Tuesday, March 2, 2021

టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి

టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి – చిత్రపటానికి నివాళులర్పించిన శ్రేణులు

★ డా.బి.ఆర్.అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

★ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

★ అంబేద్కర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తోంది.

★ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ప్రథమ కర్తవ్యం.

★ దశాబ్దాల తరబడి ఆర్ధిక, సామాజిక, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అణచివేయబడిన వర్గాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన మేలు అనిర్వచనీయం.

★ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారు.

★ ప్రభుత్వ వేధింపులు, దాడులకు గురవుతున్న దళిత, మైనార్టీ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.

★ దళిత ఓట్లతో గద్దెనెక్కి దళితులపై దమనకాండకు దిగుతున్న జగన్ సర్కార్కు అంబేద్కర్కుీ నివాళులర్పించే అర్హతే లేదు.

★ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్యాల రావు, గంజి చిరంజీవి, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్రల బ్రహ్మం, వల్లూరు కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles