈ దమన కాండ ఉందా..?

★ గ్రామాల్లో, పట్టణాల్లో మెరుగైన పాలన అందిస్తాం.

★ అన్నివర్గాల ప్రజల్లో భరోసా కల్పించాలి.

★ సుపరిపాలనకు టిడిపి కేరాఫ్ అడ్రస్.

★ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసి రూ 3వేల కోట్లు వృధా చేసిన వైకాపాకు బుద్ది చెప్పే అవకాశం ఇది.

★ ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి తక్షణమే ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు తొలగించేలా ఒత్తిడి తేవాలి.

★ బెదిరించి, భయభ్రాంతులను చేసి ఆక్రమించడమే జగన్ ధ్యేయం..

★ దాడులు, దౌర్జన్యాలతో భయపెట్టడమే జగన్ రెడ్డి స్వభావం.

★ 151మందిని గెలిపిస్తే మీకేమైనా కొమ్ములు మొలకెత్తుతాయా..?

★ 151మంది గెలిస్తే చట్టం వైసిపికి అనుకూలంగా మారిపోతుందా..?

★ మంద మెజారిటి ఉందని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తావా..?

★ నీకన్నా మెజారిటీ ఎక్కువ వచ్చిన పార్టీలు గతంలో ఎన్నడైనా ఇలా చేశాయా..?

★ తన అవినీతి ఆరోపణలపై ఏనాడైనా నోరు విప్పాడా జగన్ రెడ్డి..?

★ ఈడి కేసులపై ఏనాడైనా వివరణ ఇచ్చాడా..?

★ సిబిఐ కేసులపై ఏనాడైనా నోరు విప్పాడా..?

★ దేవాలయాలపై దాడుల గురించి నోరు విప్పాడా..?

★ బిసి,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దమనకాండపై నోరు విప్పాడా..?

★ టిడిపిపై దుష్ప్రచారం చేస్తే మీరు చేసిన తప్పులు ఒప్పు అవుతాయా..?

★ కోర్టులు తీర్పు ఇస్తే టిడిపికి అంటగడతాడు.

★ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెడితే టిడిపికి అంటగడ్తాడు.

★ దాడులు-దౌర్జన్యాలను టిడిపిపైకి తోస్తాడు.

★ తన అవినీతిని టిడిపికి అంటగడ్తాడు.

★ తన మోసాలను, నమ్మక ద్రోహాలను టిడిపిపైకి తోస్తాడు.

★ తన చేతగానితనానికి టిడిపిని నిందిస్తాడు.

★ వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

★ ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడంపై బుద్ది చెప్పాలి.

★ రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడంపై బుద్ది చెప్పాలి.

★ టిడిపి కార్యకర్తల ఆర్ధిక మూలాలు దెబ్బతీయడంపై బుద్ది చెప్పాలి.

★ ఆలయాలపై దాడులకు గుణపాఠం చెప్పాలి.

★ దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై గుణపాఠం చెప్పాలి.

★ గోదావరిలో 2పంటలకు నీళ్లిచ్చిన చరిత్ర టిడిపిది.

★ పట్టిసీమ, పురుషోత్తపట్నం ద్వారా కృష్ణా గోదావరి డెల్టా రైతాంగానికి ఎనలేని లబ్ది చేశాం.

★ వైసిపి వచ్చాక ఒక్కపంటకు కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేదు.

★ టిడిపి హయాంలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో 11% వృద్ది సాధిస్తే, ఇప్పుడు అందులో మూడోవంతు కూడా వచ్చే పరిస్తితి లేదు.

★ రైతులకు న్యాయం చేయడం కోసమే నాజీవితంలో తొలిసారి అసెంబ్లీ పోడియంలో బైఠాయించాను.

★ నేను బైఠాయించకపోతే ఆ రోజు అర్ధరాత్రి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేవాడు కాదు.

★ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నాడు.

★ వైసిపిని ఓడిస్తేనే మోటార్లకు మీటర్లు బిగించే దుర్మార్గానికి అడ్డుకట్ట పడుతుంది.

★ రైతులందరూ సంఘటితం కావాలి.

★ గ్రామాలన్నీ సంఘటితం కావాలి.

★ వైసిపి దురాగతాలకు బుద్ది చెప్పాలి.

★ పట్టణ ప్రజలంతా ఏకం కావాలి.

★ పన్నుల పార్టీ వైకాపాకు గుణపాఠం చెప్పాలి.

★ వార్డుల్లో వైసిపిని ఓడిస్తేనే పెంచిన పన్నులు తగ్గిస్తారు.

★ విచక్షణారహితంగా పన్నులు పెంచిన వైకాపాకు పట్టణ ప్రజలే బుద్ది చెప్పే అవకాశం ఇప్పుడీ స్థానిక ఎన్నికల రూపంలో వచ్చింది.

★ ఎన్నికలు పెట్టాలా వద్దా అనేది రాజ్యాంగ బద్ద సంస్థ ఎన్నికల సంఘం అధికారం.

★ ఈసి అధికార పరిధిని అధికారులు ప్రశ్నించరాదు.

★ అధికారంలో ఉన్న పార్టీతో లాలూచీ పడటం మాని ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్లపై దృష్టి పెట్టాలి.

★ పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి.

★ గ్రామాలు,వార్డులలో శాంతిభద్రతలను కాపాడాలి.

★ సోషల్ మీడియా వేదిక సద్వినియోగం చేసుకోవాలి.

★ ఎక్కడ ఏ దాడి జరిగినా, దౌర్జన్యానికి పాల్పడినా తక్షణమే పార్టీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తేవాలి.

★ ఎలక్షన్ కోడ్ కారణంగా ఎన్నికలు పూర్తయ్యేదాకా ముఖ్యమంత్రి ఇంటికే పరిమితం.. కాబట్టి వైసిపి నాయకులకు ఎవరూ భయపడాల్సింది లేదు.

★ భయంతో లొంగిపోవాల్సిన పనిలేదు.

★ అవసరమైతే నేనే ఫీల్డ్ కు వస్తాను.

★ ఎక్కడ ఎటువంటి దాడి జరిగినా, దౌర్జన్యం చేసినా సహించేది లేదు.

★ తన కేసులలో ఉన్న అధికారులు అందరికీ ఉన్నత పదవులు కట్టబెట్టాడు.

★ ఇప్పుడు వాళ్లంతా జగన్ రెడ్డి దుశ్చర్యలకు వంతపాడుతున్నారు.

★ నిజాయితీగా పనిచేసే అధికారులను వేధిస్తున్నారు.

★ స్థానిక ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం..?

★ ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి సంస్థ.

★ ఎన్నికల సంఘాన్ని నియంత్రించడానికి ముఖ్యమంత్రి ఎవరు..?

★ తన తాబేదారులతో స్థానిక ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించడం ఏమిటి..?

★ నీ చెప్పుచేతల్లో ఉండే అధికారులకే ఉన్నత పదవులా..?

★ నీ కేసులో నిందితులకు రాష్ట్రాలు దాటించి ఉన్నత పదవుల్లో నియమిస్తావా..?

★ నీ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ నుంచి తెచ్చుకుని ఏపిలో మున్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇస్తారా..?

★ నీ కేసులలో ఉన్న ఆదిత్యనాధ్ దాస్ ను సిఎస్ గా చేస్తావా..?

★ ఇంకో నిందితుడిని మరో జిల్లాకు కలెక్టర్ గా చేస్తావా..?

★ వాళ్లందరితో నీకు, నీ పార్టీకి అనుకూలంగా పనిచేయిస్తావా..?

★ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని న్యాయమూర్తులే చెప్పడం సిఎంకు సిగ్గుచేటు.

★ బీహార్ కన్నా అధ్వానంగా ఏపి మారిందని చెప్పడం సిగ్గుచేటు.

★ బీహార్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఏపి మారిందని ఎడిటర్లే చెప్పారు.

★ గవర్నమెంట్ టెర్రరిజం చేస్తున్నారని పారిశ్రామిక వేత్తలే అన్నారు.

జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి 16వేల గ్రామాలు, 3వేల వార్డుల్లో జరపాలి:

★ ఇదేరోజున తొలిసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు.

★ పార్టీపెట్టి 9నెలల్లోనే అధికారంలోకి వచ్చిన రోజు.

★ తెలుగువారందరూ గర్వించదగిన రోజు.

★ ఎన్టీఆర్ ఆశయాలకు అందరూ పునరంకితం కావాలి.

★ జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి అన్ని గ్రామాల్లో జరపాలి.

★ 13వేల గ్రామాలు, 3వేల వార్డుల్లో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

👉 టిడిపి డిమాండ్లు:

★ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపాలి.

★ ఆన్ లైన్ లో కూడా నామినేషన్లు తీసుకోవాలి.

★ కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలి.

★ గ్రామ వాలంటీర్లు ఎవరినీ ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించరాదు.

★ గతంలో ఎలక్షన్ కమిషన్ సిఫారసు చేసిన అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి.

★ ప్రభుత్వ భవనాలపై వైకాపా రంగులను తక్షణమే తొలగించాలి.

★ గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలి.

★ అన్ని స్థానాలకు మళ్లీ తాజా నోటిఫికేషన్ జారీ చేయాలి.

★ టిడిపి ఎంత చేసింది, వైసిపి ఏం చేసింది ప్రజలే చూస్తున్నారు.

★ ఈ ఎన్నికల్లో గెలిచిన టిడిపి ప్రతి సర్పంచి, ప్రతి వార్డు సభ్యుడు తమ గ్రామాల్లో, వార్డులలో ఆలయాలకు భద్రత కల్పిస్తారు.

★ తాగునీరు, వీధి దీపాలు, ఇతర పౌర సదుపాయాలు కల్పిస్తారు.

👉 టిడిపి నాయకుల ప్రసంగాలు:

👉 అచ్చెన్నాయుడు:

★ స్థానిక సంస్థల ఎన్నికలను టిడిపి స్వాగతిస్తోంది.

★ గతంలో బలవంతపు ఏకగ్రీవాలను కూడా రద్దు చేయాలి.

★ మళ్లీ నోటిఫికేషన్ తాజాగా విడుదల చేయాలి.

★ నామినేషన్లు స్వేచ్ఛగా వేసేలా భద్రత కల్పించాలి.

★ వేలాదిమందిని పోగేసి వైకాపా సంబరాలు జరిపేటప్పుడు కరోనా గుర్తురాలేదు.

★ ఇళ్ల స్థలాల పట్టాల పండుగలు చేసినప్పుడు గుర్తు రాలేదు.

★ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజుల పండుగలు చేసినప్పుడు కరోనా అడ్డం కాలేదు.

★ స్థానిక ఎన్నికలకే కరోనా అడ్డం వస్తోందా..?

★ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయనే ధీమాను, విశ్వాసాన్ని కలిగించాలి.

👉 రామానాయుడు (టిడిఎల్ పి ఉపనేత):

★ వైసిపి వచ్చాక ఏ పండుగ కూడా జరుపుకునే స్థితి లేదు.

★ రేపు సంక్రాంతి పండుగ కూడా జరుపుకోలేని దుస్థితిలో ఉన్నారు.

★ ధాన్యం బకాయిలు రూ 2700కోట్లు పెండింగ్ పెట్టారు.

★ తూర్పుగోదావరిలో రూ 800కోట్లు, కృష్ణా జిల్లాలో రూ 400కోట్ల చెల్లించాలి.

★ ధాన్యం బకాయిలు ఇన్ని నెలలు పెండింగ్ పెట్టడం ఏనాడూ లేదు.

★ తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి.

★ దాళ్వా పంట వచ్చింది, పెట్టుబడులకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.

★ ఇటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదు.

👉 అంగర రామ్మోహన్ రావు:

★ పాలకొల్లులో ఉన్నవాళ్లకు 20కిమీ దూరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు.

★ ఇళ్లస్థలాల్లో వేలకోట్ల భూకుంభకోణాలు చేశారు.

★ సెంటు భూమి ముసుగులో రూ 6,500కోట్లు స్వాహా చేశారు.

★ పేదల స్కీముల్లోనూ స్కామ్ లకు పాల్పడ్డారు.

★ ప్రజలే వైసిపికి తగిన బుద్ది చెబుతారు.

👉 సోమిశెట్టి ఆంజనేయులు (కర్నూలు):

★ కరోనాలో విఫలం అయ్యాడు.

★ శాంతి భద్రతలు కాపాడటంలో విఫలం అయ్యాడు.

★ జగన్ రెడ్డి దుర్మార్గాలకు బుద్దిచెప్పే అవకాశం ఈ ఎన్నికల రూపంలో వచ్చింది.

★ పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడాలి, వైసిపి ఓటమి కోసం కృషి చేయాలి.

👉 డిబివి స్వామి (ఎమ్మెల్యే):

★ బిసి,ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటిలపై దాడులు చేస్తున్నారు.

★ తప్పుడు కేసులు పెట్టి టిడిపి కార్యకర్తలను వేధిస్తున్నారు.

★ భయపెట్టి ఊళ్లను వదిలివెళ్లేలా చేస్తున్నారు.

★ బాధిత ప్రజానీకమే వైసిపికి బుద్ది చెబుతుంది.

★ ఈ సమావేశంలో వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, గన్ని వీరాంజనేయులు, మల్లెల లింగారెడ్డి, ఎర్రా వేణుగోపాల రావు, దాసరి శ్యామచంద్రశేషు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles