Sunday, April 11, 2021

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ మద్దిపాటి వెంకటరాజు పత్రికా ప్రకటన

అమరావతి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ మద్దిపాటి వెంకటరాజు పత్రికా ప్రకటన వివరాలు..

ప్రజాతీర్పుకు సమాధికట్టి… బలవంతపు ఏకగ్రీవాలా?

– ఫోర్జరీ సంతకాలు, దౌర్జన్యాలతో చేసుకున్న ఏకగ్రీవాలకు ప్రజా మద్దతు వుంటుందా?

★ ప్రజాతీర్పుకు సమాధికట్టి… బలవంతపు ఏకగ్రీవాలా? ప్రజల మద్దతు లేకుండా 570 మున్సిపల్ వార్డులు ఏకగ్రీవమయ్యాయని వైసీపీ చెప్పడం సిగ్గుచేటు.

★ ప్రజలు ఓటు వేసే అవకాశం ఇవ్వకుండా ఆటవిక పాలన, దౌర్జన్యాలు, బెదిరింపులు ఫోర్జరీ సంతకాలతో చేసుకున్న ఏకగ్రీవాలకు ప్రజా మద్దతు ఎలా వుంటుంది.?

★ దోపిడి రాజ్యానికి దొరబాబుగా జగన్ రెడ్డి వ్యహరిస్తున్నారు.

★ ప్రజాస్వామ్య హితంగా ప్రజల్ని ఎన్నికల్లో భాగస్వామ్యం కానివ్వకుండా బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసుకోవడం దుర్మార్గమనిపించడం లేదా?

★ ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు చేసుకుని మరోసారి దొంగల పార్టీ అని నిరూపించుకున్నారు.

★ అన్ని స్థానాలు..ఇన్ని స్థానాలు ఏకగ్రీవమని ఏ మొహం పెట్టుకుని ప్రకటనలు చేసుకుంటారు? మీకు ప్రజా మద్దతు లేదు.

★ ఆటవిక పాలనకు రాజమార్గం వేస్తున్నారు.

★ ప్రజలంతా ఓటింగులో పాల్గొని నిజాయితీగా మీరు పోటీ చేస్తే ఒక్క స్థానమైనా గెలుచుకోగలరా?

★ పలానా అభివృద్ధి చేసి మేము ప్రజల మద్ధతుతో గెలిచామని చెప్పే ధైర్యం మీకు వుందా?

★ ఏ విధంగా పరిపాలన చేయకూడదో దేశంలో జగన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి.

★ సంక్షేమం, అభివృద్ధితో కాంతులీనాల్సిన రాష్ట్రాన్ని అరాచకాలతో అట్టుడుకిస్తున్నారు.

★ అరాచకం మూడు పువ్వులు.. ఆటవికం ఆరు కాయలు అన్న విధానం రాష్ట్రంలో వుంది.

★ మీరు అడుగేస్తే అప్పులు. నోరు తెరిస్తే బూతులు తప్ప 22 నెలల్లో ప్రజలకు ఏమిచ్చారు?

★ వైసీపీని ఇంటికి సాగనంపే రోజులు రాబోతున్నాయి.

★ మున్సిపల్, పురపాలక ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం మళ్లీ పురుడుపోసుకుంటుంది.

★ టీడీపీ కార్యకర్తలంతా అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles