Sunday, April 11, 2021

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ సయ్యద్ రఫీ విలేకరుల సమావేశం

అమరావతి

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ సయ్యద్ రఫీ విలేకరుల సమావేశం వివరాలు..

ప్రజలకు తనపథకాలు నచ్చాయని భావిస్తున్న జగన్, స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం అడ్డదారులు ఎందుకు తొక్కాడు?

– మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రభుత్వ అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలే కారణం.

– టీడీపీనేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులతో ప్రజలు ఓటింగ్ పై నిరాసక్తత చూపారు.

– తనప్రభుత్వ పథకాలు ప్రజలకు నచ్చాయనే భావనలో ఉన్న జగన్, ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడమేంటి?

– పండుగనాడు టీడీపీవారికి సంతోషం లేకుండా చేయాలనే కొల్లురవీంద్రను అరెస్ట్ చేశారు.

– రవీంద్ర అరెస్ట్ జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వంలో భాగంగానే జరిగింది.

– స్థానిక ఎన్నికల్లో గెలిచిన అనేకప్రభుత్వాలు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన ఘటనలు కోకొల్లలు.

– ఈప్రభుత్వాన్ని చూసుకొని తప్పులుచేస్తూ రెచ్చిపోతున్న అధికారులకు టీడీపీప్రభుత్వం వచ్చాక శిక్షతప్పదు.

★ స్థానికఎన్నికల నిర్వహణ తీరుచూస్తే, ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిందని, 2013నాటి ఎన్నికలతో పోల్చితే దాదాపు 11శాతంవరకు ఓటింగ్ తగ్గిందని, అందుకు కారణం ప్రభు త్వంపై ప్రజల్లోఉన్న అసంతృప్తి, అభద్రతా భావమేనని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ స్పష్టంచేశారు.

★ గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

★ ప్రభుత్వ పనితీరుతో విసిగిపోయిన ప్రజలంతా ఓటింగ్ కురాకుండా నిరాసక్తత చూపారన్నారు.

★ టీడీపీ వారిపై, ప్రజలపై ప్రభుత్వం దాడిచేస్తోందని, బయటి పరిస్థితి సరిగాలేనప్పడు ఓటింగ్ కు వెళ్లడంఎందుకులే అనేభావన ప్రజల్లో ఉండబట్టే, వారు బయటకురాలేదన్నారు.

★ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ స్లిప్పులపంపిణీ బాధ్యత తీసుకున్న ప్రభుత్వం, టీడీపీకి ఓటేస్తారుకున్నవారికి స్లిప్పులుపంచలేదన్నారు.

★ స్లిప్పులు లేకుండా ఓట్లువేయడానికి వెళ్లినవారిని పోలీసులు వెనక్కుపంపారని, దాంతో చాలామంది ఇళ్లకే పరిమిత మయ్యారన్నారు.

★ అదేవిధంగా కుటుంబంలో నలుగురుంటే, ఒక్కొక్కరికీ ఒక్కోచోట ఓటుకేటాయించారన్నారు.

★ దానితో పాటుసెల్ ఫోన్లను నిషేధిచండం కూడా ఓటింగ్ తగ్గడానికి ప్రధానకారణమని రఫీ వెల్లడించారు.

★ ఓటర్ స్లిప్పుల్లో తప్పులు రాసిచ్చారని, దాంతో చాలాచోట్ల గుర్తింపుకార్డు ఉంటేనే ఓటింగ్ కు అనుమతించారన్నారు.

★ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బలవంతంగా చేపట్టడంతో పాటు, దాడులు, దౌర్జన్యాలు, పోలీసులతో అక్రమకేసులు పెట్టించడం వంటి ఘటనలుకూడా ఓటింగ్ పైప్రభావం చూపాయన్నారు.

★ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోఎన్నికల బరిలో నిలిచిన దళిత అభ్యర్థి పసుపురంగు చొక్కావేసుకున్నాడని, స్థానిక ఎస్సై దాన్నిబహిరంగంగానే విప్పించాడన్నారు.

★ సదరు ఘటనకు కారకుడైన ఎస్ఐ చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత ఎన్నికల సంఘాన్ని కోరినా ఇంతవరకుచర్యలు లేవన్నారు.

★ మచిలీపట్నంలో దినకర్ అనే టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడికి తెగబడ్డారన్నారు.

★ దాడికి పాల్పడినవారిని వదిలేసి, మాజీమంత్రి కొల్లురవీంద్రను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.

★ శివరాత్రి పర్వదినాన టీడీపీవారికి పండగ సంతోషాన్ని దూరం చేయాలనే ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే, జగన్ ప్రభుత్వం రవీంద్ర ను అరెస్ట్ చేయించిందని రఫీ మండిపడ్డారు.

★ శివరాత్రి పండుగనాడు టీడీపీనేతలను అరెస్ట్ చేయడం, మహిళాదినోత్సవం రోజున మహిళలను జుట్టుపట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లడం, బూటుకాళ్లతో తన్నడం వంటిఘటనలు ఈ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి కలిగించాయన్నారు.

★ ఈ విధమై న అరాచకాలుకూడా ఓటింగ్ తగ్గడానికి కారణాలుగా నిలిచాయని రఫీ తెలిపారు.

★ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్లనానికే ఓటు లేకుండా చేశారని, ఓటర్ల లిస్ట్ తయారీలో అధికారులు ఎంత సమర్థంగా పనిచేశారో ఇటువంటి ఘటనలే నిదర్శనమన్నారు.

★ ప్రజలకు ఓటింగ్ పై నిరాసక్తత కలిగేలా ఆటవిక పాలన సాగించిన ప్రభుత్వచర్యలను టీడీపీ తరుపున తీవ్రంగా ఖండి స్తున్నామన్నారు.

★ ఆదోనిలో టీడీపీనేత రంగన్నకు చెందిన రూ.40లక్షలవిలువైన కొబ్బరితోటను కాల్చివేశారని, ఆ ఘటనలో వైసీపీనేత ప్రమేయముందన్నారు.

★ ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తేనే తాము గెలవగలమనే అభిప్రాయానికి వైసీపీనేతలు వచ్చారని, అం దుకోసమే రాష్ట్రవ్యాప్తంగా దారుణాలకు తెగబడ్డారన్నారు.

★ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవాలు చేయాల్సిందేనని ముఖ్య మంత్రి స్థాయివ్యక్తే చెబితే, ఎన్నికలలో ఇటువంటి అరాచకా జరగక, ప్రశాంతవాతావరణం ఎక్కడినుంచి వస్తుందని రఫీ వాపోయారు.

★ ప్రజలకు మెరుగైన, ఉత్తమమైన పాలన అందిస్తున్నానని చెప్పుకుంటున్న జగన్, ఎన్నికలు స్వేఛ్చగా, శాంతియుతంగా ఎందుకు నిర్వహించలేకపోయాడన్నారు.

★ రాష్ట్రవ్యాప్తంగా 39ప్రాంతాల్లో 5, 6 రకాల చట్టవ్యతిరక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడిందన్నారు
ఆయా ఘటనలకు సంబంధించి వందలకొద్దీ ఫిర్యాదులు తమదృష్టికి వచ్చాయని, వాటన్నింటినీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామని రఫీ చెప్పారు.

★ పోలింగ్ ఏజెంట్లపై, టీడీపీవారిపై దాడులు చేయడం, డబ్బు ప్రలోభాలకు పాల్పడటం, అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడటంవంటి అనేకఘటనలకు వైసీపీనేతలు, కార్యకర్తలు పాల్పడ్డారన్నారు.

★ తాను అమలుచేస్తున్న పథకాలు ప్రజల కు నచ్చి, వారిఆమోదం నిజంగా జగన్ కు ఉంటే, ఆయన ఈ విధంగా అరాచకవాతావరణంలో ఎన్నికలుజరపాల్సిన అవస రమేంటని రఫీ ప్రశ్నించారు.

★ ఎన్నికలు సజావుగా, సాఫీగా జరిగితే తమకుఓట్లుపడవని అర్థమవబట్టే, ముఖ్యమంత్రి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏకగ్రీవాలను లక్ష్యంగా నిర్ధేశించాడన్నారు.

★ ప్రభుత్వదాష్టీకాలకు, దౌర్జన్యాలకు బలై,ఎందరు ఆసుపత్రుల్లోచేరారో ముఖ్యమంత్రికి తెలియదా అన్నారు.

★ స్థానిక ఎన్నికల్లో అధికారులు, పోలీసుల సాయంతో, బెదరిం పులతో, దాడులతో గెలుపును దక్కించుకున్న ముఖ్యమంత్రి ఆటలు, సాధారణఎన్నికల్లో ఇదేవిధంగా ప్రవర్తించాలని చూస్తే, అప్పుడు సాగవన్నారు.

★ వాలంటీర్ వ్యవస్థసహా, స్థానిక పోలీసులను, అధికారులను పక్కనపెట్టి, మరీ కేంద్రం సాధారణ ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన అసలుఎన్నికల్లో ఓడిపోములే అనుకుంటే, ఈ ముఖ్యమంత్రికి ఆనాటికి దారుణ పరాభవమే మిగులుతుందని రఫీ తేల్చిచెప్పారు.

★ స్థానిక ఎన్నికల్లో గెలిచిన అనేకప్రభుత్వాలు, సాధారణ ఎన్నికల్లోఓటమిపాలైన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు.

★ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పుడున్న ప్రభుత్వానికి సహకరించిన అధికారులంతా బాధితులుగా మిగలకతప్పదని రఫీ తీవ్రస్వరంతో హెచ్చరించారు.

★ తప్పుచేసిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles