Monday, March 8, 2021

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన

అమరావతి (గుంటూరు జిల్లా)

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..

పండుగ నాడు దేవాలయంలో చోరీ జరగడం దురదృష్టకరం

– ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

★ పండుగనాడే గుంటూరు జిల్లాలోని భ్రమరాంబ ఆలయంలో చోరీ జరగడం దురదృష్టకరం. దీన్ని తీవ్రగా ఖండిస్తున్నాం.

★ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది.

★ దేవాలయాలపై దాడులు రాజకీయ క్రీడతో జరుగుతున్నాయని జగన్ రెడ్డి.. ఎటువంటి కుట్రకోణం లేదని డీజీపీ చెప్పే విధానాన్ని చూస్తే ప్రజలకు అనుమానం కలుగుతోంది.

★ దాడులు చేసిన నేరస్తులను పట్టుకోకుండా పంచెకట్టుతో దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినంత మాత్రానా జగన్ హిందూ మత పరిరక్షకులు కాలేరు.

★ దేవుళ్ళకే రక్షణ లేని పాలనలో ప్రజలకు రక్షణ వుంటుందా?

★ నిరంతరం జరుగుతున్న వరస సంఘటనలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను శిక్షించాలి.

★ ప్రతిపక్షం పై నెట్టి చేతులు దులుపుకొనే ప్రయత్నం చెయ్యడం భాధ్యతా రాహిత్యం.

★ దేవాలయాలపై దాడులు చేసిన 347 మందిని అరెస్టు చేశామని డీజీపీ అంటున్నారు.. దోషులను ప్రజల ముందు ఎందుకు నిలబెట్టలేదు.?

★ రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షానికి కడుపు మంటగా ఉందని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

★ విగ్రహాల విధ్వంసమేనా మీరు చెప్పే అభివృద్ధి.?

★ దాడులపై చంద్రబాబు పోరాడే వరకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.?

★ సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు మీ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయన్నది వాస్తవం కాదా?

★ వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడి ఇష్టానురీతిగా వ్యవహరిస్తోంది.

★ బడుల మీద కూడా దాడులు జరగబోతున్నాయని నెల్లూరు సభలోనే జగన్ రెడ్డి సంకేతం ఇచ్చారు.

★ ఎస్సీ, ఎస్టీ, దళితులు, బీసీలు, దేవతల మీద దాడులు అయిపోయి.. రానున్న కాలంలో బడులపై దాడులు ఏ విధంగా చేయాలో ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఉన్నారు.

★ ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తామంటే ప్రజలు కాల గర్భంలో కలుపుతారు.

★ ముఖ్యమంత్రి, డీజీపీలు ఉన్న ప్రాంతాల్లోనే దేవాలయాలకు రక్షణ లేదంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles