Monday, March 8, 2021

టీడీపీ ఎమ్మెల్సీ శ్రీ బీ.టీ.నాయుడు గారి విలేకరుల సమావేశం

అమరావతి

టీడీపీ ఎమ్మెల్సీ, శ్రీ బీ.టీ.నాయుడు విలేకరుల సమావేశం వివరాలు..

ఇళ్లపట్టాల పంపిణీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన రూ.6,500కోట్ల అవినీతిని నిరూపించడానికి టీడీపీ సిద్ధం.

– ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం రూ.6,500కోట్లకు అవినీతి పాల్పడింది.

– అందుకు సంబంధించిన ఆధారాలతో చర్చకు రావడానికి టీడీపీ సిద్ధంగా ఉంది.

– వైసీపీ నుంచిగానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎవరొస్తారో చెబితే, పాలకులు అవినీతి బాగోతాన్ని బయటపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నాము.

– ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో ముఖ్యమంత్రి సహా, దాదాపు 40మంది వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులకు కనకాభిషేకం జరిగిందని నిరూపిస్తాం.

– వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, కావలి ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు వంటి ఎందరో అవినీతి పరుల చిట్టా టీడీపీ దగ్గరుంది.

– దాదాపు 100నియోజకవర్గాల్లో ఇళ్లపట్టాలకోసమని చెప్పి ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల స్వాధీనంలోని అసైన్డ్ భూమని బలవంతంగా లాక్కొంది.

– ఆ భూమిని తక్షణమే వెనక్కుఇచ్చేసి, భూములు లాక్కొన్నవారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని పాలకులను డిమాండ్ చేస్తున్నాము.

– ప్రభుత్వం ఎక్కడో దూరంగా కొండలు, గుట్టలు, శ్మశానాల పక్కన పేదలకు ఇచ్చిన స్థలాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లు నిర్మించుకొని నివాసముండగలరా?

– జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు,ఎమ్మెల్యేలు విలాసవంతమైన రాజభవనాల్లో ఉంటూ, పేదలకు చాలీ చాలకుండా చారెడు జాగా ఇవ్వడం ఎంతవరకు న్యాయం?

– ప్రభుత్వానికి ఏమాత్రం దమ్ము, ధైర్యమున్నా ఇళ్లపట్టాల ముసుగులో జరిగిన అవినీతి వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలి.

★ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం కేవలం ఇళ్లపట్టాల పంపిణీలోనే రూ.6,500కోట్లవరకు అవినీతికిపాల్పడ్డారని, ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో అధికారపార్టీకి చెందిన దాదాపు 40మంది ఎమ్మెల్యేలతో సహా, ముఖ్యమంత్రికి కనకాభిషేకం జరిగిందని టీడీపీఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు స్పష్టంచేశారు.

★ బుధవారం ఆయన మంగళగి రిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

★ ఇళ్లపట్టాల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, సమయం, తేదీ చెప్పి, ఎక్కడికి రావాలో చెబితే అక్కడికొచ్చే జగన్మోహన్ రెడ్డి అండ్ కో దోపిడీనీ బయటపెడతామని, వైసీపీవారుగానీ, ప్రభుత్వంలోని వారుగానీ చర్చకు రావడానికి సిద్ధమా అని టీడీపీనేత నాయుడు సవాల్ విసిరారు.

★ ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో ముఖ్యమంత్రి చేసిన ప్రచారం అంతా ఇంతా కాదన్నారు.

★ ఇళ్లపట్టాల పంపిణీ వ్యవహారంలోజరిగిన అవినీతి విషయానికొస్తే, తెనాలి నియోజకవర్గంలో రూ.5లక్షలకు రైతులనుంచి భూమిని కొని, దాన్ని ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వానికి రూ.70లక్షలకు అమ్మడం జరిగిందన్నారు.

★ ఈ వ్యవహారం మీడియాకు తెలిసి, బయటకు పొక్కడంతో కోర్టు జోక్యంతో ఇళ్లపట్టాల పంపిణీ నిలిచిపో యిందన్నారు.

★ అలానే కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, గత ఏడాది జూలై 1న తన పనివాళ్లు, అనుచరుల పేరుతో 13ఎకరాలు కొని, ఆ భూమిని ఇళ్లపట్టాలకు వినియోగించాలని 3వతేదీన నెల్లూరు జిల్లా కలెక్టర్ కు సిఫార్సు చేయడం జరిగిందన్నారు.

★ అందుకు కలెక్టర్ ఒప్పుకోకపోవడంతో జిల్లా మంత్రి అనిల్ కుమార్ తో చెప్పి, సదరు ఐఏఎస్ అధికారిని బదిలీ చేయించారని నాయుడు తెలిపారు.

★ తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భూముల కొనుగోలులో రూ.57.75కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ వ్యవహారంపై స్థానిక వైసీపీనేత సీతారామ్ ముఖ్యమంత్రికే లేఖ రాయడం జరిగిందన్నారు.

★ పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజు 8.78 ఎకరాల విస్తీర్ణమున్న వీర్రాజు చెరువుని ఆక్రమించి, ఇళ్లపట్టాల పంపిణీకి వినియోగించాలని చూశారన్నారు.

★ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి 503ఎకరాలకు సంబంధించి, రూ.133కోట్ల వరకు స్వాహా చేశారన్నారు.

★ రూ.25నుంచి రూ.30లక్షల విలువచేసే భూమిని రూ.70లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టడం ద్వారా పార్థసారథి రూ.133కోట్లు మింగేశాడని టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తంచేశారు.

★ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, అనేక మంది ఉన్నారని, వారందరి బాగోతాన్ని టీడీపీ ఆధారాలతో సహా బయటపెట్టినా అందరూ తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయారన్నారు.

★ ప్రజల కోసమే మాశ్వాస, ధ్యాస అనిచెప్పుకునే వైసీపీనేతలు, ముఖ్యమంత్రి విలాసవంతమైన రాజభవనాల్లో జీవిస్తూ, పేదలకు మాత్రం చారెడుజాగా ఇస్తూ, దానిలోకూడా అందినకాడికి దోచేశారన్నారు.

★ పేదలకు ఊళ్లకు దూరంగా ఇచ్చిన ఇంటిస్థలాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనాసరే నివాసాలు కట్టుకొని అక్కడ ఉండటానికి సిద్ధంగా ఉన్నారా అని బీ.టీ.నాయుడు ప్రశ్నించారు.

★ 175 నియోజకవర్గాల్లో దాదాపు 100 నియోజకవర్గాల్లో దళితుల భూమినే ఆక్రమించి, ఈ ప్రభుత్వం ఇళ్లపట్టాల పేరుతో పేదలకు పంచిందన్నారు.

★ దళితుల కోసమే తానుజీవిస్తున్నానని చెప్పుకునే ముఖ్యమంత్రి, ఒకవైపువారిపై దాడులుచేయిస్తూ, మరోవైపు వారిభూములను కూడా లాగేసుకుంటున్నాడన్నారు.

★ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్షా50వేలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా రూ.30వేలిస్తూ, మొత్తంసొమ్ముని ఏపీ ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా వైసీపీనేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారని టీడీపీనేత ఎద్దేవాచేశారు.

★ నిర్మాణానికి అవసరసమైన సిమెంట్, ఇసుకలో కూడా కమీషన్లు దండుకునే పనికిఇప్పటికే వైసీపీనేతలు శ్రీకారం చుట్టారన్నారు.

★ తెలుగుదేశం ప్రభుత్వంలో 20లక్షల96వేల331ఇళ్లను పేదలకు మంజూరుచేసి, వాటిలో దాదాపు 10లక్షలఇళ్లను అధునాతన సౌకర్యాలతో నిర్మించి పేదలకు పంచడం జరిగిందన్నారు.

★ తన ప్రభుత్వంలో ఏడాదికి 5లక్షలఇళ్లను నిర్మిస్తానని హామీఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండేళ్లు అవుతున్నా కూడా ఎక్కడా ఒక్కఇటుక కూడా వేసిన దాఖలాలు లేవన్నారు.

★ చివరకు జనంలో పరువు పోతుందని తెలుసుకొని టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కోఇళ్లకు రంగులేసి, తమ ప్రభుత్వం నిర్మించినట్లుగా చెప్పుకుంటున్నారని నాయుడు ఎద్దేవాచేశారు.

★ టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను ఈ ప్రభుత్వం తక్షణమే పేదలకు కేటాయించకపోతే, జనవరినాటికి వాటిని ఆక్రమించి, గృహప్రవేశాలు జరిగేలాచేస్తామని టీడీపీ అధినేత హెచ్చరించడంతో వైసీపీ ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు.

★ ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్లనిర్మాణం విషయంలో ఆచరణకువిరుద్ధంగా, మాయ మాటలతో కాలయాపన చేస్తూ, ప్రజలను దారుణంగా మోసగిస్తున్నారన్నారు.

★ పేదలను ముంచడానికే జగన్ ప్రభుత్వం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని నాయుడు స్పష్టంచేశారు.

★ ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో జరిగిన రూ.6,500కోట్ల అవినీతిపై జగన్ ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.

★ పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విషయంలో ప్రభుత్వం పునరాలోచనచేసి, గ్రామాల్లో 3సెంట్లు, పట్టణాల్లో రెండుసెంట్లు అర్హులైన పేదలకు పంచాలని, ఆ విధంగా ఇచ్చే స్థలాలుకూడా జనావాసాలకు దగ్గరగానే ఇవ్వాలని నాయుడు డిమాండ్ చేశారు.

★ ఇళ్లస్థలాలకోసం ఎస్సీ,ఎస్టీలు, బీసీలు, మైనారిటీల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి వారికే అప్పగించాలన్నారు.

★ ఇళ్లపట్టాల ముసుగులో పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వం తప్పుఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీనేత తేల్చిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles