Sunday, April 11, 2021

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ బుద్దా వెంకన్న విలేకర్ల సమావేశం

అమరావతి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, శ్రీ బుద్దా వెంకన్న విలేకర్ల సమావేశం వివరాలు..

అవినీతి ముఖ్యమంత్రులను జైలుకు పంపిన సుబ్రహ్మణ్యస్వామి, అవినీతి చక్రవర్తితో కలిసి భోజనం చేయడం విడ్డూరంగా ఉంది.

– ప్రత్యేక విమానంలో తిరుమలకు వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, స్వామివారిని కూడా దర్శించుకోకుండా అవినీతి చక్రవర్తితో కలిసి భోజనం చేయడమేంటి?

– ఎందరో అవినీతి ముఖ్యమంత్రులను జైలుకుపంపిన వ్యక్తి, అవినీతి సామ్రాట్ తో ఏం మంతనాలు జరిపారు?

– సుబ్రహ్మణ్యస్వామికి జగన్ తో ఉన్న లాలూచీ ఏమిటో, వారిద్దరి మధ్యజరిగిన చర్చలేమిటో ఆయనే బయటపెట్టాలి.

– ఎవరి మెప్పుకోసం సుబ్రహ్మణ్యస్వామి చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని పసలేని ఆరోపణలు చేశారు?

– రాజకీయ ప్రయోజనాలతోనే సుబ్రహ్మణ్యస్వామి, జగన్ తో సమావేశమయ్యాడని ప్రజలకు అర్థమైంది.

– జగన్ పై, ఆయనప్రభుత్వ అవినీతిపై తెలుగుదేశంపార్టీనే పోరాడుతోందనే వాస్తవం సుబ్రహ్మణ్యస్వామికి తెలియకపోవడం విడ్డూరంగా ఉంది.

– మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుచేసింది.

– పోలీసులు, అధికారుల సాయంతో టీడీపీవారిని అడ్డుకొని రాత్రికిరాత్రే వైసీపీ నేతలు డబ్బు పంపిణీ చేశారు.

– మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి జగన్ ప్రభుత్వంపై ఉన్న భయమే కారణం.

– కొల్లురవీంద్ర నిజంగా ఎన్నికల విధులకు ఆటంకం కల్గిస్తే, అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు?

– తాడేపల్లి ఆదేశాలకోసం పోలీసులు ఎదురుచూశారా?

★ తిరుమలకు వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, స్వామివారిని కూడా దర్శించుకోకుండా, రాజకీయాలే పరమావధిగా పనిగట్టుకొనిమరీ సంచలన వ్యాఖ్యలు చేశారని, ప్రత్యేకవిమానంలో సుబ్రహ్మణ్య స్వామిని తిరుపతికి తీసుకొచ్చి, ఆయనతో చెప్పించాల్సింది చెప్పించి, చంద్రబాబు నాయుడిపై కేసులు వేయించాలని చూడటం, ఎందరో అవినీతిపరులకు శిక్షలుపడేలాచేసిన సుబ్రహ్మణ్యస్వామి, ఎవరో చెప్పింది విని లైన్ తప్పి మాట్లా డటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు.

★ గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…

★ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

★ ఆయన 16నెలలు జైల్లోఉండివచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అవినీతికి పరాకాష్టగా మారిపోయారు.

★ ప్రత్యేక విమానంలో తిరుమలకు వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, స్వామివారినికూడా దర్శించుకోకుండా జగన్ తో కలిసి వేడివేడి భోజనంచేసి, రహస్యమంతనాలుజరిపి, తిరిగి ఢిల్లీవెళ్లిపోయారు.

★ సుబ్రహ్మణ్యస్వామి ఇతరుల అవినీతి గురించి మాట్లాడేముందు, ఆయన ప్రత్యేకవిమానం ఖర్చులు ఎవరు భరించారో ఆయనే చెప్పాలి.

★ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన తిరుపతికి వచ్చి రహస్యమంతనాలు జరిపారని అర్థమవుతోంది.

★ ఎవరితో కలిసి ఆయన వేడివేడి భోజనం చేశారో, ఆసమయంలో ఏంచర్చించారో ఆయనే బహిర్గతంచేయాలి.

★ తనదారి ఖర్చులను సుబ్రహ్మణ్యస్వామే పెట్టుకున్నారా? లేక భోజనం పెట్టినవారే భరించారా? ఇదివరకు సుబ్రహ్మణ్యస్వామి పై ప్రజలకు గౌరవముండేది.

★ అవినీతిచక్రవర్తితో కలిసి ఆయన ఎప్పుడైతే భోజనాలు చేశారో, అప్పుడే ఆయనపైఉన్న గౌరవం పోయింది.

★ దేవాదాయ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని సుబ్రహ్మణ్యస్వామి జగన్ ను అడిగారా?

★ పింక్ డైమండ్ ఏమైందని, రాష్ట్రంలో 165కుపైగా దేవాలయాలపై దాడులు ఎందుకు జరిగాయని సుబ్రహ్మణ్యస్వామి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడా?

★ సుబ్రహ్మణ్యస్వామి ఏదో రాజకీయప్రయోజనం ఆశించే జగన్ తోసమావేశమైనట్టు, జగన్ ఆయన్ని ప్రలోభపె ట్టినట్టు అనిపిస్తోంది.

★ ఎందరో అవినీతి ముఖ్యమంత్రులను గతంలో జైలుకు పంపిన సుబ్రహ్మణ్యస్వామి, నేడు ఈ విధం గా ప్రవర్తించడం సిగ్గుచేటు.

★ జగన్మోహన్ రెడ్డిపై పోరాడుతోంది తెలుగుదేశం పార్టీ, ఆపార్టీ నేతలు మాత్రమేననే వాస్తవాన్ని సుబ్రహ్మణ్యస్వామి తెలుసుకోవాలి.

★ రాష్ట్రంలోని ప్రసారమాధ్య మాలు, పత్రికలతోపాటు, జాతీయ పత్రికలను చూస్తే, ఆయనకు వాస్తవాలు బోధపడతాయి.

★ టీడీపీ మాట్లాడటం లేదని సుబ్రహ్మణ్యస్వామి చెప్పడం విడ్డూరానికే విడ్డూరం.

★ ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే, జగన్ తో లాలూచీ పడినట్టుగా ఉంది.

★ సుబ్రహ్మణ్యస్వామి తనపార్టీతో సంబంధంలేకుండా ప్రత్యేకవిమానంలోవచ్చిమరీ, జగన్మోహన్ రెడ్డితో సమావేశ మవ్వాల్సిన సందర్భం ఏమొచ్చింది?

★ రాష్ట్రానికి హడావుడి గా వచ్చి, ఏదేదోచెప్పాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిం ది?

★ చంద్రబాబునాయుడిపై గతంలో రాజశేఖర్ రెడ్డి అనేక ఆరోపణలుచేసి, లెక్కకు మిక్కిలి కేసులువేసి, భంగపడ్డాడనే వాస్తవాన్ని, ఇప్పుడు కేసులువేస్తానంటున్న సుబ్రహ్మణ్య స్వామి గ్రహించాలి.

★ సుబ్రహ్మణ్యస్వామికి చేతనైతే, అవినీతి ని, అవినీతికిపాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి.

★ చంద్రబాబునాయుడిని, ప్రజలపక్షాన పోరాడుతున్న ఆయ న తీరుని ప్రశ్నించడం మానేస్తే మంచిది.

★ సుబ్రహ్మణ్యస్వామి తనవయసుని, అనుభవాన్ని గుర్తుంచుకొని తనకున్న గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని సూచిస్తున్నాను.

ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఇటువంటి ఎన్నికలు చూడలేదు : బుద్దా వెంకన్న

★ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ ఇటువంటి ఎన్నికలు చూడలేదు.

★ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలుపుకోసం అధికారపార్టీ వేలకోట్లను మంచినీళ్లలా ఖర్చు చేసింది.

★ పోలీసుల సాయంతో, వారిపర్యవేక్షణలోనే 9వతేదీ సాయంత్రం నుంచి 10వతేదీ ఉదయంవరకు అధికారపార్టీ వారు డబ్బులుపంచారు.

★ టీడీపీనేతలు, కార్యకర్తలు ఎక్కడ తమను అడ్డుకుంటారోనన్న భయంతో, వారిని ముందుగానే ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.

★ తప్పుడుకేసులుపెట్టి నిర్బంధించారు.

★ టీడీపీ అభ్యర్థులను, ఏజెంట్లను బెదిరించారు.

★ అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకొని గెలుపుకోసం జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా రాజకీయాలుచేసింది. ఇది ప్రజలందరికీ తెలుసు.

★ జగన్ ప్రభుత్వానికి, పోలీసుల దాష్టకాలకు భయపడే ప్రజలు ఓటింగ్ కు రాలేదు.

★ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి అదేప్రధానకారణం.

★ ఫలానా రంగు చొక్కానే వేసుకోవాలనే నిబంధన ఏమైనా రాజ్యాంగంలో ఉందా?

★ నెల్లూరుజిల్లాలో రాజేంద్ర అనే దళితనేత, పసుపు చొక్కా వేసుకుంటే, పోలీసులు నడిరోడ్డుపై అతనితో చొక్కా విప్పించారు.

★ పోలీసులు చేసింది సరైనపనేనా? సుబ్రమ్మణ్య స్వామిలాంటి మహామేథావులు ఇటువంటివాటిపై కూడా ప్రశ్నించాలి.

★ తానురాష్ట్రంలో ఉన్నరోజునే, దళితుడిచొక్కా విప్పించి, అతన్ని రోడ్డుపై అవమానించారని, అటువంటి ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి వంటివారు స్పందించకపోతే ఎలా?

★ దళితులు పుసుపుచొక్కా వేసుకోకూడదని ఎక్కడ రాసిఉందో చెప్పాలి.

★ దళితుడనే కదా రాజేంద్రను పోలీసులు అలా అవమానించారు.

★ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులను అలా అవమానించగల ధైర్యం పోలీసులకు ఉందా?

★ జగన్ నాయకత్వంలో దళితులకు, బీసీలకు రక్షణ లేదని చెప్పడానికి ఇంతకంటే ఏం ఉదాహరణకావాలి?

★ మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఎలాంటివాడో, ఎంతటి సౌమ్యుడో అందరికీ తెలుసు.

★ గతంలో హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేశారు.

★ నానారకాలు గా హింసించారు.

★ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో మరలా అరెస్ట్ చేశారు.

★ ఆయన నిజంగా అధి కారులు, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే, అక్కడే అరెస్ట్ చేయాలి.

★ ఇంటికొచ్చాక, మరుసటిరోజు అరెస్ట్ చేయడమేంటి … తాడేపల్లినుంచి ఆదేశాలువచ్చేవరకు ఎదురుచూశారా?

★ జగన్ తో వేడివేడి భోజనం చేసిన సుబ్రహ్మణ్యస్వామికి ఇటువంటి ఘటనలు కనిపించడంలేదా? వాటిపై ఆయన జగన్ ని నిలదీయరా? ఆయన మంచి న్యాయవాది కూడా.. అటువంటివ్యక్తి జగన్ తో కలిసి భోజనాలు చేయడమేంటి?

★ చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకోవడమేంటి?

★ పత్రికలు, వార్తాఛానళ్లను సుబ్రహ్మణ్యస్వామి తప్పుపట్టడమేంటి?

★ జగన్ కు, ఆయన ప్రభుత్వానికి భయపడే ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి బయటకు రాలేదు.

★ స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతంపెరుగుతుంది.

★ అలా పెరగలేదంటే, అందుకు ప్రభుత్వంపై ఉన్నభయమే కారణం.

★ అధికారులు, పోలీసులు ప్రజలను, వ్యాపారులను, కార్మికుల ను నానారకాలుగా భయపెట్టారు.

★ ప్రభుత్వ ఆదేశాలతోనే వారు అలాచేశారు.

★ ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతంకావు.

★ మా ప్రభుత్వం వస్తుంది.

★ వచ్చిననాడు ప్రజలను భయపెట్టిన వారిని, వారిని భయపెట్టి పనిచేయించినవారిని వదలం.

★ ఈవిషయం అందరూ గుర్తుంచుకుంటే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles