Wednesday, March 3, 2021

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు తెదేపా శాసనసభ పక్ష ఉపనేత శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన

అమరావతి/శ్రీకాకుళం జిల్లా

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..

గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి వ్యాఖ్యలు హేయం

– వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే మంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటాం

– చదువుకున్న మూర్ఖుల్లా వైసీపీ నేతల వ్యవహారం

★ నీతి, నిజాయితీలకు మారుపేరుగా, బడుగ బలహీన వర్గాల సమాజోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానంటూ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.

★ దేశ స్వాతంత్ర్యోధ్యమంలో తనదైన ముద్ర వేసి ‘సర్దార్’ బిరుదు పొందిన ఓ మహనీయుని విషయంలో మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తూ చదువుకున్న మూర్ఖుల్లా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.

★ సీదిరి అప్పలరాజు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

★ లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అప్పలరాజు కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచరిస్తున్నాం.

★ స్వత్రంత్ర సమర యోధులను గౌరవించలేని వ్యక్తి మంత్రిగా ఉండేందుకు కనీస అర్హత కూడా లేదు.

★ ఇలాంటి వ్యక్తి మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజానీకానికి సిగ్గుచేటు.

★ వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి భజన చేయాలనుకుంటే చేసుకోండి.

★ అంతే గానీ.. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గౌతు లచ్చన్న గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదు.

★ దేశ స్వాతంత్ర్యం కోసం గౌతు లచ్చన్న చేసిన పోరాటం, ప్రజల అభ్యున్నతి కోసం పడిన తాపత్రయాన్ని గుర్తించలేని మూర్ఖుడు డాక్టర్ చదివానని చెప్పుకోవడానికి, మంత్రి నని ప్రకటించుకోవడానికి సిగ్గుపడాలి.

★ వంద మంది జగన్ రెడ్డిలు వచ్చినా గౌతు లచ్చన్న విగ్రహం కాదు కదా.. ఆ మహనీయుని విగ్రహానికి ఉన్న పెంయింట్ పెచ్చు కూడా కదపలేరని గుర్తుంచుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles