ప్రకాశం జిల్లా (కొండపి)
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనసభ్యులు, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పత్రికా ప్రకటన వివరాలు..
జగనన్న దళిత విద్యార్థుల ద్రోహ పథకం
– దళితులకు నాడు ముద్దులు – నేడు గుద్దులు, రద్దులు
– దళిత ద్రోహి జగన్
★ దళితులను ఉద్ధరిస్తానని ఉత్తర ప్రగల్బాలు పలికి దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డికి దళితుల అణచివేతలు తప్పా మరేమి కనపడటం లేదు.
★ దళిత విద్యార్ధులకు అమలులో ఉన్న పథకాలను రద్దు చేస్తూ దళిత ద్రోహిగా మారారు.
★ మొన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పధకాన్ని రద్దు చేశారు నిన్న అంబెడ్కర్ విదేశీ విద్యా పధకాన్ని రద్దు చేశారు.
★ నేడు పి.జి విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్, మెస్ చార్జీలు రద్దు చేశారు.
★ గతంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు నాలుగు జతల యూనిఫామ్ ఇస్తుంటే జగనన్న విద్యాకానుక పధకంతో మూడు జాతలకు కుదించబడింది.
★ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతులు మొదలయ్యి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు యూనిఫామ్ ఒక్క జత కూడా ఇవ్వలేదు.
★ అమ్మఒడి పుణ్యాన ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతుంటే ఇద్దరికి ఇవ్వవలసిన కాస్మోటిక్ చార్జీలను ఒకరికి మాత్రమే చెల్లించడం మేనామామగా చెప్పుకునే జగన్ రెడ్డి గారు దళితులపై చూపే వివక్షకు నిదర్శనం.
★ అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో జూనియర్ ఇంటర్ లో సుమారు 1000 సీట్లను రద్దుచేశారు.
★ అంటే వచ్చే విద్యా సంత్సరంలో 2000 మంది దళిత విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.
★ ఇది దళితులపై కపట ప్రేమను ఒలకపోస్తూ పేద దళితులను మోసం చేయడం కాదా?
★ నిన్న క్రిస్మస్ కానుక గా ప్రైవేట్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు విద్యాకానుక మరియు వసతి దీవెనను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులివ్వడం పేద ప్రజలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను దూరం చేయడం కాదా?
★ మీకు దళితులు పేదలు వృద్ధి చెందాలనే అభిలాష ఉంటే పైన చెప్పిన పధకాలన్నింటిని పునరుద్ధరించండి లేకుంటే మిమ్మల్ని దళిత జాతి ఎన్నటికీ క్షమించదు.
