అమరావతి
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ మద్దిపట్ల సూర్యప్రకాశ్ పత్రికా ప్రకటన వివరాలు..
పేదల ఇంట జగన్ రెడ్డి సంక్రాంతి లేకుండా చేశారు.
– సంక్రాంతి కానుక రద్దు చేసి ఏం సాధించారు?
– రైతులకు దుఖం తప్ప ఈ ఏడాది సంతోషం లేదు.
★ చంద్రబాబు నాయుడు గారు పేదల కళ్లలో సంక్రాంతి చూడాలనే తపనతో సంచినిండా సరుకులు ఇస్తే ఆ ఆనందాన్ని జగన్ రెడ్డి వచ్చి దూరం చేశారు.
★ పేదల పండగపూట కూడా తృప్తిగా ఉండటాన్ని జగన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నారు.
★ పేదల నోట్లో మట్టి కొడితే ఏం సంతోషం వస్తుందో అర్థం కావడం లేదు.
★ సన్న బియ్యం ఇవ్వలేని నన్నాసి మంత్రి పేకాటలు ఆడిస్తూ తీరిక లేకుండా ఉన్నారు.
★ సన్న బియ్య ఎలాగో ఇవ్వలేదు.
★ కనీసం ఏడాదికి ఒక సారి ఇచ్చే సంక్రాంతి కానుకనైనా పేదలకు ఎందుకు ఇవ్వలేదు.
★ రైతులకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. సబ్సీడీలు లేకుండా చేశారు.
★ నష్ట పరిహారం నేటికీ అందలేదు.
★ కానీ రైతులు మాత్రం సంతోషంగా ఉన్నారని నాగిని డ్యాన్స్ మంత్రి కన్నబాబు డబ్బాలు కొడుతున్నారు.
★ మార్కెట్లలో టమోటాలు కొనుగోలు కాక రోడ్డుపైనే పడేసే దుస్తితి రైతులకు దాపురించింది.
★ 30 ఏళ్లలో ఎన్నడూ లేని నష్టం వస్తే సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారో సమాధానం చెప్పాలి.
★ దోచుకున్న ధనంతో వైసీపీ నాయకుల ఇళ్లలో సంక్రాంతి జరుగుతుంది తప్ప పేదల ఇళ్లలో లేదు.
★ గ్రామాల్లో పండగ వాతావరణాన్ని దరికి చేరకుండా చేసిన వైసీపీ నాయకలకు పేదల పాపం ఊరికేపోదు.
★ మీరు అవినీతి చేశారని చంద్రబాబు పెట్టిన ప్రతి పథకంలో అవినీతి ఉందంటూ రద్దు చేయడం హేయం.
★ అన్న క్యాంటీన్లు మూసేసి నోటి దగ్గర ముద్ద తీసిన మీకు ఏం తెలుస్తుంది ఆకలి మంట?
