Wednesday, March 3, 2021

టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్

టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్

ఉగ్రవాదిని కాదు ప్రజా నాయకుడిని నన్ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి ,(కడప) పోలీసులపై ఆగ్రహం…

టీడీపీ నేతలపై దాడి చేసి వాహనాలనూ ధ్వంసం చేయటాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ నేతలు ఛలో తంబళ్ళపల్లి కార్యక్రమం చేపట్టారు.

శనివారం ఉదయం తంబళ్ళపల్లి బయలుదేరతారనే ఉద్దేశ్యంతో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈసందర్భంగా ఎస్.గోవర్ధన్ రెడ్డి
మాట్లాడుతూ తంబళ్ళ పల్లి నియోజకవర్గం అంగళ్ళులో టీడీపీ నేతలపై జరిగిన సంఘటన రాష్ట్రంలో వైసీపీ రౌడీ పాలన చేస్తోందనటానికి నిదర్శనం అన్నారు.

తనను తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు

తాము ఉగ్రవాదులమా,అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నామా అని పోలీసులను ప్రశ్నించారు

టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పార్టీ కార్యకర్తల పరామర్శకు వెళుతున్న టీడీపీ నేతలపై వైసీపీ గూండాలు దాడి చేయటం సిగ్గు చేటన్నారు.
దాడి చేసిన వారిని వదిలేసి గాయపడిన వారిని అరెస్టు చేయటం
ఏ చట్టంలో ఉందో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles