Sunday, April 11, 2021

టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు పత్రికా ప్రకటన

అమరావతి

టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ కిమిడి కళా వెంకట్రావు పత్రికా ప్రకటన వివరాలు..

సురక్షిత నీటిని ఉచితంగా, హక్కుగా అందిస్తాం

★ పట్టణ ప్రజలకు సురక్షిత మంచినీటిని ఓ హక్కుగా, ఉచితంగా అందిస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

★ మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

★ ఉచిత రక్షిత మంచినీటి కనెక్షన్‌, సున్నా నీటి పన్నుతో అందరికీ ప్రాథమిక హక్కుగా సురక్షిత తాగునీరు అందిస్తామనేది టీడీపీ ఎన్నికల హామీ.

★ సురక్షిత నీటిని ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి వైయస్‌. జగన్మోహన్‌ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని వెంకట్రావు అన్నారు.

★ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో కలుషిత నీటి వల్ల అంతుచిక్కని వ్యాధితో ప్రజలు నేటికీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది 2020 డిసెంబరులో బయటపడింది.

★ సుమారు 700 మంది ఆస్పత్రి పాలయ్యారు.

★ దాదాపుగా 2.38 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

★ అదే విధంగా కలుషిత నీరు తాగి కర్నూలులో ఒకరు ప్రాణాలు కోల్పోగా 50 మంది అనారోగ్యం పాలయ్యారు.

★ అపరిశుభ్ర వాతావరణం, పగిలిని నీటి పైపుల కారణంగా ఇక్కడ మంచి నీరు కలుషితమైందన్నారు.

★ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, మరియు కనిగిరి వంటి మున్సిపాలిటీలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయి.

★ నీటి సరఫరా బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణం.

★ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 12 కార్పొరేషన్ల అభివద్ధి, మంచినీటి సరఫరా, మురుగునీటి కాల్వల మరమ్మతులకు జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.యమ్‌. పథకాల ద్వారా రూ.1,449 కోట్లు ఖర్చు పెట్టారు.

★ అదే విధంగా 14వ ఆర్థిక సంఘం ద్వారా మరో రూ.1,986 కోట్లు ఖర్చు చేశారు.

★ ఆంధ్రప్రదేశ్‌ నగరాభివద్ధి సంస్థ ద్వారా విజయనగరం, బద్వేలు, మార్కాపురం, కాకినాడ, అనంతపురం, గుంటూరు, ఇతర నగరాల్లో రూ.850 కోట్లతో మంచినీటి పథకాలను అభివద్ధి చేశారు.

★ విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ మురుగునీరు నిర్వహణకు, వరద నీటి నిర్వహణకు రూ.1,365 కోట్లు వ్యయం చేశారు.

★ నెల్లూరులో మురుగునీటి నిర్వహణకు హడ్కొ ద్వారా రూ.1,138 కోట్లు కేటాయించారు.

★ ఇవన్నీ చంద్రబాబు నాయకత్వంలో ప్రజారోగ్యం కోసం టీడీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles